Tuesday, May 14, 2024

Exclusive

PM Modi: వికసిత భారతం ఎవరికి?

India Development: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల మేనేజ్‌మెంట్‌ విద్యలో ఆరితేరిన బీజేపీ, ఎప్పటిలాగే ఆకర్షణీయమైన నినాదాలతో జనం ముందుకొచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల వేళ ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ట్ భారత్‌’ అనే నినాదంతో జనం ముందుకు వచ్చింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ అనే మార్గాన్ని తాను ఎంచుకున్నట్లుగా నాటి ప్రధాని అభ్యర్థి మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎవరి పట్లా ఎలాంటి వివక్షా చూపకుండా, అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేయటమే తమ లక్ష్యమని నమ్మబలికారు. తమ హయాంలో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయంటూ ‘అచ్చేదిన్‌ ఆనే వాలేహై’ అనే నినాదాన్ని మోదీ ప్రతి ప్రచార సభలోనూ చెప్పారు. అయితే, నాటి ఆయన వాగ్దానాలన్నీ నీటి మూటలుగానే మిగిలాయి. తొలిదఫా పాలనలో నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వంటివి అనుకున్న లక్ష్యాలకు ఆమడ దూరంలోనే మిగిలిపోవటమే గాక దేశ ఆర్థిక వ్యవస్థను ఒక పెద్ద కుదుపుకు గురిచేసి, సామాన్యుల జీవన ప్రమాణాలను దిగజార్చాయి. ఆ తొలి ఐదేళ్లలో కార్పొరేట్‌ అనుకూల విధానాలు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలకు ఒక బలమైన ప్రాతిపదికను మోదీ ప్రభుత్వం ఏర్పరచింది. పార్లమెంటరీ ప్రాతినిధ్య వ్యవస్థకు ప్రతిబంధకాలు కల్పించడం, రాజ్యాంగ సంస్థలను ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్‌, న్యాయ వ్యవస్థ వంటి రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరచడమనే పని పథకం ప్రకారం సాగిపోయింది.

సర్జికల్ స్ట్రైక్స్ వంటి భావోద్వేగ వాతావరణంలో జరిగిన 2019 ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, నాటి నుంచి క్రమంగా ఎన్డీయే నీడ నుంచి బయటికొచ్చింది. ఈ కాలంలోనే ఆవిర్భావ కాలం నుంచీ తాను చెబుతూ వచ్చిన రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దుకు అవసరమైన న్యాయపరమైన వివాదాలను తొలగించుకోగలిగింది. ఆ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రావటంతో అన్నట్లుగానే 370, 35ఎ అధికరణలను రద్దు చేయటంతో బాటు జమ్మూ-కశ్మీర్‌ను రెండు కేంత్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అదే సమయంలో బాబ్రీ మసీద్‌ స్థానంలో రామాలయ నిర్మాణపు పనులు మొదలుపెట్టింది. స్వయంగా ప్రధాని మోదీ ఆలయానికి భూమిపూజ చేశారు. ఈ ఒరవడిలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) తీసుకొచ్చి దేశంలోని మైనారిటీలను భయాందోళలకు దిగేలా చేసింది. లౌకిక భావన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఉండాల్సిన ఆరోగ్యకరమైన వాతవరణం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన అనే భారత రాజ్యాంగపు మూల స్తంభాలను దెబ్బతీసే పని వేగంగా ఈ రెండోదఫా కాలంలో జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలు విపక్ష నేతలను టార్గెట్ చేసుకోవటం, ఆ నేతల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి అధికార పక్షంలో విలీనమయ్యేలా చేయటం తారస్థాయిలో జరిగింది.

Also Read: South India: భారత్‌లో దశాబ్దకాలంగా దగాపడిన దక్షిణాది

ఇక 18వ లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ మూడేళ్ల ముందునుంచే సిద్ధమవుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల నుంచి ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా సంస్థలు ఉన్నవీ లేనివీ ప్రచారం చేస్తూ, దేశంలో ఒక ఉద్విగ్న వాతావరణాన్ని, అయోమయాన్ని నెలకొల్పే పనిని నిరంతరం కొనసాగిస్తూనే వచ్చారు. 2023 నవంబర్‌ 15న జార్ఖండ్‌లోని ఖుంటి నుంచి బీజేపీ ‘వికసిత భారత్‌’ పేరిట తన సంకల్ప యాత్రను ప్రారంభించింది. మనదేశాన్ని స్వాతంత్రం సిద్దించి వందేళ్లయ్యే 2047 నాటికి సాధికారత, స్వావలంబన కలిగిన దేశంగా మార్చడానికి ప్రజలను సిద్ధం చేసేందుకు, వారికి భవిష్యత్ పట్ల ఒక అవగాహనను ఏర్పరచటమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆ పార్టీ చెప్పొకొచ్చింది. ఈ క్రమంలోనే మోదీ పదేళ్ల పాలన విజయాలను తనదైన శైలిలో ప్రచారం చేసుకుంది. దశాబ్దకాలం క్రితం కంటే ప్రస్తుతం దేశంలోని వ్యవస్థలు, అనేక కీలక రంగాలు మెరుగైన పనితీరును చూపుతున్నాయంటూ ప్రధాని మోదీ తన ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 2023 డిసెంబరులో ‘వికసిత్ భారత్‌‌’ తమ లక్ష్యమని ప్రకటించారు.

