– రాష్ట్ర చిహ్నాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీలు లేదు
– కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
– ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేస్తా
– స్పష్టం చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్
Telangana Emblem: రాష్ట్ర చిహ్నంలో మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వ, హోంమంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి అవసరమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో తాను సంవత్సరం పాటు తిరిగితే తమకు అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు.
చిహ్నాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీలు ఉండదని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ తీరును ప్రశ్నిస్తూ, తాను కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. ఈ విషయం తెలిసే ప్రభుత్వం ఆలోచనలో పడిందని అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పట్టభద్రుడిగా దీనిపై పోరాటం చేస్తానని తెలిపారు.