Balakrishna
ఎంటర్‌టైన్మెంట్

Balakrishna : గ్రామస్తులపై బాలకృష్ణ ఫైర్.. పట్టించుకోను వెళ్లిపోండి అంటూ..!

Balakrishna :  నందమూరి బాలకృష్ణ మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయం అడగడానికి వచ్చిన వారిపై ఇష్టారీతిన ఆగ్రహం వ్యక్తం చేశాడు.  బాలకృష్ణ చాలా రోజుల తర్వాత తన స్వగ్రామం అయిన కృష్ణాజిల్లాలోని నిమ్మకూరుతో పర్యటించారు. బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్​ అవార్డు ప్రకటించిన తర్వాత మొదటిసారి ఆయన రావడంతో గ్రామస్థులు, నందమూరి అభిమానులు అంతా సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గ్రామంలోని తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణను కలిసేందుకు కొమరవోలు గ్రామస్తులు వచ్చారు. తమ గ్రామాన్ని పట్టించుకోవాలని అభవృద్ధికి సాయం చేయాలని కోరారు. కానీ బాలకృష్ణ మాత్రం ‘పట్టించుకోను.. ఫొటో దిగారు కదా వెళ్లిపోండి.. అసలు ఆ ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా అక్కడున్న కెమెరాల్లో రికార్డు అయింది. దాంతో బాలకృష్ణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. సాయం చేస్తే చేయాలి లేదంటే ఊరుకోవాలి. అంతే గానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటంటూ కామెంట్లు పెడుతున్నారు.

త్వరలోనే ఎన్టీఆర్ కు భారతరత్న వస్తుంది..

తన తండ్రి ఎన్టీఆర్ (ntr) కు భారతరత్న అవార్డు త్వరలోనే వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు బాలకృష్ణ. నిమ్మకూరుకు వస్తే ఎనలేని సంతోషం వస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక బాలకృష్ణ వరుస హిట్లతో జోరు మీదున్నాడు. రీసెంట్ గానే డాకు మహారాజ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. దాని తర్వాత మరో రెండు సినిమాలను ప్రస్తుతం లైన్ లో పెట్టాడు.

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!