Tuesday, June 25, 2024

Exclusive

Response To Article: స్వేచ్ఛ ఎఫెక్ట్‌, 12 మంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ

Swetcha Effect, Transfer of 12 CCS inspectors:హైదరాబాద్ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లో జరుగుతున్న అక్రమాలను ‘స్వేచ్ఛ’డైలీ ఇన్వెస్ట్ గేషన్ టీమ్ బయటకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ‘స్వేచ్ఛ డైలీ’ ఇచ్చిన వరుస కథనాలకు పోలీసు శాఖ స్సందించింది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా 12 మంది సీసీఎస్ ఇన్ స్పెక్టర్లను మల్టీ జోన్ 2 కు బదిలీ చేశారు. వీరంతా వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సీసీ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా బదిలీ వేటు పడినవారిలో శివగౌని శివశంకర్, రఘుబాబు కొలమల, మీసాల అప్పలనాయుడు, బూక్యా రాజేష్, సీతారాములు, హుస్సేన్ ధీరావత్, గుమ్మడిదల సత్యం, చీపుర్ల నాగేశ్వరరెడ్డి, ధరావత్ కృష్ణ, కొత్త సత్యన్నారాయణ, ఎస్ఏ ఇమ్యాన్యుయేల్, బిట్టు క్రాంతికుమార్ లు ఉన్నారు.మే 21న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమా మహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేయగా తాజాగా గురువారం రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సీసీఎస్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ ఉదంతంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సీసీఎస్ ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలను చేపట్టారు.

Also Read: ముంపు నీరు సంపులోకి

రూ.25 లక్షల నగదు కంటే ఎక్కువ సొత్తుతో ముడిపడిన నేరాలు , రూ.75 లక్షలు కంటే మించిన ఆర్థిక నేరాల విచారణను సీసీఎస్ చేపడుతోంది. ఏళ్ల తరబడిగా అక్కడ తిష్ట వేసి ఈ సంస్థను అవినీతికి అడ్డాగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇన్ స్పెక్టర్లపై ఎట్టకేలకు బదిలీ వేటు పడటానికి పరోక్షంగా కారణమైన స్వేచ్ఛ డైలీ కథనాలకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం)

Publisher : Swetcha Daily

Latest

Telangana: ‘కోల్’కో లేని దెబ్బ

బొగ్గు వేలంపై బీఆర్ఎస్ డబుల్ డ్రామా తాడిచెర్ల బొగ్గు గనిని...

Ananya Nagalla: నాలా మోసపోకండి

Tollywood Heroine Ananya Nagalla advice to public about Ciber...

Politicians: పరిపాలన విధానాన్ని వీడుతున్న పాలకులు

Rulers Leaving The Administration System: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా...

Telengana:‘బుక్’పాలిటిక్స్

తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన రెడ్ బుక్,...

Hyderabad:‘మెట్రో’ఆదాయం పెరిగింది

Hyderabad Metro income increased 105 percent better than last...

Don't miss

Telangana: ‘కోల్’కో లేని దెబ్బ

బొగ్గు వేలంపై బీఆర్ఎస్ డబుల్ డ్రామా తాడిచెర్ల బొగ్గు గనిని...

Ananya Nagalla: నాలా మోసపోకండి

Tollywood Heroine Ananya Nagalla advice to public about Ciber...

Politicians: పరిపాలన విధానాన్ని వీడుతున్న పాలకులు

Rulers Leaving The Administration System: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా...

Telengana:‘బుక్’పాలిటిక్స్

తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన రెడ్ బుక్,...

Hyderabad:‘మెట్రో’ఆదాయం పెరిగింది

Hyderabad Metro income increased 105 percent better than last...

Hyderabad:‘మెట్రో’ఆదాయం పెరిగింది

Hyderabad Metro income increased 105 percent better than last year: నిత్యం అనేక వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది హైదరాబాద్ మెట్రో.తొలినాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా...

Hyderabad:భారీగా ఐఎఎస్ ల బదిలీ

రాష్ట్రవ్యాప్తంగా 44 మంది ఐఏఎస్ లు బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా ఆమ్రపాలి ట్రాన్స్ కో సీఎండీగా రొనాల్డ్ రాస్.. ఫైనాన్స్ ప్రిన్సిపల్...

Hyderabad:నాడాలు బిగించిన జూడాలు

గాంధీ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె స్లైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నల్ల దుస్తులు, కళ్లకు గంతలతో నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు ...