Tuesday, June 18, 2024

Exclusive

Hyderabad: బీఆర్ఎస్ ‘పవర్’గేమ్

  • బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి పవర్ ప్లాంట్ అక్రమాలు
  • ఓపెన్​ టెండర్లు లేకుండానే ఛత్తీస్ గడ్ తో కరెంట్ పర్చేజ్
  • రైతులకు సబ్సిడీ పేరుతో బలవంతంగా విద్యుత్ పరికరాలు
  • బీఆర్ఎస్ విధానాలతో తీవ్రంగా నష్టపోయిన డిస్కంలు
  • ఏసీడీ చార్జీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు
  • ఏటా వెయ్యి కోట్ల చొప్పున 12 ఏళ్లకు అగ్రిమెంట్ తో అదనపు భారం
  • మొదటినుంచీ హెచ్చరిస్తూ వచ్చిన కాంగ్రెస్ నేతలు
  • బీఆర్ఎస్ అక్రమాలపై రంగంలో దిగిన విజిలెన్స్ టీమ్

Yadadri power plant frauds BRS time vigilence focus:

అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో చారిత్రక ఘట్టం ప్రారంభం అయింది. రీసెంట్ గా అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. తుది దశకు చేరుకున్న ప్లాంట్ పనులతో రెండు యూనిట్లలో ఫేజ్-1 కింద టీఎస్ జెన్ కో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు పడినట్లయింది. త్వరలో దశలవారీగా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి గ్రిడ్ కు అనుసంధానం చేయనున్నారు. కేసీఆర్ సర్కార్ హయాంలో ప్లాంట్ నిర్మాణం, టెండర్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర విజిలెన్స్ టీమ్ రంగంలో దిగింది. అందులో భాగంగానే కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై చేపట్టిన విచారణ సైతం ఓ కొలిక్కి రానుంది.

బొగ్గు రవాణాకే అధిక ఖర్చు

vigilence దామరచెర్లలో 4,000 మెగావాట్​ల కెపాసిటీ తో ఏర్పాటు చేసిన ఈ పవర్ ప్లాంట్.. బొగ్గునిల్వలు కేటాయించిన మణుగూరుకు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో బొగ్గు రవాణాకు అధిక ఖర్చవుతోంది. అలాగే ఈ ప్లాంట్ నిర్మాణంలో సివిల్ వర్క్స్ నామినేషన్ పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారికి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడీషియరీ కమిషన్ పై మూడు అంశాలపై విచారణ చేపట్టింది.

చత్తీస్​గఢ్ ఒప్పందం

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నాటి బీఆర్ఎస్ సర్కారు చత్తీస్​గఢ్ తో కరెంటు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఎలాంటి ఓపెన్​ టెండర్లు లేకుండానే రెండు రాష్ట్రాల మధ్య ఈ అగ్రిమెంట్ జరిగింది. యూనిట్ కు రూ.3.90కే కరెంటు సరఫరా అవుతుందని చెప్పినా.. కేవలం పవర్ జనరేషన్ ప్లాంట్ దగ్గరే రూ.3.90 రేటు అంటూ ఒప్పందంలో మెలిక పెట్టారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్​మిషన్, ఫ్యుయల్ ఖర్చులు అన్నీ కలిపి అదనంగా రూ1.50 వరకు చార్జ్ చేసి ఒక యూనిట్ కరెంటును రూ.5.50కు కొన్నట్టు విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే ఓపెన్ టెండర్లు పిలిచి ఉంటే మన రాష్ట్రం సరిహద్దు వరకు వచ్చి మరీ రూ.4 కే యూనిట్​కరెంటు ఇచ్చే పరిస్థితి ఉండేదని అంటున్నారు. ట్రాన్స్ మిషన్ కోసం నేషనల్ కారిడార్ కిరాయి తీసుకోవడంతో సరఫరా పూర్తి స్థాయిలో రాకపోయినా లైన్​కు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఏరోజుకు ఆ రోజు డిమాండ్ ను బట్టి యూనిట్​కు రూ.6, రూ.7, రూ.10, రూ.20 వరకు చెల్లించి కరెంటు కొనుగోలు చేశారు.

రైతుల సబ్సిడీలపై మోసం

ఒకవైపు రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నామంటునే మరో వైపు రైతులు నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం సబ్సిడీ లో కోత విదించి మూడు డిడిలకు ఒక 25 హెచ్‌.‌పి ట్రాన్స్పార్మర్‌ ‌మరియు ఒక పోల్‌ ఇచ్చి ట్రాన్స్ ‌కో చేతులు దులుపు కోవడంతో విద్యుత్‌ ‌స్థంబాలు వైర్ల పేరు మీద అదనంగా రైతుకు సుమారు మరో లక్ష రూపాయల పెనుబారం నెత్తినపడింది. దీనికి తోడు అవినీతి సరేసరి.! డిస్కం లు ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్ట పోగా మరో వైపు స్లాబులుగా విభజించబడిన విద్యుత్‌ ‌వినియోగంలో 1 నుంచి మొదలుకొని 9.5 వరకు ఒక్కో యూనిట్‌ ‌కు వసూలు చేసింది. దీంతోపాటు ఏసిడి చార్జీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడింది. పబ్లిక్‌ ‌స్ధలాలలో ఉపయోగించే వీధి లైట్లకు పర్‌ ‌యూనిట్‌ 7 ‌నుండి 8 వరకు వసూలు చేసింది. ఈ మొత్తాన్ని పూడ్చుకోవడానికి ఎలక్ట్రిసిటి రెగ్యూలేటరీ కమిటీని అడ్డం పెట్టుకొని 52 వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి గుంజుకుందని ఆరోపణలు వచ్చాయి.

అయినవారికే..అనుమతులు

ఈ.ఆర్‌.‌సి లలోను,డిస్కం లలోను తమ బంధువులను, తాబేదార్లుకు ఛైర్మన్‌,‌లుగా,డైరెక్టర్‌ ‌లుగా సభ్యులుగా నియమించుకొని ఇష్టారాజ్యంగా విద్యుత్‌ ‌సంస్థలను విధ్వంసం చేశారు బీఆర్ఎస్ విద్యుత్‌ ‌రంగంలో లక్షమందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన కలగానే మిగిలిపోయింది. ఆర్టిజన్ల సమస్య పరిష్కారం కాకపోగా వారి జీవితాలు మరింత ప్రమాదంలోకి బీఆర్ఎస్ ప్రభుత్వం నెట్టివేసింది.ఈ పరిస్థితులలోనే కేంద్ర విద్యుత్‌ ‌సంస్కరణలు తెలంగాణ లో అమలు కాకుండా నిలిపివేసు కున్నప్పటికి భవిష్యత్‌ ‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవచ్చు.ఈ నేపథ్యంలో నే ప్రభుత్వం చెపుతున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టి విద్యుత్‌ ‌సంస్ధలను కాపాడుకోకపోతే విద్యుత్‌ ‌వెలుగులు మాయమై కారు చీకట్లు అలుముకోవడం తధ్యం.

ముందే చెప్పినా వినలే..

చత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారనుందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున 12 ఏండ్ల అగ్రిమెంట్ టైమ్​లో రూ.12 వేల కోట్ల అదనపు భారం పడనుందని అప్పట్లోనే విద్యుత్ రంగ నిపుణుడు ఈఆర్సీకి వివరించారు. కానీ, చత్తీస్ గఢ్ నుంచి చౌకగానే విద్యుత్ లభించనుందని, పీపీఏను ఆమోదించాలని నాటి బీఆర్ఎస్ సర్కారు ఈఆర్సీని కోరింది. అయితే గతేడాది రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి ఇచ్చిన రిపోర్టులో రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతున్నదని అంగీకరించడం గమనార్హం.

Publisher : Swetcha Daily

Latest

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Don't miss

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Hyderabad:కానిస్టేబుల్ కు సీఎం ప్రశంసలు

CM praised Helping nature traffic police upsc exam: యూపీఎస్సీ ప్రిలిమ్స్ కు వెళుతున్న ఓ యువతిని పరీక్ష కేంద్రానికి తరలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం...

Hyderabad: డీజే సిద్ధూ.. వీని స్టయిలే వేరు!

- నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం - పోలీసుల విస్తృత తనిఖీలు, నిఘా - డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోయిన డీజే సిద్ధార్థ్ - సిద్ధూతోపాటు మరో వ్యక్తికి పాజిటివ్ - ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తింపు - అదుపులోకి తీసుకుని మాదాపూర్...

Hyderabad:పాత కారుకు ‘కొత్త డ్రైవర్’?

పార్టీ సమూల ప్రక్షాళన చేపట్టనున్న కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవిని వేరేవాళ్లకు అప్పగించాలనే యోచన ఈ సారి కుటుంబ సభ్యులను దూరం పెట్టాలనుకుంటున్న కేసీఆర్ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతకు...