Do You Know The Same Highlight In Charan, Sukumar Movie? : టాలీవుడ్, నేషనల్ స్టార్ హీరో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రంగస్థలం మూవీ ఎంత పెద్ద హిట్‌ని సంపాదించుకుందో మనందరికి తెలిసిన విషయమే. ఈ మూవీ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్‌ని పలకరించి ఏళ్లు అవుతోంది. వీరిద్దరి కాంబోలో మళ్లీ ఓ మూవీ రావాలని అటు మెగా ఫ్యాన్స్, ఇటు సుక్కు ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. పలు సందర్భాల్లోనూ రామ్‌చరణ్, సుకుమార్‌కి కుదిరినప్పుడు తప్పకుండా చేస్తామని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రామ్‌చరణ్ దిగ్గజ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్, డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్‌సీ 16 బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ పుల్ బిజీ అయిపోయాడు. మరోపక్క డైరెక్టర్ సుకుమార్ సైతం తన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప2 చిత్రీకరణలో బిజీ అయిపోయారు. అయితే తాజాగా.. రామ్‌చరణ్, సుకుమార్ తమ కొత్త ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. దీంతో ఎప్పటినుంచో ఫ్యాన్స్, ఆడియెన్స్ కోరుకుంటున్నారు. ఈ మేరకు వారందరికి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. సుకుమార్, చరణ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఎస్‌ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్‌లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రామ్‌చరణ్‌తో సుకుమార్ తీయనున్న మూవీలో ఓపెనింగ్ సీక్వెల్స్ హైలెట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత థియేటర్‌లో ఆడియెన్స్ సీట్ ఎడ్జ్‌కి వచ్చేశారని నమ్మకంగా చెప్పగలనని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో తెగ వైరల్ అవుతోంది.
Read Also : దేవర మూవీకి టైటిల్ ఎవరు పెట్టారో తెలుసా..?
మరోవైపు ఈ మూవీపై డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ సైతం నెట్టింట ఓ పోస్ట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ క్లైమాక్స్ షూటింగ్ టైంలో సుకుమార్‌తో మూవీ చేయబోతున్నట్లు రామ్‌చరణ్ చెప్పాడు. ఆ మూవీలో ఓపెనింగ్ సీన్ గురించి రివీల్ చేస్తూ వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అదొక అధ్భతమని తెలిపారు. నాటి నుంచి ఈ మూవీ అనౌన్స్‌మెంట్ కోసం నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని.. ఈ మూవీ వీళ్లిద్దరి కెరీర్‌లో ఓ మైలురాయి అని అన్నారు. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేనని తన పేజీలో రాసుకొచ్చారు. రంగస్థలం హిట్ అవడంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఆర్‌సీ 17 మూవీపై ఆడియెన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. తాజాగా రాజమౌళి, కార్తికేయల కామెంట్లతో అంచనాలన్ని రెట్టింపు అయ్యాయి. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇక ఈ మూవీ సెట్స్‌పైకి వెళితే గాని.. ఈ మూవీ గురించి మరిన్ని అప్‌డేట్స్ మనకు దొరికేలా లేవు.
#RC17 the force reunites 💥@aryasukku @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/yyXv7Fnx9N
— Ram Charan (@AlwaysRamCharan) March 25, 2024
The Opening Sequence of #RC17 is one of the most Hard Hitting 💥💥 The Audience Will Quiver in their seats when they see it 🥵🔥
SS Rajamouli is the Biggest Hype Man For #Sukku #RamCharan Combo 🙌❤️🔥#Raring2Conquer @AlwaysRamCharan pic.twitter.com/OJ8TewzzYo
— Navya (@HoneYNavya_) March 25, 2024