Chandrababu Naidu: పీలో జగన్ ప్రభుత్వం తొలిసారిగా ఒక సరికొత్త వ్యవస్థను నిర్మించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల వద్దకు నేరుగా ఫలాలు అందించేలా వాలంటీర్లను ఏర్పాటు చేసి.. ఒక కొత్త వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో చాలా మంది వైసీపీ అభిమానులే ఉన్నారని, ఎన్నికల వేళ ఈ వ్యవస్థ తమకు వ్యతిరేకంగా పని చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు భయపడ్డాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ కూడా వాలంటీర్లను చాన్నాళ్లు వ్యతిరేకించింది. వీరి భయాలను దృష్టిలో పెట్టుకునే ఈసీ వీరిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
ఏపీలో మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తేనే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని, లేదంటే ఉండదనే అభిప్రాయాలు బలంగా ఏర్పడ్డాయి. కానీ, ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ వ్యవస్థపై కొంత సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా వాలంటీర్లకు తీపి కబురు చెప్పారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు, వారి వేతనాలు రెట్టింపు చేస్తామని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లకు రూ. 10 వేల వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: మెగా ఫ్యామిలీలో రెండు రాజకీయ పార్టీలా?
దీంతో ఒక విషయం స్పష్టమవుతున్నది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చినా.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టమైపోయింది. ఒక వేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లుగా ఇప్పుడున్నవారినే కొనసాగిస్తారా? లేక తమ పార్టీకి అనుకూలురను నియమించుకుంటారా? అనే ప్రశ్న కూడా ఒకటి చర్చలోకి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యం, ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆదేశాలు వచ్చిన తరుణంలో పలువురు వాలంటీర్లు రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని చేస్తామని ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు.