senior congress leader D Srinivas died political celebrities tribute:
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీ. శ్రీనివాస్ శనివారం వేకువ జామున 3 గంటలకు గుండెపోటు రాగా ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. కాగా, డీఎస్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.
‘డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ కు విశిష్ట సేవలందించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’
– సీఎం రేవంత్ రెడ్డి
‘సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం కలిగిన డీ శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’
-మంత్రి పొన్నం ప్రభాకర్
‘ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారు.’
-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
‘డీ.శ్రీనివాస్ మరణం కాంగ్రెస్ కు తీరని లోటు . ఆయన సేవలు మరవలేనివి, డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను.’
– ఎంపీ డీకే అరుణ
‘మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి, డీఎస్ రాజకీయాలలో అపార అనుభవం ఉన్న నేత. బడుగు బలహీన వర్గాలు కోసం ఆయన ఎంతో శ్రమించారు. . డీఎస్‌తో నాకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది.’
– ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
‘సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్, ఎంపీ డీకే అరుణ సంతాపం తెలియజేశారు. ‘డీఎస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిది. మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా, ఎంపీగా డీఎస్ చేసిన సేవలు మరువలేనివి.’
-కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి
‘సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారు.. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.. ధర్మపురి శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారు.’
-ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు