Who Gave The Title of NTR Devara Movie : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ఎంతలా పాపులార్టీని తెచ్చుకున్నారో మనందరికి తెలిసిన విషయమే. అందులో ఆయన నటనకి అందరూ ఫిదా అయ్యారు. అంతేకాదు తన సహజ నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే..ప్రస్తుతం తారక్ కొరటాల శివ కాంబోలో దేవర మూవీ రాబోతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై భారీ హైప్‌ని క్రియేట్ చేస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో డ్యూయల్ రోల్స్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Read Also : మహీంద్రా నన్ను ఎందుకు పిలవలేదన్న రామ్‌చరణ్
ఇదిలా ఉంటే..అసలు దేవర టైటిల్ ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారన్నదే ఫ్యాన్స్‌లో నెలకొన్న పెద్ద క్వచ్ఛన్. అంతేకాదు వీటికి సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ విషయంలో ముందు నుంచే కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడట. కాబట్టి దీని టైటిల్ బాధ్యతను మొత్తం ఎన్టీఆర్‌కి ఇస్తే బాగుంటుందని భావించినట్లు ఆయన తెలిపాడు. ఇక ఇదే విషయాన్ని తారక్‌కి చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో తారక్ ఈ స్టోరీని లక్ష్మీ ప్రణతికి చెప్పడంతో ఆమెనే దేవర అయితే బాగుంటుందని సూచించినట్లు అందుకే ఈ టైటిల్ సజెస్ట్ చేసిందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా దేవా రోల్‌లో పాధర్‌గా.. వరా క్యారెక్టర్‌లో కొడుకుగా కనిపించబోతుండటంతో అలా పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే.. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సూపర్ అంటూ కితాబ్ ఇస్తున్నారు. ఇక ఈ మూవీ లేటెస్ట్ రిలీజ్ అప్‌డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.