- తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్తనందించిన మంత్రి శ్రీధర్ బాబు
- ఈ ఏడాది నుంచే మొదలు కానున్న జాబ్ క్యాలెండర్
- జాబ్ క్యాలెండర్ ప్రకటనతో విపక్షాల నోటికి తాళం
- నిరుద్యోగ శాతాన్ని భారీగా పెంచేసిన బీఆర్ఎస్
- పదేళ్లలో కేవలం 46 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ
- ప్రచారం, ప్రకటనల ఆర్భాటమే తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదు
- కేసీఆర్ పై ఆగ్రహంతోనే కాంగ్రెస్ ను గెలిపించిన నిరుద్యోగులు
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్
- దాదాపు 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్
Reventh reddy government ready to declare Job Calender2024:
తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతూనే ఉంది. రాష్ట్రంలో డిగ్రీ చదివిన నిరుద్యోగుల సంఖ్య సైతం పెరిగిపోతోంది. ఉన్నత చదువులు చదివిన వారిక ఉద్యోగాలు దొరకడం లేదు. తెలంగాణకు సంబంధించి చదువుకున్న 15-29 ఏళ్ల యువతలో సగటున ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో సగలు నిరుద్యోగ రేటు 16.5 శాతం ఉంది. దానితో పోలిస్తే యువ నిరుద్యోగుల రేటు 22.9 శాతం ఉంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు చూస్తే తెలంగాణ చివరి నుంచి ఆరో స్థానంలో ఉండటం చూస్తే నిరుద్యోగుల దయనీయ స్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే అద్భుతాలు ఆశించడం పొరపాటు. పైగా వచ్చిన ఆరు నెలలలో మూడు నెలలు పార్లమెంటు ఎన్నికల కోడ్ తో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ దొరకలేదు. దీనిని పట్టుకుని బీఆర్ఎస్ లీడర్లు జాబ్ క్యాలెండర్ ఏమయింది. నిరుద్యోగులను పట్టించుకోరా అంటూ విమర్శలు చేస్తున్నారు. అందుకే ఇక కాంగ్రెస్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. అది కూడా ఈ సంవత్సరం నుంచే…నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఆశాకిరణంగా కనిపిస్తోంది.
లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామంటున్న బీఆర్ఎస్
గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతూ వచ్చింది. చేసింది మాత్రం కేవలం 46 వేలు మాత్రమే. డిగ్రీలు ప్రతి ఏడాది లక్షల్లో పూర్తిచేస్తుంటే పోస్టులు మాత్రం వందల్లోనే భర్తీ చేయడం దారుణం. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకున్న బీఆర్ఎస్ పై ఆగ్రహంతో కాంగ్రెస్ సర్కార్ ను గెలిపించారు నిరుద్యోగులు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే శాఖల వారీగా ఖాళీల వివరాల సమాచారాన్ని సేకరించింది. ప్రతి సంవత్సరం ముందుగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి గ్రూప్స్, టీచర్స్ రిక్రూట్ మెంట్ సంబంధిత ఖాళీలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా భర్తీచేయాలని చూస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయితే మధ్యలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ హామీల అమలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఇప్పుడు అన్ని ఎన్నికలు ముగిశాయి. దాంతో కాంగ్రెస్ సర్కార్ హామీల అమలుకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు పండగలాంటి వార్త చెప్పింది కాంగ్రెస్.
కాంగ్రెస్ మంత్రి హామీ
రీసెంట్ గా మంత్రి శ్రీధర్ బాబు ఈ మేరకు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లుగానే.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ గ్రూప్-1 పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చి మొన్ననే ముగిసిందని.. కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ మొదలు పెట్టామని స్పష్టం చేశారు.ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన పనిలేకుండా ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. సర్కార్ ఆదేశాలతో 2024 సంవత్సరానికి సంబంధించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వాస్తవానికి మూడు నెలల ముందే ఈ ప్రతిపాదన అమలు చేద్దామని అనుకన్నప్పటికీ లోక్ సభ ఎన్నికల కోడ్ తో వాయిదా పడింది.
2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్
అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్కు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు కూడా చేర్చి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే గ్రూప్ 1పోస్టుల సంఖ్య కూడా పెంచింది. ఇప్పడు పోలీసు, టీచర్, గురుకుల పోస్టుల భర్తీతో పాటు ప్రభుత్వ విభాగాలలో గ్రూప్ 2, 3, 4కు సంబంధించిన జాబ్ క్యాలెంర్ రూకపల్పన చేస్తోంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్చేయాలనుకుంటున్నది. ఏటేటా రిటైర్మెంట్అవుతున్న కొద్దీ.. వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ, డైరెక్ట్ రిక్రూట్మెంట్పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ 30 వేలకు పైగా మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించింది. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్ మెంట్ బోర్డు పరిధిలో 6,956 స్టాఫ్ నర్స్, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 14,099 కానిస్టేబుల్ పోస్టులను భర్తీచేసింది. సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాలకు ఎంపికైన 7800 మంది టీచర్లు, లెక్చరర్రకు నియామక పత్రాలను అందించింది. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన రిక్రూట్ మెంట్ ద్వారా 87 పోస్టును భర్తీ చేసింది. ఇక ఎన్నడూ లేని విధంగా మెగా డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
జాబ్ క్యాలెండర్ రెడీ చేస్తున్న అధికారులు
ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లోని రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు? ఏయే నెలల్లో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? అనే విషయాలను అందులో స్పష్టంగా తెలియజేస్తారు. ఇందులో ఇచ్చిన తేదీల మేరకు ఆయా గడువు తేదీల్లోగా రిక్రూట్మెంట్స్ పూర్తవుతాయి. దీనిపై ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్ తీసుకుంటోంది. సర్వీసు నిబంధ నలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడంతోపాటు ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుం టోంది. జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్యారోగ్య నియామక బోర్డుల నుంచి ఇక ఏటా ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.