Young rebel star prabhas posting about his life partner viral news:
పాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్ రీసెంట్ గా సలార్ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఇప్పుడు నార్త్ లో కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాజాసాబ్, స్పిరిట్ మూవీలను లైన్ లో పెట్టిన యంగ్ రెబల్ స్టార్ సలార్ 2 కూడా పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్‌ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రావర్ట్ అయిన ఇతడు.. బయటకు కనిపించడమే ఎక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్ స్టాలో అందరూ అవాక్కయ్యేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘డార్లింగ్స్.. ఫైనల్లీ వెరీ స్పెషల్ పర్సన్ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది. వెయిట్ చేయండి’ అంటూ పోస్ట్ పెట్టాడు.
అందరికీ షాక్
ఇక ఈ పోస్ట్ పై నిమిషాల్లోనే మిలియన్ కు పైగా అభిమానులు స్పందించారు. ఫైనల్ గా వదినమ్మ రాబోతుందిరా అనుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరికొందరు ఇంకా నమ్మలేక పోతున్నారు. అన్న వచ్చి మళ్లీ ఎకౌంట్ హ్యాక్ అయిందని చెప్తాడేమో.. స్పెషల్ పర్సన్ అనేది ఏమీ ఉండదు అని చెప్తున్నారు. మొత్తానికి ఈ మ్యాటర్ ప్రజెంట్ టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కాగా ఇంకొందరు ఏదైనా మూవీ అప్ డేట్ అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.