Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ వెరీ స్పెషల్.. ఒక్క క్లిక్ తో.. అదేంటో తెలుసుకోండి..
-
1 / 7
భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్రపు వంతెనగా గుర్తించబడ్డ పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. -
2 / 7
వంతెన ప్రారంభోత్సవం సంధర్భంగా రామేశ్వరం – తాంబరం (చెన్నై) రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించగా, రైలు ప్రకృతి అమ్ములపొది నుండి బయటకు వచ్చిన ఆ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
3 / 7
అయితే ఈ వంతెన ప్రత్యేకతలు మీరు తెలుసుకుంటే, ఔరా అనేస్తారు. న్యూపంబన్ వంతెన నిర్మించేందుకు ఉపయోగించిన ఇనుము అలాంటి, ఇలాంటి ఇనుము కాదు. ఎప్పటికీ తుప్పు పట్టని ఇనుమును ఉపయోగించారు. -
4 / 7
అధునాతన ఎలక్ట్రో - మెకానికల్ సాంకేతికతతో 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్, మొత్తం 2.08 కి.మీటర్ల పొడవు కలిగి ఉంది. -
5 / 7
తమిళనాడు అంతటా రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడం, తీర్థయాత్ర ప్రాప్యతను పెంచడం, కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ వంతెన ప్రధాన ఉద్దేశం. -
6 / 7
పర్యాటకాన్ని పెంపొందించడం, నౌకల రాకపోకలను సులభతరం చేయడం కూడా కొత్త పంబన్ వంతెన స్పెషాలిటీ. అయితే ఈ వంతెన గుండా రైళ్ల రాకపోకలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవని ప్రయాణికులు అంటున్నారు. -
7 / 7
ఈ వంతెన నిటారుగా నిలిచిన సమయంలో నౌకల రాకపోకలు ప్రకృతికి సరికొత్త అందాలను పంచుతున్నాయట. మొత్తం మీద నీలి రంగు సముద్రపు నీటి మధ్య పంబన్ వంతెన ఓ పర్యాటక ప్రదేశంగా మారిందని పర్యాటకులు తెలుపుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఆ అనుభూతిని మీరు పొందాలని అనుకుంటే, ఇప్పుడే ఛలో తమిళనాడు.