Anasuya: చీరకట్టు సొగసుతో అనసూయ.. నెటిజన్స్ ఒక్కొక్క కామెంట్?
-
1 / 7
source: Anasuya Insta
ప్రముఖ యాంకర్, ఎన్నో సినిమాలలో కీలక పాత్రలతో మెప్పించిన అనసూయ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పలు ఫోటోలను పోస్ట్ చేశారు. -
2 / 7
source: Anasuya Insta
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నా రామునితో నేను అనే క్యాప్షన్ తో ఫోటోలను పోస్ట్ చేయగా, సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. -
3 / 7
source: Anasuya Insta
చీరకట్టులో మెరిసిన అనసూయ, తన భర్త భరద్వాజ్ తో పాటు పలు ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. వయస్సు కేవలం సంఖ్యకే పరిమితమని, గ్లామర్ గా కనిపించడంలో అనసూయకు ఎవరూ సాటి లేరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
4 / 7
source: Anasuya Insta
ఈ ఫోటోలలో సంప్రదాయ చీరకట్టుతో మెరిసిన అనసూయను కొందరు మరో రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. -
5 / 7
source: Anasuya Insta
భరద్వాజ్ శ్రీరాముడే కావచ్చు కానీ, మీరు సీతా మాతతో పోల్చుకోవద్దని పలువురు నెటిజన్స్ జై శ్రీరామ్ అనే క్యాప్షన్ తో కామెంట్స్ చేశారు. -
6 / 7
source: Anasuya Insta
అయితే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కు రిప్లై ఇవ్వడంలో ముందుండే అనసూయ, ఈ కామెంట్స్ కు మాత్రం ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడం విశేషం. -
7 / 7
source: Anasuya Insta
మొత్తం మీద శ్రీరామనవమి పండుగ రోజు అనసూయ చీరకట్టులో మెరవడంతో ఆమె అభిమానులు మాత్రం రంగమ్మత్త.. మీరు సూపర్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.