Saturday, May 18, 2024

Exclusive

BJP Party : ‘చార్ సౌ’ కల నెరవేరేనా?

Will The Dream Of ‘char sau’ Come True : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి గెలిచి సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ ఆరాటపడుతోంది. 2024 ఎన్నికల్లో 400 సీట్లు గెలిచేందుకు బీజేపీ ఇప్పటికే రూట్‌మ్యాప్‌ను ప్రకటించింది. కొత్త పొత్తులు, విపక్ష నేతలను పార్టీలను చేర్చుకోవటంతో బాటు 2019లో ఓడిన స్థానాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. 2019 ఎన్నికల్లో గెలుచుకున్న303కు అదనంగా మరో 97 స్థానాలు గెలిచి, 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన 49% ఓట్లు, 404 సీట్ల రికార్డును తిరగరాయాలని పనిచేస్తోంది. దీనికోసం ‘అబ్ కీ బార్.. చార్ సౌ కీ పార్’ అనే ఆకర్షణీయమైన నినాదాన్నీ ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు కీలక రాజకీయ పక్షంగా బీజేపీ ఆకాంక్ష మెచ్చుకోదగినదే అయినా క్షేత్రస్థాయి వాతావరణం మాత్రం అదంత సులభం కాదనే సందేశాలు పంపుతోంది.

బీజేపీకి ఆయువుపట్టుగా ఉన్న రాష్ట్రాలో ఉత్తరప్రదేశ్ మొదటిది. ఇక్కడి 80 లోక్‌సభ సీట్లలో 2019లో ఆ పార్టీ 62 సీట్లు గెలిచింది. నాడు ఆ మిగిలిన స్థానాల్లో బీఎస్పీ 10, ఎస్పీ 5, ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41.29 శాతం ఓట్లకే పరిమితమైంది. యూపీలో మోదీ, యోగీ చరిష్మా, అయోధ్య అంశాలు బీజేపీకి కలిసొచ్చే మాట నిజమే అయినా, ఈసారి అక్కడ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ పొత్తుకు సిద్ధమయ్యాయి. మొత్తం 80 సీట్లలో 62 స్థానాల్లో ఎస్పీ, 17 సీట్లలో కాంగ్రెస్, 1 స్థానంలో ఆప్ పార్టీలు పోటీ చేయనున్నాయి. ఇక్కడ మాయావతి ఒంటరిగా పోటీచేయటం వల్ల 2019లో బీజేపీ సాధించిన 62 సీట్లలో కనీసం 15 సీట్లలో కోత పడే ప్రమాదం ఉంది. ఇక బీహార్ విషయానికి వస్తే.. అక్కడున్న మొత్తం 40 సీట్లలో 2019లో బీజేపీ 17, దాని నాటి మిత్రపక్షం జేడీయూ 16, లోక్‌జనశక్తి పార్టీ 6 సీట్లు సాధించాయి. అయితే, ఆ తర్వాత నితీష్ కుమార్ లాలూయాదవ్‌ ఆర్జేడీతో చేతులు కలిపి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి సీఎంగా బాధ్యతలు చేపట్టి, తాజాగా తిరిగి ఎన్డీయేలో చేరారు. ఈ గోడదూకుడు వ్యవహారం నితీష్‌తో బాటు బీజేపీకి కూడా చెడ్డపేరు తీసుకొచ్చింది. దీనికి తోడు కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకోవటంతో అక్కడ ఈసారి ఎన్డీయే సీట్లు సగానికి కోతపడనున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఆ పక్కనే ఉన్న జార్ఖండ్‌లో 14 సీట్లు ఉండగా, 2019లో బీజేపీకి 11, దాని మిత్రపక్షమైన ఏజేఎస్‌యు ఒక స్థానంలో గెలిచింది. 2024లో కాంగ్రెస్ 7, జేఎంఎం 5, వామపక్షాలు 2 స్థానాల్లో ఇక్కడ బరిలో దిగనున్నాయి. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాతి పరిణామాలు ఇక్కడ కాంగ్రెస్- జేఎంఎం కూటమి వల్ల బీజేపీ ఆరు సీట్లకి మించి గెలవటం కష్టమనే అభిప్రాయం ఉంది.

Read Also : ఆర్థిక గణాంకాల వెనుక అసలైన నిజాలు

మహారాష్ట్రలోని 48 సీట్లలో 2019లో బీజేపీ 23, శివసేన 18 స్థానాలు గెలవగా, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకస్థానం, ఎన్సీపీ 4 సీట్లు గెలిచింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, అది శివసేన చీలికతో ప్రభుత్వం పడిపోవటం జరిగింది. ఈసారి శివసేన (ఉద్ధవ్) 19, కాంగ్రెస్​16, శరద్​పవార్​ఎన్సీపీ 9 స్థానాల్లో పొత్తుమీద పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూటమి అవకాశాలు గతంలో కంటే మెరుగుపడ్డాయని సమాచారం. ఇక ఒడిసాలో 21 సీట్లుండగా బీజేపీ-బీజేడీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక్కడ బీజేపీ 8, బీజేడీ 13 సీట్లలో పోటీచేస్తున్నాయి కనుక ఇది బీజేపీకి విన్ విన్ డీల్ లాంటిది. ఇక పశ్చిమబెంగాల్‌లోని 42 సీట్లలో 2019లో బీజేపీ 18 సీట్లు గెలిచింది. ఈసారి మమత ఒంటరి పోరుకు సిద్ధం కావటంతో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి బరిలో దిగనుంది. ఇక్కడ బీజేపీ బలం గతంలో కంటే తగ్గే అవకాశం ఉండటం ఇండియా కూటమికి కలిసొచ్చే అంశం కావచ్చు. ఇటీవలి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మాట నిజమే అయినా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్ల శాతం తక్కువే. ఈ మూడు రాష్ట్రాల్లోని 65 సీట్లలో 2019లో బీజేపీ 61 స్థానాల్లో గెలిచింది. 2024 ఎన్నికల్లో బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో 40 సీట్లకు మించి సాధించే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి.

ఇక.. గుజరాత్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని 52 లోక్‌సభ సీట్లుండగా, 2019లో వీటిన్నింటిలోనూ బీజేపీయే గెలిచింది. కానీ, ప్రస్తుతం హిమాచల్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, ఢిల్లీ, గుజరాత్‌లో కాంగ్రెస్- ఆప్‌తో పొత్తు, హర్యానాలో వీస్తున్న కాంగ్రెస్ సానుకూల పవనాల వల్ల ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ గతంలో కంటే 12 సీట్లు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇక దక్షిణాదిన గల తమిళనాడు, పుదుచ్ఛేరి, కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలలో మొత్తం 128 సీట్లుండగా, 2019లో బీజేపీ కర్ణాటకలో 25, తెలంగాణలో 4 సీట్లు గెలిచింది. ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ హవా కారణంగా పది స్థానాలకు, తెలంగాణలో 4 సీట్లకే పరిమితం కానుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే.. ఏపీలో జనసేన- టీడీపీ పొత్తులో 6 సీట్లు పొందినా అందులో గెలిచేది సగమే. ఈ క్రమంలో మొత్తంగా చూసినప్పడు దక్షిణాదిలో బీజేపీ సొంతగా గెలిచే సీట్లు 18 లోపే ఉండవచ్చు. తమిళనాడు, కేరళలో అది సీట్లు పొందే పరిస్థితి లేదు.మరోవైపు పంజాబ్‌‌లోని 13, జమ్మూ కాశ్మీర్‌‌లోని 6, గోవాలోని 2 .. మొత్తం 21 సీట్లలో 2019లో బీజేపీ 6, కాంగ్రెస్‌ 9, అకాలీదళ్‌ 2, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 3, ఆప్ ఒక సీటు గెలుచుకున్నాయి. ఈసారి ఇక్కడ బీజేపీకి ఒకటో రెండో పోవటం తప్ప లాభం వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఈశాన్య భారతంలోని అస్సాంలో 14, మిగిలిన ఆరు రాష్ట్రాల్లోని 11 స్థానాల్లో 2019లో వీటిలో 15 సీట్లు బీజేపీ గెలవగా, 5 సీట్లు దాని మిత్రపక్షాలు గెలిచాయి. ఇక్కడ ఇంతకంటే బీజేపీ పొందటానికి ఇంకేమీ కనిపించటం లేదు. చివరగా 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6 సీట్లుండగా, 2019లో బీజేపీ, కాంగ్రెస్, ఇతరులు తలా రెండు సీట్లు గెలుచుకున్నాయి. కనుక ఇక్కడ కూడా బీజేపీ అదనంగా పొందటానికి ఏమీ లేదు.

Read Also : రోగుల సొమ్ము కాజేశారు..

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బరిలో నిలిచే సీట్లు 450. మోదీ చెబుతున్నట్లు బీజేపీ 370 గెలవాలంటే పోటీచేసే మొత్తం సీట్లలో ఏకంగా 82 శాతం సీట్లు గెలవాల్సి ఉంది. ఇప్పటి వరకు బీజేపీ చరిత్రలో ఆ పార్టీ 2019లో 70 శాతం సీట్లలో గెలిచింది. ఆ ఎన్నికల్లో 436 సీట్లకు పోటీ చేసి 303 సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. పై సమీకరణాల నేపథ్యంలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు కనీసం గతంలో గెలుచుకున్న సీట్లలో 60 నుంచి 70 సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే బీజేపీ రెండు మెట్లు దిగి ఏపీ, ఒడిసా వంటి రాష్ట్రాల్లో పొత్తుకు సిద్ధపడింది. ఏది ఏమైనా మోదీ నినాదం ఏమేరకు నిజమవుతుందో చూడాలంటే దేశ ప్రజలు జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

-గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)

Publisher : Swetcha Daily

Latest

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Don't miss

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఈ పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం....

Israel: ఈ భీకర యుద్ధం ఆగేదెప్పుడో…?

Israel Hamas War Palestine Conflict Gaza Air Strikes Bombings Land Operations: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య మొదలైన యుద్ధం బుధవారం నాటికి 222 రోజులకు చేరింది. ఈ ఏడున్నర...

Democracy : మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం..!

Democracy Can Be Preserved Only Through Media: నేటి పత్రికలన్నీ పెట్టుబడిదారుల విష పుత్రికలే నంటూ అపుడెప్పుడో దశాబ్దాల క్రితమే మహాకవి శ్రీశ్రీ అన్నారు. నేటి సమాజంలో మెజారిటీ పత్రికలకు అక్షరాలా...