wines shops
Politics

Wines: మందు బాబులకు మరో షాక్.. వైన్స్ ఓపెనింగ్ అప్పుడేనంటా

Hyderabad: తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు ప్రచారం ముగియగానే సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రాగా.. ప్రలోభాలకు చెక్ పెట్టేలా వైన్స్‌లు, బార్ అండ్ రెస్టారెంట్, మద్యం షాపులన్నింటినీ మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, ఇతర మద్యం దుకాణాలన్నీ మూసేయాలని ఆదేశాలు వచ్చాయి. తాజాగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ ఆదేశాలను మరో 12 గంటలపాటు పొడిగించారు.

హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తాజా ఆదేశాలు జారీ చేశారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో అన్ని వైన్స్‌లు, మద్యం దుకాణాలు మూసే ఉండాలని ఆదేశించారు. మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు సిటీ కమిషనరేట్ పరిధిలో జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే, 4వ తేదీన కూడా ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు మద్యం షాపులు మూసే ఉండనున్నాయి.