వికసిత్ భారత్ నినాదం వినేందుకు బాగుంది గానీ, 2047 నాటికి భారత్ అన్ని రంగాల్లో స్వావలంబన సాధించటం ఎలా?, దానికి కేంద్ర పాలకుల వద్ద ఉన్న రూట్ మ్యాప్ ఏమిటనేది మాత్రం ఎక్కడా మోదీ, ఆయన పార్టీ నేతలు చెప్పటం లేదు. 2023లో ప్రపంచ ప్రజల సగటు తలసరి ఆదాయం 13,800 డాలర్లు. ఇది చైనా తలసరి ఆదాయానికి దాదాపు సమానం. కానీ, మన తలసరి ఆదాయం 2,600 డాలర్లే! పైగా మన జనాభా చైనాను మించిపోయింది. 69లక్షల జనాభాతో నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న మధ్య అమెరికా దేశమైన నికరాగువా, తలసరి ఆదాయం 2,590 డాలర్లు. 9.76 కోట్ల జనాభాతో గనుల ఆదాయం మీద బతికే కాంగో తలసరి ఆదాయం 2,580 డాలర్లు. 3.49 కోట్ల జనాభా గల ఉజ్బెకిస్థాన్‌ తలసరి ఆదాయం 2,560 డాలర్లు. ఎన్నో పంచవర్ష ప్రణాళికలు, మరెన్నో వనరులు, అపారమైన జనశక్తి గల మన తలసరి ఆదాయమూ ఈ దేశాలతో ఉందంటే మనం చెబుతున్న అభివృద్ధి ఎలాంటిదో అర్థమవుతోంది. సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న యూపీఏ కాలంలో వార్షిక సగటు వృద్ధిరేటు 11.48 శాతం కాగా స్థిరమైన, స్పష్టమైన విధానాలు అమలు జరిపినట్లు చెప్పుకుంటున్న మోదీ పదేళ్ల పాలనలో ఇది కేవలం వార్షిక వృద్ధి రేటు 5.44 శాతమే. ప్రజల సంతోషకరమైన జీవితంపై 146 దేశాల్లో చేసిన సర్వేలో మన దేశం 137వ స్థానంలో ఉంది. 2022-23 నాటి ఆకలి సూచీలో మన దేశం 111వ స్థానంలో నిలవటం, ‘పౌర స్వేచ్ఛ సూచీ’లో 150వ స్థానం, ‘లింగ సమానత్వం సూచీ’లో 135వ స్థానం, ‘ఆరోగ్యం, మనుగడ’ సూచీలో 146వ స్థానంలో, ‘పత్రికా స్వేచ్ఛ’ సూచీలో 161వ స్థానంలో, ‘అవినీతి సూచీ’లో 85 వ స్థానం, ప్రజలు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ‘దయనీయ సూచీ’లో 103వ స్థానంలో ఉన్నట్లు, ‘మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ)’లో 132వ స్థానంలో ఉన్నామని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంలో ఉన్న 5 కోట్లమందిలో 1.1 కోట్ల మంది మనదేశంలోనే ఉన్నారని లెక్క తేలింది.

Also Read: విద్వేషపు పునాదులపై ‘సార్వత్రిక’ సమరం

కొవిడ్‌ తర్వాతి కాలంలో దేశం అన్ని రంగాల్లో కోలుకోలేదని చెప్పటానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. కొవిడ్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్‌ పుంజుకుని మంచి లాభాలనే చూపింది. కానీ, దీనివల్ల కలిగిన లాభం సమాజంలోని పై వర్గాల వారికే దక్కింది. మరోవైపు దేశంలోని లిస్టెడ్‌ కంపెనీల లాభాలు ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. అదే సమయంలో ఆ కంపెనీలలో ఉద్యోగుల వేతనాలు, కొత్త ఉద్యోగాల కల్పన మాత్రం తగ్గిపోయింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, సంఘటిత రంగం, ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు బాగానే ఉండగా, అసంఘటిత రంగం కుదేలైపోయింది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం గత 50 ఏళ్లలో ఎన్నడూ పెరగనంత స్థాయిలో ఉంది. దీంతో దేశీయంగా వినిమయ డిమాండ్ తగ్గిపోయింది. కుటుంబ పొదుపు మొత్తాలూ తగ్గిపోయాయి. ఒక్క 2020లోనే 4.5 కోట్ల మంది ప్రజలు తమ రంగంలో ఉపాధి దొరక్క, వ్యవసాయ రంగానికి చేరారు. 84,000 గుర్తింపు పొందిన అంకుర సంస్థలతో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థగా నిలుస్తున్న ఈ సమయంలో.. కోట్ల మంది కనీస అవసరాలకు నోచుకోలేక దారిద్య్రరేఖకు దిగువనే ఉండిపోయారు. మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం ప్రకారం 2014 నాటికి 457 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి అది 681 బిలియన్ డాలర్లకు, 2025 మార్చి నాటికి 748 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఇక, 2014 నాటికి కేంద్ర దేశీయ రుణభారం 58.6 లక్షల కోట్లు కాగా, 2024 మార్చి నాటికి అది రూ. 164 లక్షల కోట్లు. ఇక, విదేశీ అప్పు 5 లక్షల కోట్లు మొత్తం కలిపితే రూ.169 లక్షల కోట్లకు చేరనుంది.

