India First Team To Score 600 Runs In Women Test Cricket History:చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళలు క్లీన్‌స్వీప్ చేసి ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పింది. ఇదే జోరుతో కొనసాగుతూ రికార్డుల బూజు దులిపి టెస్టు క్రికెట్‌లో సరికొత్త హిస్టరీని సృష్టించారు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 603 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న అత్యధిక స్కోరు డిక్లేర్ రికార్డును బద్దలుకొట్టింది.
శుక్రవారం స్టార్ట్ అయిన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే ఓపెనర్లు షఫాలీ వర్మ డబుల్ సెంచరీతో గర్జించగా, స్మృతీ మంధాన శతకంతో కదం తొక్కింది. జెమీమా రోడ్రిగ్స్ అర్ధ సెంచరీ సాధించింది. ఫలితంగా ఫస్ట్‌డే ఆట ఎండ్ అయ్యేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 525 రన్స్‌తో భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో షఫాలీ, మంధాన సఫారీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇద్దరూ వన్డే తరహాలో రెచ్చిపోవడంతో పరుగులు అడ్డుకునేందుకు బౌలర్లు నానా తిప్పలు పడ్డారు.
Also Read: ఇంజమామ్..అంతే ఇక మారడు!!
లంచ్ విరామానికల్లా భారత్ వికెట్ నష్టపోకుండా 130 రన్స్ చేసింది. ఆ తర్వాత షఫాలీ, స్మృతి దూకుడు పెంచుతూ రికార్డు భాగస్వామ్యంతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు రికార్డుస్థాయిలో 292 రన్స్‌ని జోడించారు. 52వ ఓవర్లో టక్కర్ బౌలింగ్ మంధాన వెనుదిరగగా, యువ ఓపెనర్ షఫాలీ మాత్రం బాధుడికి బ్రేక్ ఇవ్వలేదు. లేడీ సెహ్వాగ్ తరహాలో బౌలర్లపై శివాలెత్తుతూ సెంచరీని, డబుల్ సెంచరీగా మలిచింది. ఈ క్రమంలో మహిళల టెస్టు హిస్టరీలోనే అత్యంత వేగంగా అంటే 194 బంతుల్లోనే ద్విశతకాన్ని క్రియేట్ చేసింది.