Wednesday, July 3, 2024

Exclusive

Hyderabad:‘ఫేక్’ను ఎలా ఫేస్ చేద్దాం?

  • కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేస్తున్న ఫేక్ రాయుళ్లు
  • తెలంగాణ ఆనవాళ్లు లేని టీఎస్ ఆర్టీసీ లోగో వైరల్
  • అది ఫేక్ లోగో అని ఆర్టీసీ అధికారుల వివరణ
  • మొన్న ఓయూ క్యాంపస్ సర్క్యులర్ కూడా ఫేక్
  • పనిగట్టుకుని పద్ధతిగా ప్రభుత్వాన్ని ఇరికించే యత్నం
  • ఫేక్ క్రియేటర్స్ పై సీఎం సీరియస్
  • మొదట్లో లైట్ గా తీసుకున్న అధికారులు
  • కఠిన చర్యలుంటాయని సీఎం వార్నింగ్

Telangana cm serious on fake rtc logo creaters..cases filed officers :

తెలంగాణ రాజకీయాలలో ఏం జరుగుతోంది? రేవంత్ సర్కార్ ను ఎలాగైనా బద్నాం చేయాలని చూస్తున్నారా కొందరు? మొన్న ఓయూ సర్క్యులర్ ఫేక్ ది రిలీజ్ చేసి తీవ్ర గందరగోళం క్రియేట్ చేశారు ..అలాగే అమిత్ షా ప్రచారంపై ఫేక్ వీడియో కాంగ్రెస్ వారే క్రియేట్ చేశారంటూ అభాండాలు వేశారు. రీసెంట్ గా తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగోను క్రియేట్ చేసి రేవంత్ సర్కార్ ను మరోసారి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ప్రతిసారీ ఇలాగే ప్రభుత్వాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు సోషల్ మీడియా ఫేక్ రాతగాళ్లు. ఏదైనా ఒక అబద్దాన్ని పదేపదే చెబితే అదే నిజం అనుకుంటారు జనం. అందుకే ఈ సమస్యను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలను ప్రచారం చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఫేక్ లోగోపై కేసు నమోదు

తెలంగాణ ఆర్టీసీ సంబంధించి ఫేక్ లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్‌ లోగోను క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబాద్‌ కమిషనరేట్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. గత నెలలో ఓయూ సర్క్యులర్​​ రిలీజ్​ అయినప్పటి నుంచే ఈ ఫేక్​ పోస్టుల పరంపర మొదలైంది. మే 1 నుంచి 31వ తేదీ వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్‌‌ వార్డెన్‌‌ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొందరు వివాదాస్పదం చేశారు. గత కొన్నేండ్లుగా ఇస్తున్నట్లే వర్సిటీకి ఈ ఏడాది కూడా వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో చీఫ్‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నా.. నీటి సమస్య, కరెంటు కోతల అంశాన్ని ప్రస్తావించడం రాజకీయ దుమారం రేపింది. ఉస్మానియా వర్సిటీకి గతేడాది కూడా మే 14 నుంచి జూన్‌‌‌‌‌‌‌‌ 4 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అప్పుడు సైతం నీటి, కరెంటు కోత సమస్యలతో సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉస్మానియా వర్సిటీ నోటీసు నెం.752/సీడబ్ల్యూఓ/హెచ్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఎం/ఓయూ/2023తో జారీ చేసింది. కానీ బీఆర్ఎస్​సోషల్​ మీడియా కన్వీనర్​ మన్నె క్రిశాంక్ .. పాత సర్క్యులర్​లో నీటి సమస్య, కరెంట్​ కోతల విషయం లేనట్లు మార్ఫింగ్​చేసి వైరల్​ చేయడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాయి.

రేవంత్ సర్కారే టార్గెట్

కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే కరెంట్​, నీటి సమస్యలు వచ్చాయనే తప్పుడు ప్రచారాన్ని పబ్లిక్​లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగినట్లు గుర్తించారు. దీంతో క్రిశాంక్​ పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని, దానిపై నంబరు కూడా పెన్నుతో రాశారని, తన సంతకాన్ని సైతం కాపీ చేశారని ఓయూ చీఫ్​వార్డెన్ శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు క్రిశాంక్​పై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియో తయారీలో కీలకంగా వ్యవహరించిన నాగేందర్​పై కూడా కేసు నమోదు చేయడం గమనార్హం. ఇటీవల ఆర్టీసీ లోగోకు సంబంధించి కూడా ఇలాంటి వివాదమే బయటకొచ్చింది. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ కూడా టీజీ సాకుతో పాత లోగోను మార్చిందని, అందులో తెలంగాణతనం లోపించిందని, కాకతీయ కళాతోరణం లేదంటూ ఫేక్​లోగో క్రియేట్​ చేసి వైరల్​ చేశారు. దీనిపైన సీఎం సీరియస్​ కావడంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇలా వరుసగా కరెంట్ కోతలు, వాటర్​ సమస్యలు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా రాజకీయ ప్రేరేపిత ఫేక్​ పోస్టులు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి. నిరుడితో పోలిస్తే ఇదే సమయానికి ధాన్యం కొనుగోళ్లు ఎక్కువ జరిగినా తక్కువ జరిగినట్లు చూపడం, దానిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేయడం గమనార్హం. దీనిపై సంబంధిత శాఖ మంత్రి, అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

నిందితులపై కఠిన చర్యలు

నిరుడు డిసెంబర్​ 7న కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సోషల్​ మీడియాలో ప్రభుత్వంపై కొన్నివర్గాలు పనిగట్టుకొని దుష్ర్పచారం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్​ ఆఫీసర్లు సీఎం రేవంత్​ రెడ్డికి రిపోర్ట్​ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారడంతో ఫ్రస్ట్రేషన్​లో కొంతమంది అలా చేస్తుండొచ్చు అని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని మొదట్లో సీఎం లైట్​గా తీసుకున్నారు. కానీ రోజు రోజుకూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఫేక్​ ప్రచారం పెరుగుతూ పోవడం.. లేనిపోనిది జరుగుతున్నట్లు క్రియేట్​ చేయడంపై అటు ప్రభుత్వంలో, ఇటు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఫేక్​న్యూస్​పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల హెచ్​వోడీలకు, పోలీస్​అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...

Hyderabad: దోచుకోవడమేనా ‘మీ సేవ’

అక్రమార్జనకు నిలయంగా మారిన ‘మీ సేవ ’ కేంద్రం ఎస్ టీ పీ ఆపరేటర్-2 పేరుతో లాగిన్ రాంగ్ రూట్ లో సర్టిఫికెట్ల జారీ ఎమ్మార్వో లాగిన్ ఐడి నుంచి ఆయన...

Bandi Sanjay: మా ఎమ్మెల్యేలకు నిధులివ్వరా?

- ఇదే పని కేంద్రమూ చేస్తే ఏం చేస్తారు? - ఆరు నెలలైనా హామీల అమలేదీ? - జనసేనతో పొత్తుపై నిర్ణయం అధిష్ఠానానిదే - కేంద్రమంత్రి బండి సంజయ్ Congress Govt: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని...