Gautam gambhir named india head coach
స్పోర్ట్స్

Team India: హెడ్ కోచ్‌గా నియామకమేనా..?

Gautam Gambhir Likely To Be Announced As Team Indias Head Coach By June End: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీమిండియా హెడ్ కోచ్‌ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. గౌతమ్ గంభీర్‌ని హెడ్‌ కోచ్‌గా నియామకం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవికాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేకపోవడంతో గత మే నెలలోనే బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది.

ఇప్పటికే హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల గడవు ముగిసి నెల రోజులు అవుతున్నా..హెడ్ కోచ్ నియామకంపై మాత్రం బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఆ జట్టు మెంటార్‌ గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంపికైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే హెడ్ కోచ్ పదవి కోసం అతను దరఖాస్తు చేసుకున్నాడా? లేదా? అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. మరోవైపు గౌతమ్ గంభీర్ మాత్రం టీమిండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరించేందుకు రెడీగా ఉన్నానని తెలిపాడు.

Also Read: టీమిండియా కోచ్‌ పదవి బరిలో ఆ ప్లేయర్‌

భారత జట్టుకు కోచ్‌గా పనిచేయడం నాకిష్టం. అంతకు మించిన గౌరవం లేదు. మన జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయడం అంటే ఎంతో గౌరవమైన బాధ్యత.140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం కన్నా మించిన పదవి ఏది లేదని ఓ కార్యక్రమంలో గంభీర్ వెల్లడించాడు.