దేశం అభివృద్ధి చెందాలంటే ఎగుమతులు పెరగాలి. పరిశ్రమలు స్థాపించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను మూసేస్తూ, కార్పొరేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయటం వల్ల పారిశ్రామిక అభివృద్ధి జరగదని కేంద్ర పాలకులు తెలుసుకోవాలి. అందరికీ విద్య, వైద్యం అందించటం, దేశంలో మానవ వికాసం, నైపుణ్యాలు పెంచితేనే ఆర్థిక వృద్ది పరుగులు పెడుతుంది తప్ప ప్రపంచ మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నామనే నోరూరించే మాటలతోనో, కంటికి కనపడే విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, వందేభారత్‌ రైళ్లతో కాదని కాదని ఇకనైనా పాలకులు గ్రహించాలి. దేశభక్తి, భారతీయ సంస్కృతి అంటూ ఊదరగొడుతూ విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఊడిగం చేయటం వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న సంగతినీ దేశ ప్రజలు గుర్తించాలి. పదేళ్ల పాలనలోనే కళ్లముందు ఇంత విధ్వంసం జరిగిందని పై గణాంకాలు స్పష్టంగా చెబుతుంటే, ఈ ఎన్నికల్లో మరోసారి ఆ పాలకులే అధికారంలోకి వస్తే జరిగేందేమిటో ఈ లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజలు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి.

సదాశివరావు ఇక్కుర్తి (సీనియర్ జర్నలిస్టు)

Publisher : Swetcha Daily

Latest

Sports News: కోహ్లిపై వైరల్ కామెంట్స్‌ చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

Cricket Player Irfan Pathan Made Comments On Kohli: స్టార్...

Tollywood: టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న హర్రర్‌ మూవీస్‌

Director Actor Sunder About Baak Movie: ప్రస్తుతం ఎక్కడ చూసినా...

Polling: తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

Elections: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది....

Serial Actress: బికినీలో షాకిచ్చిన సీరియల్‌ నటి 

Television Actress Bikini ashika gopal Photos Viral: ఈ మధ్యకాలంలో...

Ambati: ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి

Ambati Sensational Comments On MS Dhoni: సీఎస్‌కే మాజీ కెప్టెన్...

Don't miss

Sports News: కోహ్లిపై వైరల్ కామెంట్స్‌ చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

Cricket Player Irfan Pathan Made Comments On Kohli: స్టార్...

Tollywood: టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న హర్రర్‌ మూవీస్‌

Director Actor Sunder About Baak Movie: ప్రస్తుతం ఎక్కడ చూసినా...

Polling: తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

Elections: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది....

Serial Actress: బికినీలో షాకిచ్చిన సీరియల్‌ నటి 

Television Actress Bikini ashika gopal Photos Viral: ఈ మధ్యకాలంలో...

Ambati: ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి

Ambati Sensational Comments On MS Dhoni: సీఎస్‌కే మాజీ కెప్టెన్...

Parliament Elections: ఓటరు చైతన్యం వెల్లివిరియాలి..!

Parliament Elections Voter Consciousness Should Flow: తెలంగాణలో నేడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 18వ లోక్‌సభకు తెలంగాణలోని 17 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌తో సహా మొత్తం...

Lok sabha Elections: ప్రచారం ముగిసింది, ఇక నిర్ణయమే బాకీ..

The Lok Sabha Campaign is over, Decision Of The Voters Is Pending: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రానికి ముగిసింది. నెలరోజులుగా సాగిన ప్రచారంలో భాగంగా ఊరూరా...

Media: మీడియా స్వేచ్ఛ మేడిపండు కానుందా..?

Media Freedom Will Be A Raspberry: ప్రజాస్వామ్యపు నాలుగు మూల స్తంభాల్లో ఒకటి మీడియా. మరి, ఆ మీడియా నేడు స్వేచ్ఛగా తన పనిచేయగులుగుతుందా.. అంటే లేదనే సమాధానమే వస్తోంది. ప్రపంచపు...