Meenakshi Chaudhary: మత్తెక్కించే కళ్లతో.. అందాలు ఆరబోసిన మీనాక్షి చౌదరి..
-
1 / 10
Image Source: Meenakshi Insta
అమ్మో.. వారెవ్వా అనేస్తున్నారు ఈ బ్యూటీ అందానికి ఆమె అభిమానులు. మోడలింగ్ ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ, ఇటీవల తన అందచందాలతో అభిమానులను తెగ అలరిస్తోంది. -
2 / 10
Image Source: Meenakshi Insta
సంక్రాంతి రోజు సంక్రాంతికి వస్తున్నాం అంటూ అందరినీ పలకరించిన ఈ బ్యూటీ ఎవరో పసిగట్టేశారా.. ఔను.. మీ గెస్ కరెక్ట్.. మీనాక్షి చౌదరీనే. -
3 / 10
Image Source: Meenakshi Insta
2018లో మిస్ ఇండియాగా, 2021లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన ఈ బ్యూటీ, డాక్టరమ్మ అని మీకు తెల్సిందే. -
4 / 10
Image Source: Meenakshi Insta
డెంటల్ సర్జరీ కోర్సు చేసిన ఈ బ్యూటీ డాక్టర్, తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో పరిచయమయ్యారు. -
5 / 10
Image Source: Meenakshi Insta
తొలుత కాస్త ఫేమ్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ, గుంటూరు కారం సినిమాలో హీరో మహేష్ బాబు సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. -
6 / 10
Image Source: Meenakshi Insta
ఆ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా, అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ తెగ వచ్చేసింది. -
7 / 10
Image Source: Meenakshi Insta
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో గ్లామర్ కు గ్లామర్, యాక్టింగ్ కు యాక్టింగ్ పండించి అందరినీ మెప్పించారు. ఈ సినిమా బంపర్ హిట్ కొట్టగా, మీనాక్షి హ్యాండ్ లక్కీ హ్యాండ్ అనే రేంజ్ ప్రచారం సాగింది. -
8 / 10
Image Source: Meenakshi Insta
సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎక్కడా తగ్గేదేలే అనే రీతిలో పాల్గొని, సినిమా సక్సెస్ లో తన భాద్యతను నిర్వర్తించింది. ఇటీవల ఛాన్స్ వస్తే లెజెండ్ బాలయ్యతో నటించేందుకు సిద్ధమని మీనాక్షి తెగ సిగ్గుపడుతూ చెప్పేసింది. -
9 / 10
Image Source: Meenakshi Insta
ఈ అమ్మడుకు ఇటీవల తెలుగు సినిమా ఛాన్స్ లు తెగ వస్తున్నాయట. అయితే గ్లామర్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న మీనాక్షి, తాజాగా తన ఇన్ స్టాలో మెస్మరైజింగ్ ఫోటోస్ ను షేర్ చేసింది. -
10 / 10
Image Source: Meenakshi Insta
దీనితో అభిమానులు, గ్లామర్ లో మీనాక్షి చౌదరికి సాటెవ్వరు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ అందాలను మీరు తిలకించారా?