Reventh reddy plays foot ball hyderabad central university:
మరి కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికలు. ప్రచారాలకి తెరపడటంతో అన్ని పార్టీల నేతలు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. కొందరు నేతలైతే టెన్షన్ గా ఉన్నారు. తాము గెలుస్తామో లేదా అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకొందరు ఓటర్లకు తాయిలాలు పంచే పనిలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్న నేతలు జాతీయ పార్టీ అగ్ర నేతలను సైతం ప్రచార బరిలో దింపారు. దాదాపు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ శక్తివంచన లేకుండా గత నెల రోజులుగా నిద్రాహారాలు మానేసి ప్రచారం చేశారు. అయితే ఇలాంటి నరాలు తెగే టెన్షన్ సమయంలో తెలంగాణ సీఎం హ్యాపీగా, కూల్ గా ఎలాంటి టెన్షన్ లేకుండా ఫుట్ బాల్ ఆడుతున్న వీడియో వైరల్ గా మారింది.
విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్..
సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఆటవిడుపుగా హైదరాబాద్ లో ఫుట్ బాల్ ఆడారు. ఎన్నికల టెన్షన్‌కు కాసేపు బ్రేక్ ఇచ్చి హాయిగా ఫుట్ బాల్ ఆడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు. సీఎం రేవంత్‌కు స్పోర్ట్స్‌లో ఇష్టమైన ఆట ఫుట్ బాల్ కావడంతో.. ఆయనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆడుతుంటారు. ముఖ్యంగా స్ట్రెస్ బస్టర్ కోసం ఫుట్‌బాల్ ఆడుతూ రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తారు. ఎలక్షన్స్ ప్రచారం ముగియడంతో ఆదివారం ఉదయమే.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఫుట్ బాల్ ఆడుతూ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. 54 ఏళ్ల వయస్సులోనూ రేవంత్ రెడ్డి విద్యార్థుల వెంట పరుగులు తీస్తూ ఫుట్ బాల్ ఆడుతూ కనిపించారు. రేవంత్ ఆటను చూసిన పలువురు ఆయన్ను అభినందిస్తూ ఎంజాయ్ చేశారు.. అయితే ఈ ఫుట్ బాల్ ఆడుతుండగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆట మధ్యలో రేవంత్ షూస్ పాడైపోయాయి. దీంతో షూస్ లేకుండా ఫుల్ బాల్ ఆడారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, హెచ్‌సీయూ విద్యార్థులు ఫుట్ బాల్ ఆడారు. ఈ ఫుట్ బాల్ మ్యాచ్‌కి హాజరైన సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏంఏ ఫహీం, టీ శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి ఇతరులు హాజరయ్యారు.