Kamakshi Bhaskarla : సాధారణంగా హీరోయిన్లు తమ వీక్ నెస్ పాయింట్లను అస్సలు బయట పెట్టరు. ఎందుకంటే వాటితో తాము ఎక్కడ చులకన అవుతామో అనుకుంటారు. కానీ తాజాగా హీరోయిన్ (Heroin) కామాక్షి భాస్కర్ల మాత్రం తాను చేసిన పనిని బయట పెట్టేసింది.
పొలిమేర (Polimera) సినిమాతో కామాక్షి భాస్కర్ల ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ ను షేర్ షేర్ చేస్తూ ఉంటుంది. ఆమెకు ఇప్పుడు వరుసగా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను చైనాలో ఎంబీబీఎస్ చదివాను. ఆ టైమ్ లో అక్కడ బొద్దింకలు, తేళ్లు కూడా తిన్నాను. ఎందుకంటే అప్పుడు చైనాలో గ్రీనరీ లేదు. తినడానికి కూరగాయలు కూడా దొరికేవి కాదు. అందుకే కనిపించిన జంతువులు, పురుగులను తినడం చైనా వాళ్లకు అలవాటు అయింది. నాకు కూడా వేరే అవకాశం లేక అవి తినాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.