Tuesday, May 14, 2024

Exclusive

Telangana : ఎండలు దంచుతున్నాయి

తెలంగాణలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
రానున్న వారం రోజులు మరింత పెగిగే అవకాశం
8 జిల్లాలలో ఆరెంజ్, రెడ్ హెచ్చరికలు
గత ఏడాది కన్నా 6-7 డిగ్రీలు ఎక్కువగా ఉన్న ఎండలు
మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని హెచ్చరికలు
వడదెబ్బకు సిరిసిల్ల జిల్లాలో హమాలీ మృతి

Telangana Temperature 45 degrees red, orange allert:  తెలంగాణలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎన్నడూ లేనంతగా ఈసారి టెంపరేచర్ భగభగా మండుతోంది. రెండు రోజుల క్రితం కొత్తగూడెంలో ఎండ వేడిమి 44 డిగ్రీలకు చేరుకుంది. ఇది దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదయింది. శుక్రవారం ఒక్కసారిగా 8 జిల్లాలలో 45 డిగ్రీలు నమోదవడం గమనార్హం. సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం అచ్చన్నపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పని చేస్తున్న బిహార్‌ వాసి శంకర్‌ సదా(34) శుక్రవారం వడదెబ్బతో కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందారు. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్‌, వనపర్తి జిల్లాలకు ‘రెడ్‌’ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ.. 25 జిల్లాలకు ‘ఆరెంజ్‌’ ప్రకటించింది. పొడి వాతావరణంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, రానున్న వారం రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
గత పదేళ్లలో ఏప్రిల్‌ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈస్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది.

ప్రమాదకర స్థాయిలో ఎండలు

రాష్ట్రంలో ఎండలు ప్రమాదకరంగా ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5-7 డిగ్రీలు మించి ఉంటున్నాయి. సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలకు రెండు డిగ్రీలు పెరిగితేనే ప్రజలు అల్లాడిపోతారు. శుక్రవారం ఏ జిల్లాలో చూసినా గతేడాదితో పోల్చితే 6-7 డిగ్రీలకు పైగా ఉన్నట్లు వాతావరణ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌ పరిధిలోని చందానగర్‌లో 43.5 డిగ్రీలు నమోదు కాగా గతేడాది ఇదే సమయానికి ఇక్కడ 35.3 డిగ్రీలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే 8 జిల్లాలకు ‘రెడ్‌’ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రాంతాల్లో రెండు నుంచి ఐదు రోజులపాటు తీవ్ర వడగాలులు వీస్తాయి. బయట తిరిగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసిన 25 జిల్లాల్లో వడగాలుల తీవ్రత నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. చిన్నారులు, వయోవృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఎండకు ప్రభావితమవుతారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.

అలెర్ట్ హెచ్చరికలు

28వ తేదీన మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్. 29న కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్. 30న తేదీన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపే,ట జోగులాంబ గద్వాల్‌కు ఆరెంజ్ అలెర్ట్. 30న జగిత్యాల రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేశారు అధికారులు.

Publisher : Swetcha Daily

Latest

Sports News: కోహ్లిపై వైరల్ కామెంట్స్‌ చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

Cricket Player Irfan Pathan Made Comments On Kohli: స్టార్...

Tollywood: టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న హర్రర్‌ మూవీస్‌

Director Actor Sunder About Baak Movie: ప్రస్తుతం ఎక్కడ చూసినా...

Polling: తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

Elections: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది....

Serial Actress: బికినీలో షాకిచ్చిన సీరియల్‌ నటి 

Television Actress Bikini ashika gopal Photos Viral: ఈ మధ్యకాలంలో...

Ambati: ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి

Ambati Sensational Comments On MS Dhoni: సీఎస్‌కే మాజీ కెప్టెన్...

Don't miss

Sports News: కోహ్లిపై వైరల్ కామెంట్స్‌ చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

Cricket Player Irfan Pathan Made Comments On Kohli: స్టార్...

Tollywood: టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న హర్రర్‌ మూవీస్‌

Director Actor Sunder About Baak Movie: ప్రస్తుతం ఎక్కడ చూసినా...

Polling: తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

Elections: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది....

Serial Actress: బికినీలో షాకిచ్చిన సీరియల్‌ నటి 

Television Actress Bikini ashika gopal Photos Viral: ఈ మధ్యకాలంలో...

Ambati: ధోనీపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి

Ambati Sensational Comments On MS Dhoni: సీఎస్‌కే మాజీ కెప్టెన్...

Reventh Reddy: కొడంగల్ లో ఓటేసిన సీఎం

CM Reventh reddy voted kodangal with family lok sabha elections: తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును...

India: ఒక్క ఓటుతో తారుమారు

పోలింగ్ ను బహిష్కరించిన తెలంగాణలో కొన్ని గ్రామాలు తమ సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం ఓటు విలువ తెలియక ఓటెయ్యని పట్టణ ఓటర్లు ఒక్క ఓటు తో తారుమారైన ఫలితాలు ఒకే ఒక్క...

Hyderabad: రేవంత్ ‘ఆట’విడుపు

Reventh reddy plays foot ball hyderabad central university: మరి కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికలు. ప్రచారాలకి తెరపడటంతో అన్ని పార్టీల నేతలు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. కొందరు నేతలైతే టెన్షన్ గా ఉన్నారు....