Tollywood actress
ఎంటర్‌టైన్మెంట్

Tollywood actress : హీరోయిన్‌కి వరుసగా హిట్స్.. అయినా రానీ క్రేజ్!

Tollywood actress : సినీ పరిశ్రమలో ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. లక్ ఉంటే.. కొందరు ఒక్క మూవీతోనే పెద్ద స్టార్ అయిపోతుంటారు. మరికొందరు ఎన్ని సినిమాలు తీసినప్పటికీ స్టార్ స్టేటస్ అనేది తెచ్చుకోలేపోతుంటారు. ఇక ఒక హీరోయిన్ మాత్రం వరుసగా హిట్ మూవీస్ తీస్తున్నప్పటికీ స్టార్ డమ్ అనేది ఇంకా రాలేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుగు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మంచి ఫేమస్ అయింది. టాలీవుడ్ లో మంచి రోల్స్ ఎంచుకుంటూ.. ఒక్క ప్లాప్ కూడా లేకుండా సినీ కెరీర్ లో రాణిస్తుంది. అయినా కూడా ఈ భామకు సరైన క్రేజ్ మాత్రం రావడం లేదు. ఆమె ఎవరో కాదు.. రీతూ వర్మ.

రీతూ వర్మ.. 2012లో 48హెచ్ఆర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటేషన్‌లో తన మొదటి షార్ట్ ఫిల్మ్ బెస్ట్ చిత్రంగా అవార్డు సొంత చేసుకుంది. ఇందులో రీతూ వర్మకు ఉత్తమ నటిగా కూడా అవార్డు సొంతం చేసుకుంది. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే చిత్రంలో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాల్లో నటించింది. 2016లో విజయ్ దేవరకొండ సరసన ‘పెళ్ళిచూపులు’ అనే మూవీలో నటించి అందరి ప్రశంసలు పొందింది. అద్భుతమైన నటనతో పాటు అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు తమిళంలో కూడా పలు మూవీస్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు రీతూ వర్మ నటించిన అన్ని చిత్రాలు కూడా మంచి హిట్స్ అయ్యాయి. అయినా ఈ ముద్దుగుమ్మకు సరైన క్రేజ్, స్టార్ డమ్ మాత్రం రావడం లేదు.

Ritu Verma

రీతూ వర్మ క్లీన్ ఇమేజ్‌తోనే ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా అసభ్యకరమైన సన్నివేశాల్లో యాక్ట్ చేయలేదు. అభ్యంతరకరమైన డ్రెస్‌ల్లో తెరపై కనిపించలేదు. సాధారణంగా క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోయిన్‌లను దర్శకులు ఆప్షన్స్‌గా చూడరు. అయితే రీతూ వర్మకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది. ఇక రీతూ వ‌ర్మ తాజాగా ‘మ‌జాకా అనే మూవీలో నటించింది. సందీప్‌కిష‌న్ హీరోగా నటించిన సినిమా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. త్రినాథ‌రావు న‌క్కిన ఈ మూవీకి డైరెక్షన్ వహించాడు. ఇందులో రావుర‌మేష్‌, అన్షు ప్రధాన పాత్రల్లో నటించారు. మంచి కలెక్షన్ రాబడుతూ ముందుకు దూసుకెళ్తోంది.

Also Read: మరోసారి అనసూయకు విరాట్ కర్ణ సినిమాలో ఛాన్స్

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?