Tuesday, July 2, 2024

Exclusive

Actress Samantha: ఆ సాంగే నాకు టర్నింగ్‌ పాయింట్‌

Actress Samantha Reacted To The Pushpa Item Song: నటి సమంత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారుకి కునుకు లేకుండా చేసింది. ఎందుకంటే మొదట్లో తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా అంతగా ఐడెంటీటీ రాలేదు. కానీ, టాలీవుడ్‌లో నటించిన ఏమాయ చేసావే మూవీతో కుర్రకారు మదిలో లవర్‌గా నిలిచిపోయింది. ఈ మూవీ అంతలా సక్సెస్‌ అయింది. ఈ మూవీ ఆమె సినీ కెరీర్‌నే మార్చేసింది. ఆ తరువాత టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో చేసే ఛాన్స్‌లు క్యూ కట్టడంతో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి చేరుకుంది. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, విశాల్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు వరించాయి. ఇక తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న టైంలోనే టాలీవుడ్‌ యంగ్ స్టార్‌ నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మ్యారేజ్ లైఫ్ ఎక్కువ టైమ్‌ సాగలేదు. అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు.

ఇదిలా ఉంటే సమంత ఐటమ్‌ సాంగ్‌ చేసిన బ్లాక్‌బస్టర్‌ మూవీ పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ , నటి రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ 2022లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఆ విజయంలో సమంత ఐటమ్ సాంగ్ చేసిన ఊ అంటావా మామ పాటకు బాగా క్రేజ్ ఉంది. ఆ సాంగ్‌లో సమంత హాట్‌ నటన యువతను గిలిగింతలు పెట్టించింది. ఆ పాటకు డ్యాన్స్‌ చేయడానికి సమంతకు ఏకంగా రూ. 5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ సాంగ్‌ గురించి సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సాంగ్‌లో యాక్ట్ చేయవద్దని తన ఫ్యామిలీ,ఫ్రెండ్స్ చెప్పారని సమంత ఇటీవల పేర్కొన్నారు.

ఆ సాంగ్‌ చేసే టైంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అలాంటి టైంలో పుష్ప మూవీలో ఐటమ్‌ సాంగ్‌లో నటించవద్దని తెలిపారని, అయితే తాను వారి మాటలను పట్టించుకోకుండా ఆ సాంగ్‌లో యాక్ట్ చేశానని పేర్కొన్నారు. అయితే ఆ సాంగ్‌ పెద్ద టర్నింగ్‌గా మారిందని అన్నారు. నిజం చెప్పాలంటే ఆ ఛాన్స్‌ని కాదనడానికి తన వద్ద సరైన రీజన్ లేదన్నారు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని నిరాకరించాలి, తానే తప్పు చేయలేదని అన్నారు.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Kamalhaasan: చాలా గ్యాప్‌ తరువాత రీ-ఎంట్రీ

Actor kamal haasan Movie After 30 Years marudhanayagam: లోకనాయకుడు కమల్‌హాసన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో మరుదనాయకం మూవీ ఒకటి. 1991లో అనౌన్స్ చేసిన ఈ మూవీ 1997లో షూటింగ్...

Tollywood News: మూవీపై క్లారిటీ

Shankar Clarifies About Game Changer Remaining Shoot:టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి గేమ్‌ఛేంజర్‌. స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ...

Actress Samantha: లక్కీ ఛాన్స్ వన్స్‌ మోర్‌

Thalapathy 69th Movie Heroine Samantha: తమిళ మూవీ ఇండస్ట్రీలో దళపతి విజయ్‌ నటి సమంత జోడీని హిట్‌ పెయిర్‌ జోడీగా పోలుస్తుంటారు. వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్‌...