SS Rajamouli : | రాజమౌళిపై స్నేహితుడి ఆరోపణల్లో నిజం ఎంత..?
SS Rajamouli
ఎంటర్‌టైన్‌మెంట్

SS Rajamouli : రాజమౌళిపై స్నేహితుడి ఆరోపణల్లో నిజం ఎంత..?

SS Rajamouli : స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాస రావు చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. సాధారణంగా రాజమౌళి ఎలాంటి వివాదాలకు పోరు. ఎంతసేపు తన సినిమాలు తప్ప వేరే విషయాలను పట్టించుకోరు. అలాంటి రాజమౌళిపై ఫ్రెండ్ అయిన శ్రీనివాసరావు (srinivasa rao) మరణ వాంగ్మూలం పేరుతో చేసిన వీడియో తీవ్ర సంచలనం రేపుతోంది. తనను రాజమౌళి, రమా కలిసి వేధిస్తున్నారని.. తన చావుకు వారిద్దరే కారణం అంటూ అందులో చెప్పాడు.

ఆయన చెబుతున్న దాని ప్రకారం 90 దశకం నుంచే వీరిద్దరికీ స్నేహం ఉంది. అప్పటికి శాంతి నివాసం సీరియల్ ఇంకా రాలేదు. అప్పట్లో వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారంట. రాజమౌళి కోసం తాను త్యాగం చేసి బ్యాచిలర్ గానే ఉండిపోయానని శ్రీనివాసరావు చెబుతున్నారు. ఇప్పుడు రాజమౌళి పెద్ద డైరెక్టర్ అయ్యాడు కాబట్టి.. ఆ అమ్మాయి విషయం తాను ఎక్కడ బయటపెడుతానో అని తనను టార్చర్ చేస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ.

అయితే రాజమౌళి ఇప్పుడు ఏమీ చిన్న పిల్లోడు కాదు. ఆయన వయసు 50 ఏళ్లు దాటిపోయింది. తన కొడుకుకు కూడా పెళ్లి అయింది. ఈ వయసులో అప్పుడెప్పుడో జరిగిన అమ్మాయి విషయం తెలిస్తే పెద్ద సీరియస్ మ్యాటర్ ఏమీ కాదు. పైగా సినిమా వాళ్లకు ఇలాంటి సర్వ సాధారణం. రాజమౌళి ఆ అమ్మాయిని ఏమైనా మోసం చేశాడా అనే దానికి అసలు రుజువే లేదు. పైగా శ్రీనివాసరావు చెప్పే వరకు అలాంటిది ఒకటి జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు.

ఒకవేళ నిజంగానే రాజమౌళి అమ్మాయిని ప్రేమించాడని అనుకుందాం. ఆ విషయం ఇప్పుడు తెలియడం వల్ల రాజమౌళికి పోయేదేమైనా ఉందా అంటే ఏమీ లేదు. దాని కోసం రాజమౌళి ఒక మనిషిని చంపేంత టార్చర్ పెడుతాడా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అమ్మాయి విషయం కంటే కూడా అలా టార్చర్ చేస్తున్నాడని బయటకు తెలిస్తేనే రాజమౌళికి అసలు సమస్య కదా. ఇప్పుడు శ్రీనివాసరావు చెబుతున్న దాంట్లో ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా లేదు. నిజంగానే శ్రీనివాస రావు సూసైడ్ చేసుకున్నాడా లేదంటే బ్రతికే ఉన్నాడా అనేది తెలియదు. ఇదంతా ఫేమస్ కావడానికి చేస్తున్నాడేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేదు. నిజనిజాలు తెలియాలంటే పోలీసులే బయటపెట్టాలి.

Just In

01

Ramchander Rao: బీజేపీ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపితే తాట తీస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!

Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా?.. మంచు మనోజ్ చెప్పేది వింటే ఏమైపోతారో?