Wednesday, July 3, 2024

Exclusive

Coal Mining: సింగరేణిపై కుట్ర.. మోదీని కలుస్తాం!

– సింగరేణి తెలంగాణకు తలమానికం
– కేసీఆర్ పాలనలో ప్రాభవాన్ని కోల్పోయింది
– కోల్ బ్లాక్ లు సింగరేణికి ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంది
– ఓపెన్ ఆక్షన్ ద్వారా తెలంగాణకు అన్యాయం చేసింది
– వేలంలో ప్రైవేట్ వ్యక్తులకూ అవకాశమిచ్చేలా బీజేపీ చట్టం
– ఆనాడు ఆ సవరణ చట్టానికి బీఆర్ఎస్ ఆమోదం
– ఆధారాలతో చర్చకు సిద్ధం.. బీఆర్ఎస్‌కు భట్టి సవాల్
– రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ, బీఆర్ఎస్ అడ్డు అంటూ ఫైర్

Singareni: బొగ్గు బావుల వేలంపై కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సింగరేణికి నష్టం రాకుండా కొట్లాడామని వ్యాఖ్యలు చేస్తుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక విషయాలు వెల్లడించారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణి సంస్థ నష్టపోయేలా బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును వివరించారు. తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థ ప్రత్యక్షంగా సుమారు 50 వేల మందికి, పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి ఇస్తున్నదని, బొగ్గు ఉత్పత్తిలోనూ అగ్రగామిగా ఉన్నదని తెలిపారు. అయితే, ఈ సంస్థ గురించి కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉన్నదన్నారు. సంస్థ బొగ్గు ఉత్పత్తి భవిష్యత్‌లో గణనీయంగా తగ్గిపోనుందని తెలిపారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే 2060 కల్లా ఇది 17.20 మిలియన్ టన్నులకు పడిపోతుందని నిపుణులు చెబుతున్నారని వివరించారు భట్టి. అయితే, 2031-32 సంవత్సరాల వరకైనా సింగరేణి సంస్థను ఇదే స్థాయిలో నిలుపుకోవాలంటే తప్పకుండా కొత్తగా బొగ్గు గనులను సంపాదించుకోవాలని, ఇది అనివార్యమని చెప్పారు. ఎందుకంటే త్వరలోనే 22 బొగ్గు గనులు మూసివేతకు గురవుతున్నాయని, అందులో బొగ్గు అయిపోతుందన్న అంచనాలున్నాయని వివరించారు.

నష్టమని తెలిసినా, ఓటేసిన బీఆర్ఎస్

కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం 2015లో మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957కు సవరణ తెచ్చింది. బొగ్గు గనుల వేలంలో ప్రైవేట్ వ్యక్తులు కూడా పాల్గొనవచ్చనే సవరణ ప్రవేశపెట్టింది. సింగరేణి ప్రభుత్వ సంస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆస్తి. ఇలాంటి ప్రభుత్వ సంస్థలకే బొగ్గు గనులను కేటాయించాల్సిందిపోయి ప్రైవేట్ వ్యక్తులకూ వేలంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించేలా బీజేపీ ప్రభుత్వం సవరణ తెచ్చిందని భట్టి విమర్శించారు. తద్వారా ప్రభుత్వ సంస్థలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ బిల్లు ద్వారా సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా బీఆర్ఎస్ ఎంపీలు అందరూ ఈ సవరణ బిల్లుకు ఓటు వేశారని చెప్పారు.

మిత్రులకు లాభం కోసమే!

ఇది చట్టమై అమల్లోకి వచ్చాక తెలంగాణలో బొగ్గు గనుల వేలం పెట్టినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ కోసమైనా తప్పనిసరి పరిస్థితుల్లో అందులో పాల్గొని బొగ్గు గనులను కైవసం చేసుకుని సింగరేణికి కట్టబెట్టి ఉంటే బాగుండేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇక్కడి బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని అప్పుడు సింగరేణి యాజమాన్యం కూడా తీర్మానించుకుందని, వారం తిరిగేలోగా కేసీఆర్ ఆదేశాల మేరకు కోర్ కమిటీ సమావేశమై గోదావరి వ్యాలీలోని బొగ్గు గనుల వేలంలో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆ వేలంలో బీఆర్ఎస్ మిత్రులైన అరబిందో గ్రూప్స్‌కు చెందిన ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమకు చెందిన అవంతిక కాంట్రాక్టర్స్ పాల్గొన్నాయని, బొగ్గు గనులను దక్కించుకున్నాయని తెలిపారు. ఇది తన మిత్రుల కోసమే సింగరేణిని వేలంలో పాల్గొనవద్దని కేసీఆర్ ఆదేశించినట్టేగా అంటూ ఫైరయ్యారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వివరించారు. అవసరమైతే కేసీఆర్ లేదా కేటీఆర్ చర్చకు వస్తానన్నా తాము సిద్ధమని సవాల్ చేశారు. సింగరేణిని ముంచే పని బీఆర్ఎస్ చేస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చిలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి సింగరేణికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని లేఖ అందించామని చెప్పారు.

అన్ని పార్టీలు కలిసి వెళ్దాం!

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారు దక్కించుకున్న బ్లాకులను వారి టెండర్ కంటే 0.5 శాతం ఎక్కువగా ఇచ్చి సింగరేణికి అప్పగించాలని కేంద్రాన్ని కోరుతామని భట్టి తెలిపారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికే ఈ గనుల శాఖ వచ్చింది కాబట్టి, ముందుగా ఆయనతో ఈ విషయాన్ని మాట్లాడుతామని, ఆ తర్వాత అన్ని పార్టీల ప్రతినిధుల బృందం ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. గతంలో చేసిన తప్పులను తెలుసుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం తమతో కలిసి రావాలని బీఆర్ఎస్‌ను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వేలంపాటలో పాల్గొంటారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పాల్గొంటామని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇప్పుడు లాంఛన కార్యక్రమమే అని, వేలం రెండు నెలల తర్వాత ఉంటుందని వివరించారు. అయితే, ఈ వేలం జరగకుండా కేంద్రానికి రాతపూర్వక విజ్ఞప్తి చేస్తామని, అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి సింగరేణి ప్రయోజనాల కోసం మోదీని కలవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై ఉన్న ద్వేషం.. - ఇప్పుడు హిందూ సమాజంపై విద్వేషంగా మారింది - కాంగ్రెస్ కూటమికి హిందూత్వాన్ని అవమానించడం అలవాటే - రాహుల్ అబద్ధాలను...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ - నిన్న 3035 పోస్టులతో ఆర్టీసీ నోటిఫికేషన్ - పెండింగ్ నోటిఫికేషన్లకు తొలి ప్రాధాన్యత - ఆగస్టులో మరో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి పదవికీ లాబీయింగ్ - హస్తినలోనే సీఎం రేవంత్ - కోట నీలిమ అంగీకరిస్తారా? - టీపీసీసీకి లేని సమాచారం Ex Minister Talasani Srinivas...