Wednesday, June 26, 2024

Exclusive

ACP Umamaheshwar Rao: బినామీల కింగ్.. దొరికినంత దోచుకో.. దాచుకో..!

– పగులుతున్న ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అవినీతి పుట్ట
– ప్రతీ కేసులోనూ దందాలకు పాల్పడ్డ వైనం
– న్యాయం కోసం వచ్చిన బాధితుల నుంచే డబ్బుల డిమాండ్
– సైలెంట్‌గా బినామీల పేరుతో అక్రమార్జన
– కోట్లలో సొమ్ము పోగు చేసిన అవినీతి కింగ్
– ఏసీబీ కోర్టులో హాజరు.. 14 రోజుల రిమాండ్
– చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
– విచారణకు సహకరించ లేదన్న ఏసీబీ
– కీలకంగా మారిన డీసీపీ సందీప్ రావు
– ఇద్దరు రావుల అవినీతి లింక్స్‌పై ఏసీబీ ఫోకస్

దేవేందర్ రెడ్డి,

Corruption: కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపమైతే కనిపించని నాలుగో సింహం పోలీస్ అనే డైలాగ్ ఎంతో ఫేమస్. కానీ, ఈ డైలాగ్ అర్థమే మార్చేశాడు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు. అవినీతికి, అన్యాయానికి, అధర్మానికి ప్రతిరూపంగా మారిపోయాడు. అందినకాడికి దోచేసి నాలుగు రాళ్లు కాదు 50 కోట్ల రాళ్లు వెనకేసుకున్నాడు. ఏసీబీ అరెస్ట్‌తో ఈయన బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

భారీగా అక్రమార్జన

ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ఉమామహేశ్వర్ రావును ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. జూన్ 5వ తేదీ వరకు రిమాండ్‌లో ఉండనున్నాడు ఏసీపీ ఉమామహేశ్వర్ రావు. తీర్పు అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అశోక్ నగర్‌లోని ఏసీపీ నివాసం, ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాల్లో సహా మొత్తం 13 చోట్ల తనిఖీలు చేశారు. ఆయనకు సంబంధించి మొత్తం 17 ప్రాపర్టీలను గుర్తించామని, ఘట్కేసర్‌లో 5 ప్లాట్లను గుర్తించామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారాన్నీ సీజ్ చేశామని తెలిపారు. శామీర్‌పేటలో ఒక విల్లా, రెండు లాకర్లను గుర్తించామని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో ఈయన అక్రమాస్తులు రూ.50 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. బుధవారం ఉదయం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం, ఏసీబీ కోర్టులో హాజరుపరుచగా కోర్టు రిమాండ్ విధించింది.

క్రిమినల్ కేసులుగా మార్చి వసూళ్లు

తన వద్దకు వచ్చిన ప్రతి కేసులోనూ ఉమామహేశ్వర్ రావు చేతివాటం చూపించారు. న్యాయం కోసం వెళ్లిన బాధితులకే చుక్కలు చూపించారని, వారిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సీసీఎస్‌లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉండి కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చినవారితోనే బేరసారాలు ఆడారు. ఒక ఎన్నారైను సైతం ఇలాగే బెదిరించి డబ్బులు దండుకున్నారు. సీసీఎస్‌లో అంతా తానే అన్నట్టుగా నడిపించిన ఉమామహేశ్వర్ రావు పలు కీలక కేసులకు విచారణ అధికారిగా ఉన్నాడు. ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రా వంటి పెద్ద స్కాముల కేసుల్లోనూ విచారణ అధికారిగా కొనసాగాడు. సాహితీ కేసులో నిందితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని కేసును సాగదీస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో అవినీతి జరిగిన కేసులను నీరుగారుస్తున్నారనీ బాధితులు వాపోతున్నారు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి మరీ లక్షల రూపాయలు జేబులో వేసుకున్నట్టు విమర్శలు వచ్చాయి. తోటి ఉద్యోగులతోనూ దురుసుగా ఉండేవారని, తిట్లతో అవహేళన చేసిన సందర్భాలూ ఉన్నాయని చెబుతున్నారు.

బినామీల వ్యవహారం

అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఉమామహేశ్వర్ రావు బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. సందీప్ అనే పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహించారు. పోలీసు శాఖలోనే కొందరు అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు తెలిసింది. ఉమామహేశ్వర్ రావు డైరీలో సందీప్ అనే పేరు కనిపించింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహించారని ఏసీబీ గుర్తించింది. గతంలో మాదాపూర్ డీసీపీగా పని చేసిన సందీప్ రావు, ఉమామహేశ్వర్ బాగా క్లోజ్‌ అని పోలీస్ సర్కిల్‌లో టాక్ ఉంది. ఆ కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. బినామీల పేర్ల మీద ఉమామహేశ్వర్ రావు భారీగా పోగు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.

ల్యాప్‌టాప్‌లో చిట్టా

తాను చేస్తున్న అక్రమాల చిట్టాను ల్యాప్‌టాప్‌లో పొందుపరిచినట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. ఎవరి దగ్గరి నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాం? ఎవరి వద్ద నుంచి ఇంకా ఎంత రావాల్సి ఉన్నది వంటి వివరాలను ల్యాప్‌టాప్‌లో ఉమామహేశ్వర్ రావు సేవ్ చేసుకున్నారు. దానిని ఆయన నిత్యం వెంటపెట్టుకునేవారు. ఈ చిట్టాను ఏసీబీ అధికారులు గుర్తించారు. దాని గురించి, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కేసుల గురించి ఆయన్ని ప్రశ్నించారు అధికారులు. కానీ, విచారణకు సరిగ్గా సహకరించడం లేదని అధికారులు తెలిపారు.

వీవీఐపీల కేసులన్నీ ఈయన వద్దకే!

ఉమామహేశ్వర్ రావు సీఐడీలో ఉన్నప్పుడు విచారణ అధికారిగా ఉండేలా కొన్ని వీవీఐపీల కేసులు బదిలీ అయ్యాయి. డబ్బులు ఎక్కువగా వచ్చే ఈ కేసుల్లో ఆయనే విచారణ సాగించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణానగర్‌కు చెందిన ఓ బిల్లింగ్ కేసులో అన్ని పార్టీల నుంచి ఉమామహేశ్వర్ రావు డబ్బులు దండుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సంధ్యా శ్రీధర్ రావుకు సంబంధించిన కేసులో రూ.2 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇలా ఉమామహేశ్వర్ రావు ఎక్కడికి వెళ్లినా అక్రమాలను మాత్రం వదల్లేదని చర్చ జరుగుతున్నది. ఇలాంటి ఘటనల్లోనే పలుమార్లు సస్పెండ్ అయ్యాడు కూడా. ఇబ్రహీంపట్నానికి ఏసీపీగా బదిలీ చేస్తే అక్కడా రియల్ ఎస్టేట్‌ వ్యవహారంలో తలదూర్చి భారీగానే వసూళ్లకు పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. తాను వెలమ సామాజిక వర్గానికి చెందినవాడినని, తెలంగాణ వాడినేనని చెబుతూ అక్రమాలు చేసినట్టూ ఆరోపణలు వచ్చాయి. ప్రభాకర్ రావు, ఇతర అధికారుల పేర్లు చెప్పి తన అక్రమాలను అడ్డూ అదుపు లేకుండా కొనసాగించాడని తెలుస్తున్నది. వాస్తవానికి ఈయన శ్రీకాకుళానికి చెందిన క్యాడర్. ఇలా ఎక్కడికి వెళ్లినా డబ్బులు దండుకోవడం బీఆర్ఎస్ హయాంలోనే అలవాటు చేసుకున్నాడని సమాచారం.

ఏసీపీని విచారించాలి: న్యాయవాది కృష్ణకాంత్

సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు పూర్తిస్థాయిలో చేయాలని, సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావుపై విచారణ జరపాలని న్యాయవాది కృష్ణకాంత్ డిమాండ్ చేశారు. సాహితీ స్కాం కేసు విచారణ అధికారిగా ఉన్న ఉమామహేశ్వర్ రావు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ, నిందితులైన సాహితీ డైరెక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయని, ఇలాగైతే సాహితీ బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని అన్నారు. ఉమామహేశ్వర్ రావు వ్యవహారంలో సిట్ వేసి విచారణ జరిపించాలని, తద్వారా సాహితీ బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. విచారణ అధికారులను ప్రతిసారి మార్చడం వలన బాధితులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు న్యాయవాది కృష్ణకాంత్.

Publisher : Swetcha Daily

Latest

KTR: నయవంచనకు ప్రతిరూపం

- ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటుంది - ఇంకోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది -...

BRS Party: గులాబీ వల‘సలసల’

- తగ్గుతున్న బీఆర్ఎస్ సంఖ్యా బలం - ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎమ్మెల్యేలు...

Rythu Bharosa: కీలక సమీక్ష

- గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి?...

IRCTC: రైల్వే టికెట్ల బుకింగ్‌పై అవాస్తవ ప్రచారం

Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ పై కొన్ని రోజులుగా సోషల్...

Phone Tapping: బెయిల్ పిటిషన్ వాయిదా

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో...

Don't miss

KTR: నయవంచనకు ప్రతిరూపం

- ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటుంది - ఇంకోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది -...

BRS Party: గులాబీ వల‘సలసల’

- తగ్గుతున్న బీఆర్ఎస్ సంఖ్యా బలం - ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎమ్మెల్యేలు...

Rythu Bharosa: కీలక సమీక్ష

- గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి?...

IRCTC: రైల్వే టికెట్ల బుకింగ్‌పై అవాస్తవ ప్రచారం

Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ పై కొన్ని రోజులుగా సోషల్...

Phone Tapping: బెయిల్ పిటిషన్ వాయిదా

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో...

Hyderabad PS: అసదుద్దిన్‌ కౌంటర్‌కి పోలీసుల రీ-కౌంటర్‌

-పోలీసుల నిర్ఱయం వివాదస్పదం -నో ఫ్రెండ్లీ పోలీసింగ్‌, ఓన్లీ లాఠీచార్జ్‌ -పోలీసులపై మండిపడ్డ అసదుద్ధిన్‌ -ఇది మెట్రో సిటీనా, పల్లెటూరా..? -అసదుద్ధిన్‌కి పోలీసులు కౌంటర్‌ -పాత నిబంధనల ప్రకారమే ఈ అనౌన్స్‌మెంట్‌ -ట్విట్టర్‌ వేదికగా సౌత్‌ జోన్‌ డీసీపీ స్నేహా మెహ్రా...

Telangana: ‘కోల్’కో లేని దెబ్బ

బొగ్గు వేలంపై బీఆర్ఎస్ డబుల్ డ్రామా తాడిచెర్ల బొగ్గు గనిని ఆంధ్రా కంపెనీకి ధారాదత్తం 2015లో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణ చట్ట సవరణకు బాహాటంగానే...

Hyderabad:‘మెట్రో’ఆదాయం పెరిగింది

Hyderabad Metro income increased 105 percent better than last year: నిత్యం అనేక వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది హైదరాబాద్ మెట్రో.తొలినాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా...