meenakshi
తెలంగాణ

Meenakshi Natarajan: బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఒకటే… అదే మా స్పెషాలిటి

Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. పార్టీ విస్త్రృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఆమె నేడు హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవన్నారు. బూత్ స్థాయి కార్యకర్త నుంచి జాతీయ నేతల వరకు ప్రజాస్వామ్యం ఎక్కువేనని చెప్పారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు.

కాగా, ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగిన మీనాక్షికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్వాగతం పలికారు. అనంతరం దిల్ కుషా అతిథి గృహానికి వెళ్లిన ఆమె.. అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్ గౌడ్ తో భేటీ అయ్యారు. ఇక, మధ్యాహ్నం గాంధీభవన్‌లో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

ఇదిలావుంటే, కొద్ది రోజుల క్రితమే మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఇన్ చార్జీగా ఉన్న దీపాదాస్ మున్షీ అధిష్ఠానం వైదొలగడంతో ఈమెకు బాధ్యతలు అప్పగించారు. అగ్రనేత రాహుల్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారిలో  మీనాక్షి కూడా ఒకరు. ఆమె పార్టీ వ్యవహారాల విషయంలో క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినంగా ఉంటారని వినికిడి. ఈ నేపథ్యం కారణంగానే పలువురు నేతలు జాగ్రత్తగా ఉంటున్నటారని టాక్.

మీనాక్షీ ఇన్ చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ నేతలతో జూమ్ కాల్ మీట్ నిర్వహించారు. పార్టీలో అంతర్గతంగా అది తీవ్ర చర్చనీయాంశమైంది. జూమ్ మీట్ లోనే తన పనితనం ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేలా, ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో తెలిసొచ్చేలా వ్యవహరించినట్లు తెలిసింది. ఏదైమైనా మీనాక్షీ మేడం లాంటి స్ట్రిక్ట్ క్యాండేట్ రాకతో పార్టీలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.

Just In

01

Khammam District: ఆశ్రమ స్కూల్లో హెడ్ మాస్టర్ ఇష్టా రాజ్యం.. ఉద్యోగం ఒకరిది విధుల్లో మరొకరు.. ఎక్కడంటే.?

Bigg Boss 9 Telugu: అతనికి మాత్రమే సపోర్ట్ చేస్తూ.. బిగ్ బాస్ పై నాగబాబు సంచలన పోస్ట్

Local Body Elections: స్థానిక ఎన్నికలు ఎప్పుడు?.. ఎదురుచూస్తున్న ఆశావహులు..?

Srinivas Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాల్సిందే: శ్రీనివాస్ గౌడ్

CM Revanth Reddy: నేడు కీలక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన.. ఎక్కడంటే..?