సూపర్ ఎక్స్‌క్లూజివ్

Adms Scam: ఏడీఎంఎస్.. డ్రామాస్..! స్వేచ్ఛ కథనంతో నిర్వాహకుల్లో వణుకు

 పర్మిషన్లు ఉన్నాయంటూ కవరింగ్
 డేట్ అయిపోయిన సర్టిఫికెట్లతో హడావుడి
 అడ్డంగా దొరికిపోయినా కూడా బుకాయింపు


కమీషన్ల పేరుతో ఏడీఎంస్ జోరుగా దందా
స్వేచ్ఛ సంచలన కథనంతో కమీషన్ల ముఠా బెంబేలు
కాలం చెల్లిన హెచ్ఎంసీ, ఐఎస్‌వో సర్టిఫికెట్లు
అవికూడా శానిటరీ నాప్‌కిన్స్ పర్మిషన్లే
ఈ – బైక్స్‌కు శానిటరీ నాప్‌కిన్స్‌కు సంబంధమేంటి?
మధ్యలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎందుకొచ్చింది?
చేతులు మారుతున్న డబ్బు సంగతేంటి?

స్వేచ్ఛ కథనంతో ఏడీఎంఎస్‌ నిర్వాహకుల్లో భయం మొదలైంది. స్కీముల్లో చేరిన వారంతా ఇప్పుడు దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. టీమ్ లీడర్లు ఏం చేయాలో పాలుపోక, తప్పుడు కథనాలంటూ జనాన్ని ఇంకా మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ సర్టిఫికెట్ల సంగతేంటో చూద్దామని స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ చేయగా, మరిన్ని సంచలన విషయాలు తెలిశాయి. దమ్ముంటే ఏడీఎంఎస్ నిర్వాహకులు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.


స్వేచ్ఛ స్పెషల్ డెస్క్: తాము నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని డ్రామాలకు తెర తీసిన ఏడీఎంఎస్, అన్ని అనుమతులు ఉన్నాయని కొన్ని పేపర్లు చూపిస్తున్నది. వాటిని పరిశీలిస్తే, ఎప్పుడో కాలం చెల్లిందని తేలింది. అవి కూడా ఈ – కార్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ వసూళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లు కావు. ఈ సంస్థకు హెచ్ఎంసీ ద్వారా గతంలో ఓ సర్టిఫికెట్ జారీ అయింది. దాన్ని ఐఎస్‌వో సర్టిఫికెట్ అంటూ ఏజెంట్లు చెప్పుకుంటున్నారు. దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, అసలు మ్యాటర్ అర్థమవుతుంది. శానిటరీ నాప్‌కిన్స్ క్వాలిటీగా తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నందుకు ఇచ్చిన సర్టిఫికెట్ అది. దానికి, ఈ – బైక్స్ వ్యాపారానికి, మల్టీలెవల్‌ మార్కెటింగ్‌కు ఏం సంబంధం? పైగా, ఈ సర్టిఫికెట్ వాలీడ్ కాదు. అక్టోబర్ 9, 2023 నాటికే డేట్ అయిపోయింది. ఐఎస్‌వో 14001 సర్టిఫికేట్ కూడా అంతే. క్వాలిటీ శానిటరీ నాప్‌కిన్స్‌ను కస్టమర్లకు అందిస్తున్నందుకు జారీ చేసినట్లు ఈ సర్టిఫికెట్‌లో క్లియర్‌గా ఉంది. అసలు ఆ సర్టిఫికెట్‌కు ఇప్పుడు నిర్వహిస్తున్న మనీ సర్క్యులేషన్ బిజినెస్‌కు సంబంధమే లేదు. ఈ సర్టిఫికెట్‌ కూడా అక్టోబర్ 9, 2023నే ఎక్స్‌పైరీ అయిపోయింది. కాలం చెల్లిన సర్టిఫికెట్లనే ఇంకా చూపిస్తున్నారంటే ఎంతగా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉద్యం సర్టిఫికేట్ అని ఇంకొకటి చూపిస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరహా ఫ్యాక్టరీల ఏర్పాటుకు అందజేస్తుంది. ఇందులో మ్యానుఫ్యాక్చర్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్, అదే శానిటరీ నాప్‌కిన్స్ తయారీ కోసం ఏర్పాటు చేసే టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రీకి ఇచ్చారు. అసలు ఈ – బైక్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఏం ఉండాలి? వాహన తయారీకి సంబంధించిన అనుమతులు, బైక్ ఫ్యాక్టరీకి సంబంధించిన సర్టిఫికెట్లు, అవార్డులు. కానీ, అవేవీ ఈ సైట్‌లో కనిపించవు.

ఈ ప్రశ్నలకు బదులేది?

శానిటరీ నాప్‌కిన్స్ తయారీ కోసం లైసెన్స్‌లు తీసుకొని, వాటి పేరుతో ఈ – బైక్స్ అమ్ముతామని చెప్పి, చివరికి మల్టీ లెవల్ మార్కెటింగ్‌ చేయడం ఏంటి? దీనిపై ఏడీఎంఎస్ సమాధానం చెబుతుందా? తమది ఈ – బైక్స్ వ్యాపారమని చెబుతూ, లోపల మల్టీ లెవల్ మార్కెటింగ్ ఎందుకు? దీన్నిబట్టే అర్థమవుతుంది మీ బాగోతం. అసలు, ఈ – బైక్స్ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్లు ఎక్కడ? మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌, మనీ సర్క్యులేషన్ చేయడానికి అనుమతులున్నాయా? దమ్ముంటే దీనిపై సమాధానం చెప్పండి.

ప్రజలారా.. బీ కేర్‌ఫుల్

ఇప్పటికే ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్‌లో లక్షలాది మంది చేరినట్టు తెలుస్తున్నది. ఉన్నట్టుండి కంపెనీ బోర్డు తిప్పేస్తే పరిస్థితేంటి అనేది ఆలోచించండి. అసలు ఏడీఎంఎస్ కొద్ది కాలంలోనే కుచ్చుటోపీ పెట్టేందుకు రెడీ అయ్యిందని టాక్. అందుకే అందినకాడికి దోచేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. కంపెనీ ఎత్తేస్తే సమాధానం చెప్పేది ఎవరు? కొత్తగా ఇందులో ఇరుక్కున్నవారు ఎవరిని అడగాలి? బైక్‌లు అమ్ముకోవాల్సిన కంపెనీ కొనకపోయినా పర్వాలేదని ఎందుకు చెబుతున్నది? కేవలం ఐడీ జనరేట్ చేసుకుని కొత్తవారిని ఎందురు చేర్పించమంటున్నది? చిన్న ప్రొడక్ట్‌ కూడా మీ చేతిలో పెట్టకుండా రూ.15 వేలు ఎందుకు లాక్కుంటోంది? ఇప్పటికైనా కాస్త తెలివిగా ఆలోచించండి.

Just In

01

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Sreeleela: పెళ్లి తర్వాత అలాంటి పాత్రలే ఎక్కువ చేస్తా.. వైరల్ అవుతున్న శ్రీలీల బోల్డ్ కామెంట్స్

Telangana: ‘దూపదీప నైవేథ్యం’ స్కీమ్‌.. ఆలయాల నుంచి భారీగా దరఖాస్తులు.. అధికారుల మల్లగుల్లాలు!

Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్.. వీడియో వైరల్