Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఉన్న బీజేపీ (Bjp) ప్రభుత్వం అన్ని వర్గాలను ప్రశ్నించకుండా అణచివేస్తోందంటూ చెప్పుకొచ్చాడు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ధోరణి దేశాన్ని వెనక్కు తీసుకెళ్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని.. అడిగితే అణచివేసే కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే నని.. ఇప్పుడొచ్చిన బీజేపీ అసలు దేశానికి ఏం చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ దేశ నిర్మాణంలో ఉందని.. బీజేపీ మాత్రం ప్రశ్నించే వారిని వేధిస్తుందంటూ మండిపడ్డారు. ఇప్పుడు జై భీమ్, జై బాపు నినాదాలు చాలా అవసరం అని.. దేశ ప్రజలంతా కలిసి బీజేపీని ఓడించాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో చేసిన కులగణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని.. దాని వల్ల వెనకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతికొద్ది రోజుల్లోనే చాలా స్కీములు వర్తింపజేశామని.. త్వరలోనే మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు.