young tiger ntr birth day prasanth neel combo movie title Dragon:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈ నెల 20 న జరుగనుంది. ఇప్పటినుంచే ఫ్యాన్స్ భారీ ఎత్తున అన్ని ఊళ్లల్లో భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ నటించే దేవర పై ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో అని చూస్తుండగా ఆ మూవీలో ‘ఫియర్ సాంగ్’ఫీవర్ ఇప్పటినుంచే మొదలైపోయింది. అనిరుధ్ సమకూర్చిన సంగీతంలో వచ్చే ఆ సాంగ్ తప్పకుండా దేవర మూవీకి మంచి హైప్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే రోజున డబుల్ ధమాకా లా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రానుంది. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే తదుపరి సినిమా గురించి అందరికీ తెలిసిన విషయమే. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఆ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తప్పకుండా అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే దేవర సినిమాలో భీకరమైన యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదే ఇలా ఉంటే ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్ సినిమా మాటలకు అందని రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.
పవర్ ఫుల్ కాంబో..పవర్ టైటిల్
ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబో మూవీ టైటిల్ విషయంలో కూడా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ టైటిల్ కథకు మరియు యాక్షన్ సీక్వెన్సెస్ కు సరిపోయేలా ఉండటంతో, చిత్ర యూనిట్ ఈ టైటిల్ పై ఆసక్తిగా ఉందని సమాచారం. ‘డ్రాగన్’ అనే శక్తివంతమైన టైటిల్ ఎన్టీఆర్ ఇమేజ్ కు కరెక్ట్ గా సరిపోతుంది. అప్పట్లో బ్రూస్ లీ సినిమా ఎంటర్ ద డ్రాగన్ ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లాంటి పవర్ హౌసెస్ కలిసినప్పుడు, ‘డ్రాగన్’ కంటే సరైన టైటిల్ మరొకటి ఉండదు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు మరింత కిక్ ఇస్తుంది. అంతే కాకుండా, ఈ టైటిల్ మరియు ప్రీ-లుక్ పోస్టర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోందట. ఈ టైటిల్ నిజంగా ఖరారైతే, ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా సంతోషిస్తారు. అభిమానుల ఊహలను దాటిపోయేలా ఉన్న ‘డ్రాగన్’ టైటిల్ నిజంగా సెట్టయితే ఈ సినిమా, విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.