Tuesday, July 2, 2024

Exclusive

Pedda palli : ఈదురుగాలులకే కూలిన వంతెన

  • కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు
  • భూపాలపల్లి – గర్మిళ్ల పల్లి మధ్య ఉన్న దూరం తగ్గించే వంతెన
  • 2016లోనే మొదలైన వంతెన నిర్మాణం పనులు
  • కాంట్రాక్టర్ల అలసత్తం, నిధుల కొరతతో నత్తనడకన సాగిన నిర్మాణం
  • రాత్రి సమయం కావడంతో తప్పిన పెను ప్రమాదం
  • పగటిపూట అయితే ప్రాణ నష్టం జరిగేది
  • బ్రిడ్జి నిర్మాణ లోపాలపై పలు సందేహాలు

Maneru brook Bridge: మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలలకు వంతెన గడ్డర్లు కుప్పకూలిపోయాయి. సోమవారం అర్థరాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారిగా స్థానికులు విస్తుపోయారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలో జరిగింది. 2016 నుంచి ఈ వంతెన నిర్మాణం జరుగుతూనే ఉంది. ఈ వంతెన పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిళ్ల పల్లి మధ్య ఉంది. ఈ రెండు జిల్లాల మధ్య దూరం తగ్గించేందుకు వంతెన నిర్మాణం జరుగుతోంది. అయితే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి వంతెన నిర్మాణ పనులు ప్రారంభమైనా కొంత వరకు మాత్రమే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల కొరత వంటి కారణాలతో వంతెన నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది.

బ్రిడ్జి నిర్మాణం పెండింగ్లో ఉండటంతో స్థానికులు అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న ఈ వంతెన అర్ధరాత్రి సమయంలో కుప్పకూలింది. రాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటివేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈదురుగాలులకే వంతెన కూలడంతో వంతెన నిర్మాణం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Bandi Sanjay: మా ఎమ్మెల్యేలకు నిధులివ్వరా?

- ఇదే పని కేంద్రమూ చేస్తే ఏం చేస్తారు? - ఆరు నెలలైనా హామీల అమలేదీ? - జనసేనతో పొత్తుపై నిర్ణయం అధిష్ఠానానిదే - కేంద్రమంత్రి బండి సంజయ్ Congress Govt: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని...

Telangana: పట్టు కోల్పోతున్న సీఎం

సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పనితీరుపట్ల సొంతపార్టీ ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది. ఆయన సీఎం కావడం మెజారిటీ శాసనసభ్యులకు...

Hyderabad:జాబ్ (క్యాలెండర్) రెడీ

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్తనందించిన మంత్రి శ్రీధర్ బాబు ఈ ఏడాది నుంచే మొదలు కానున్న జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటనతో విపక్షాల నోటికి తాళం నిరుద్యోగ శాతాన్ని భారీగా పెంచేసిన...