Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. నేటి ఆదాయం ఎన్ని లక్షలో తెలుసా?
-
1 / 7
యాదగిరిగుట్టలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంకు శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. -
2 / 7
ఈ సంధర్భంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. -
3 / 7
యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
4 / 7
కాగా శుక్రవారం స్వామి వారికి సమర్పించిన కానుకల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ప్రకటించారు. -
5 / 7
ఒక్కరోజుకే మొత్తం శ్రీస్వామి వారి ఆదాయము రూ. 15,23,847లు కాగా, 1160 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. -
6 / 7
కళ్యాణ కట్ట రూ.58,000, ప్రధాన బుకింగ్ రూ. 1,04,600, కైంకర్యములు రూ. 2501, సుప్రభాతం రూ.8,800, బ్రేక్ దర్శనం రూ.1,06,500, వ్రతాలు రూ. 88,800, వాహన పూజలు రూ. 6,500, VIP దర్శనం రూ.1,35,000 ఆదాయం వచ్చింది. -
7 / 7
ప్రచారశాఖ రూ. 13,150, పాతగుట్ట రూ. 18,250, కొండపైకి వాహన ప్రవేశం రూ. 1,90,500, యాదఋషి నిలయం రూ. 67,304, సువర్ణ పుష్పార్చన రూ.40,000, శివాలయం 6,300, శాశ్వత పూజలు రూ.17,500, పుష్కరిణి రూ. 400, ప్రసాద విక్రయం రూ.6,01,750, లాకర్స్ రూ.100, అన్నదానం రూ. 4,352, లీజెస్ రూ. 50,000లు, ఇతరములు రూ. 3,540 ఆదాయం వచ్చిందన్నారు.