England To Smooth Eight Wicket Win Over WestIndies
స్పోర్ట్స్

T20 Match: వెస్టిండీస్‌పై విరుచుకుపడ్డ ఇంగ్లండ్

England To Smooth Eight Wicket Win Over WestIndies: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సూప‌ర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజ‌యం సాధించింది. ఇంగ్లండ్ ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ భీక‌ర బ్యాటింగ్ చేశాడు. అత‌ను 87 ర‌న్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో కీరోల్ పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 180 ర‌న్స్ చేసింది.

కానీ ఆ స్కోరును ఇంగ్లండ్ ఈజీగా ఛేజ్ చేసింది. కేవ‌లం 17.3 బంతుల్లోనే ల‌క్ష్యాన్ని అందుకుంది. దీంతో గ్రూప్ 2 లో ఇంగ్లండ్ త‌న పేరిట తొలి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్ ఓపెన‌ర్ సాల్ట్ రెచ్చిపోయాడు. 47 బంతుల్లో ఏడు ఫోర్లు, అయిదు సిక్స‌ర్ల‌తో 87 ర‌న్స్ చేశాడు. మ‌రో ఇంగ్లండ్ బ్యాట‌ర్ జానీ బెయిర్‌స్టో కూడా శ‌ర‌వేగంగా స్కోరింగ్ చేశాడు. అత‌ను 26 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 48 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 51 డాట్ బాల్స్ వేయ‌డం విశేషం. జోఫ్రా ఆర్చ‌ర్‌, అదిల్ ర‌షీద్‌లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

Also Read:గోల్డ్​ మెడల్ కైవసం చేసుకున్న చోఫ్రా

15 బాల్స్ ఉండ‌గానే ఇన్నింగ్స్‌ను ముగించిన ఇంగ్లండ్ త‌న నెట్ రేట్‌ను బాగా పెంచుకుంది. ఇంగ్లండ్ 1.343 ర‌న్‌రేట్‌తో అగ్ర‌స్థానంలో ఉంది. మ‌రో మ్యాచ్‌లో అమెరికాపై సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. తొలుత విండీస్ ఓపెన‌ర్లు కూడా మంచి స్టార్టింగ్‌తో బ్రాండ‌న్ కింగ్‌, జాన్స‌న్ చార్లెస్‌లు ర‌ఫ్ఫాడించారు. తొలుత ఐదు ఓవ‌ర్ల‌లో 40 ర‌న్స్ జోడించారు. బ్రండ‌న్ కింగ్ 23 ప‌రుగులకే రిటైర్డ్ హార్ట్ కాగా, జాన్స‌న్ ఛార్లెస్ 38, పూర‌న్ 36, పావెల్ 36 ర‌న్స్ చేసి అవుట‌య్యారు. రూథ‌ర్‌ఫోర్డ్ 28 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.