Payal Rajputh interested to prepare tasty food for Prabhas:
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అందం, అభినయం ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఉంటాయి. ఆర్ ఎక్స్ 100 మూవీతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. అయితే ఆ తర్వాత పాయల్ కు రావలసినంత బజ్ మాత్రం క్రియేట్ కాలేదు. అయితే గతేడాది మంగళవారం మూవీ హిట్ తో మళ్లీ ఆఫర్లను దక్కించుకుంటోంది. అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఓ మన్మథుడు లాంటి క్రేజీ హీరో ప్రేమలో పీకల్లోతుగా పడిపోయింది. అందుకే ఆ హీరోని విపరీతంగా పొగిడే పనిలో నిమగ్నమయింది. అతగాడు ఎవరో కాదు బాహుబలి ప్రభాస్. మామూలుగా ప్రభాస్ ఏ హీరోయిన్ తోనూ అంత సన్నిహితంగా ఉండడు. గతంలో అనుష్క విషయంలో వచ్చిన రూమర్లు అన్నీ ఇన్నీ కావు. ప్రభాస్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పుడు తన కో స్టార్స్ కు కూడా ఇంటి ఫుడ్డు తెప్పిస్తుంటాడు. అయితే ఇప్పుడు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తానే స్వయంగా తన హీరో ప్రభాస్ తో ఛాన్స్ వస్తే తన చేత్తో తినిపిస్తానంటోంది. ఇప్పుడు నెట్టింట పాయల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
నేను కూడా ఒకరికి డార్లింగ్ ని..
అయితే ప్రభాస్.. రీసెంట్ గా పెట్టిన ఓ పోస్ట్ ఎంతటి వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తన జీవితంలో ఒక స్పెషల్ రాబోతున్నారని పోస్ట్ చేశారు. దీంతో అందరూ ఆ పోస్ట్ ప్రభాస్ పెళ్లి మ్యాటర్ కోసమేనని అనుకున్నారు. అభిమానులైతే వదినమ్మ వస్తోందంటూ పోస్టింగులు పెట్టారు. కానీ తర్వాత అదంతా తూచ్ అని తేలిపోయింది. కల్కి మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆయన అలా పోస్ట్ పెట్టారని క్లారిటీ వచ్చింది. అదే సమయంలో పాయల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ ఫోటో షేర్ చేసింది. “నేను కూడా ఒకరికి డార్లింగ్ ను.. ఎవరికో గెస్ చేయండి” అని పాయల్ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ప్రభాస్, పాయల్ మధ్య ఏదో ఉందని నెట్టింట వార్తలు వచ్చాయి. అదే సమయంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి పాయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ప్రభాస్ కు దగ్గరుండి తినిపిస్తా..
ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని ఆ ఇంటర్య్వూలో తెలిపింది. ఆదివారాలు సపరేట్ గా ప్రభాస్ కోసం కేటాయిస్తానని, ఆయన కోసం స్వయంగా వంట చేసి లంచ్ ఏర్పాటు చేస్తానని తెలిపింది. తన ఫేవరెట్ రాజ్మా రైస్ ను స్పెషల్ గా వండి, ఛాన్స్ వస్తే చేత్తో ప్రభాస్ కు తినిపిస్తానని చెప్పింది పాయల్. దీంతో ఈ బ్యూటీ ప్రభాస్ కు ఇంత పెద్ద అభిమానా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.