Tuesday, May 28, 2024

Exclusive

Farmers: రైతు జపం.. ఎవరికి వరం..?

– రైతన్న చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం
– రాష్ట్రంలో సగానికి పైగా ఓట్లు కర్షకులవే
– అన్నదాతను ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలు
– సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ ప్రచారంలో హస్తం
– పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ అంటున్న సీఎం
– గ్రామీణ ప్రాంతాల మద్దతు తమకేనన్న ధీమా
– గత పాలననే వల్లె వేస్తున్న బీఆర్ఎస్
– మోదీ చరిష్మాతోనే నమ్ముకున్న కమలదళం

Telangana Politics news: సాధారణంగా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు జాతీయ అంశాల ఆధారంగా ప్రచారం నిర్వహిస్తుంటాయి. కానీ, దక్షిణాదిలో మాత్రం అనాదిగా స్థానిక సమస్యలు, ప్రాంతీయ ఆకాంక్షలే ఎన్నికల ఎజెండాగా ఉంటూ వచ్చాయి. అయితే, ఈసారి తెలంగాణలో రాజకీయం అంతా రైతుల చుట్టూ తిరుగుతోంది. బీజేపీ ఆశించినట్లుగా, మోదీ పాలన మీదనో లేక పదేళ్ల బీఆర్‌ఎస్ విజయాల గురించో గాక, ఎన్నికల రాజకీయం రైతు సంక్షేమమే ప్రధాన అజెండాగా మారింది.

తెలంగాణ వ్యాప్తంగా 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటిలో 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు 64.75 లక్షలు కాగా, వీరి చేతిలో 1.11 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. ఇక, ఎకరం లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 24.24 లక్షలు కాగా, వీరి అధీనంలో ఉన్న భూమి 13.57 లక్షల ఎకరాలు. ఎకరా నుంచి రెండెకరాల మధ్యలో ఉన్న రైతులు 17.72 లక్షలు కాగా వీరు సాగుచేసే భూమి 26.58 లక్షల ఎకరాలు. 2 నుంచి 3 ఎకరాలున్న వారు 11.30 లక్షలు కాగా, 27.36 లక్షల ఎకరాల భూమి వీరి అధీనంలో ఉంది. 3 నుంచి 4 ఎకరాల మధ్య సాగుభూమి ఉన్న రైతులు 6.54 లక్షలు కాగా, వీరి భూమి వాటా 22.93 లక్షల ఎకరాలు. నాలుగు నుంచి ఐదెకరాల మధ్య భూమి ఉన్నవారు 4.92 లక్షలు కాగా, వీరి చేతిలో భూమి 21.03 లక్షల ఎకరాలు. ఈ గణాంకాలను బట్టి సగానికి పైగా ఓట్లు రైతాంగానివేనని అర్థమవుతోంది. దీంతో మూడు ప్రధాన పార్టీలూ వారి ఓటుబ్యాంకు మీద కన్నేశాయి.

తన పాలనా కాలంలో రైతుబంధు, రైతు బీమా పథకాలతో బాటు పుష్కలంగా సాగునీరు అందించానని, గతంలో కంటే తన పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, గులాబీ పార్టీ విస్తృతంంగా ప్రచారం చేశాయి. కానీ, రైతాంగానికి ఆ మాటలు రుచించలేదు. రుణ హామీ దశల వారీగా అమలు కావటం, కౌలు రైతాంగాన్ని పట్టించుకోకపోవటం, పోడు రైతుల గోసను నిర్లక్ష్యం చేయటం, రైతు కూలీల సంక్షేమానికి ఏమీ చేయకపోవటం వంటి కారణాలతో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలన్నీ గులాబీ పార్టీకి ఓటేయలేదు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లోనైనా తన ఉనికిని నిలుపుకుని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలంటే రైతుల మద్దతు పొందటమేననే అంచనాకు కేసీఆర్ వచ్చారు. ఈ క్రమంలో ఆయన బస్సు యాత్ర పేరుతో జిల్లాల పర్యటనలు చేసి, రైతు సమస్యలనే ప్రధాన ఎజెండాగా లేవనెత్తుతున్నారు. ఎండిన పొలాలను పరిశీలించటం, కాంగ్రెస్ వచ్చాక సాగునీరు లేకుండా పోయిందంటూ విమర్శలు చేయటం, రుణమాఫీ ఇంకెప్పుడంటూ నిలదీయటం, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన రైతుబంధు సాయం గురించి ప్రస్తావిస్తూ.. మళ్లీ రైతుల మనసు గెలిచే యత్నాలు చేస్తున్నారు.

Also Read: జూనియర్ జేజెమ్మ..ఆఫర్లు ఏవమ్మా?

మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ మోదీ, రామాలయం, ఆర్టికల్ 370 వంటి అంశాలను తలకెత్తుకుని ప్రచారం చేస్తుంటే, తెలంగాణలో మాత్రం రైతుల గురించే ప్రధానంగా మాట్లాడుతోంది. నిజానికి ఆ పార్టీ ఎన్నడూ ఇక్కడ అధికారంలో లేదు గనుక తాను స్వయంగా చేసిందంటూ చెప్పుకోవటానికి ఏమీలేదు. కనుక గత బీఆర్ఎస్ హాయాంలో రైతులకు జరిగిన నష్టం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకు సంబంధించి అమలు చేయాల్సి ఉన్న పెండింగ్ హామీలను ప్రస్తావిస్తూ, తానూ రైతు మేలు కోర్టే పార్టీనేననే అభిప్రాయాన్ని ఓటర్ల మనసులో కలిగించే యత్నం చేస్తోంది. పట్టణ, నగర పార్టీగా, అగ్రవర్ణాల పార్టీగా పేరున్న బీజేపీ తనపై ఉన్న ముద్రను చెరిపేసుకుని, శ్రామిక వర్గాల పార్టీగా.. మరీ ముఖ్యంగా రైతాంగపు మేలు కోరే పార్టీగా కొత్త గుర్తింపును కోరుకుంటోంది. ఇందులో భాగంగానే ఈసారి ఆ పార్టీ రైతుల సమస్యను ప్రస్తావిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లెవనెత్తుతోన్న రైతు హమీలకు తమదైన శైలిలో జవాబిస్తూ, గతంలో తమ ప్రభుత్వాలు ఏమి చేశాయని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తు్న్నారు. ఆగష్టు 15వ తేదీ లోపు రాష్ట్రంలోని అర్హులైన 69 లక్షల రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని, వచ్చే సీజన్ నుండి ధాన్యానికి 500 రూపాయలు క్వింటాకు బోనస్ గా చెల్లించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రతి సభలోనూ చెబుతున్నారు. మరోవైపు రైతుబంధు సాయాన్ని కూడా అందిస్తున్నారు. గత 70 ఏళ్లలో నేటి తెలంగాణలో ఏర్పాటైన నీటి పారుదల ప్రాజెక్టలున్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు తెచ్చినవేనని, గతంలో రైతు రుణమాఫీ, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర తమ ప్రభుత్వాల ఘనతేనని క్షేత్ర స్థాయి నేతలు రైతులకు వివరిస్తు్న్నారు. కౌలు రైతుల సంక్షేమం, రైతు కూలీలు, పొలం పని లేని రోజుల్లో రైతాంగాన్ని ఆదుకుంటున్న ఉపాధి హామీ పథకం, పోడు భూములకు పట్టాలిచ్చిన అంశాలను వారు జనంలోకి బలంగా తీసుకుపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఆదరించిన రైతాంగానికి మెరుగైన సేవలు అందించటమే తమ లక్ష్యమని, కనుక లోక్‌సభ ఎన్నికల్లో తమకే ఓటేయాలని వారు కోరుతున్నారు. ఐదెకరాలు, ఆలోపు ఉన్న 64.75 లక్షల మంది రైతులకు ఇప్పటికే రూ.5,575 కోట్ల రైతుబంధు సాయం అందించామనీ, తాజాగా మిగిలిన ఐదెకరాలకు పైబడిన 4.24 లక్షల మంది రైతులకు రూ.2,050 కోట్లు ఇప్పుడు వారి అకౌంట్లలో జమ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

Publisher : Swetcha Daily

Latest

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Food Inflation: ఆహార ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట ఏదీ?

Any Check On Food Inflation: దేశంలో పార్లమెంటు ఎన్నికలు తుది...

National:వికసిత్ కాదు విద్వేషిత్

చివరి దశకు చేరుకున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఒక్కో దశలో...

Don't miss

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Food Inflation: ఆహార ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట ఏదీ?

Any Check On Food Inflation: దేశంలో పార్లమెంటు ఎన్నికలు తుది...

National:వికసిత్ కాదు విద్వేషిత్

చివరి దశకు చేరుకున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఒక్కో దశలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy name: ఒక తరానికి ఆయన ఆరాధ్య పురుషుడు. రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, పౌరాణిక పాత్రల కోసమే పుట్టాడా అనిపించే యశస్సు కలిగిన...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు సన్నాహాలు కేసును నీరుగార్చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నయీంతో రాజకీయ నేతల సంబంధాలపై ఆరా గ్యాంగ్ స్టర్ ఆస్తులపై తేలని లెక్కలు ...

SSC Results: సర్కారు బడిలో చదివి.. సత్తా చాటారు

- పది ఫలితాల్లో దుమ్మురేపిన ఇందూరు సర్కారీ స్కూళ్లు - జిల్లా వ్యాప్తంగా 103 మంది విద్యార్థులకు 10/10 గ్రేడ్ - ఫలితాల్లో అబ్బాయిలను వెనక్కి తోసిన అమ్మాయిలు - కార్పొరేట్ స్కూళ్ల కంటే సర్కారే...