Saturday, May 18, 2024

Exclusive

Route Map : ఉమ్మడి పౌరస్మృతికి రూట్‌మ్యాప్ ఏదీ?

Where Is Route Map For A Common Civic Memory: దేశం సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో నిలిచిన వేళ కేంద్రంలోని పెద్దలు తరచూ తమ ప్రసంగాల్లో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం ప్రజాస్వామ్యవాదులను కలవరపరుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం, యూసీసీ అంశాలను బీజేపీ తొలిరోజే తన అజెండాలోని ముఖ్యాంశాలుగా ప్రకటించింది. తమ పార్టీకి పార్లమెంటులో పూర్తి మెజారిటీ వచ్చిన రోజు ఈ మూడు అంశాలను అమలు చేస్తామని ప్రతి ఎన్నికల సందర్భంగా బీజేపీ చెబుతూనే వచ్చింది. 2014లో పూర్తి మెజారిటీతో ఎన్డీయే సర్కారు కొలువుదీరగానే ఈ మూడు అంశాల అమలుకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన అంశాల మీద బీజేపీ దృష్టి సారించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలిచిన బీజేపీ ఆ ఏడాది 5 న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అదే ఏడాది నవంబరు 9న సుప్రీంకోర్టులో వచ్చిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవటంతో శరవేగంగా ఆలయాన్ని నిర్మించి, 2024 జనవరి 22న అయోధ్య రామాలయాన్ని ప్రారంభించింది. నాటి నుంచి బీజేపీ ఇక తన తదుపరి లక్ష్యం యూసీసీ అంటూ ప్రకటించింది.

భారత రాజ్యాంగ రచనా కాలంలో రాజ్యాంగ సభలో యూసీసీ మీద చాలా అర్థవంతమైన చర్చ జరిగింది. ‘ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) వాంఛనీయమే గానీ, దేశం మొత్తం దీన్ని ఆమోదించడానికి సిద్ధమయ్యే వరకు ఇది స్వచ్ఛందంగా అమలుకావాలి’ అని నాడు డా. బీ.ఆర్. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44లోని ఆదేశిక సూత్రాలకి, 25, 29 ఆర్టికల్స్‌ పూచీపడే ప్రాథమిక హక్కులకు చాలా వైరుధ్యం ఉంది. మన రాజ్యాంగం ప్రకారం.. హక్కులను అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, ఆర్టికల్‌ 44 ఆదేశిక సూత్రమే తప్ప ‘ఆదేశం’ కాదని గుర్తించాలి. తమ మత వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు మైనారిటీలకు ఉందని ఆర్టికల్‌ 25, భాష, సంస్కృతీ పరమైన విభిన్న లక్షణాలను రక్షించుకునే హక్కు గురించి ఆర్టికల్‌ 29 స్పష్టంగా చెబుతున్నాయి. మరి ఈ పరిస్థితిలో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా, మైనారిటీలకు ఇచ్చిన ఈ హక్కులను దెబ్బతీయకుండా యూసీసీ సాధ్యమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Read Also: ‘చార్ సౌ’ కల నెరవేరేనా?

మన పొరుగుదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో బాటు మలేషియా, టర్కీ, ఇండోనేషియా, సూడాన్, ఈజిప్ట్ వంటి పలు దేశాల్లో యూసీసీ అమల్లో ఉన్నప్పటికీ, అక్కడి సమాజాలకు, భారత్‌లోని బహుళత్వపు సమాజానికి ఎక్కడా పోలికే లేదు. భారత్‌లోని హిందు, ముస్లిం, జైన, సిక్కు, బౌద్ధ మతాల వారు తమ మత విశ్వాసాల ప్రకారం జీవించేందుకు, తమ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన వేర్వేరు చట్టాలను, భారత రాజ్యాంగం అనే గొడుగు నీడన అమలు చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఇక్కడ వివాహం, విడాకులు, వారసత్వ ఆస్తి, దత్తత వంటి విషయాల్లోనూ వీరికి వేర్వేరు చట్టాలున్నాయి. కనుక ఏ చర్చాలేకుండా వీరందరినీ ఒకే చట్టం కిందికి తీసుకురావటం వీలుకాదు. ఈ విషయాన్ని గమనించే ఈశాన్య రాష్ట్రాలను, ఆదివాసీలు, గిరిజన తెగలను యూసీసీ నుంచి మినహాయించాలని ‘పార్లమెంటరీ ప్యానెల్‌ ఆన్‌ లా’ చైర్మన్‌ సుశీల్‌ మోదీ గతంలో సూచించారు. మరోవైపు ఆరెస్సెస్‌ కూడా గిరిజనులను ‘ఉమ్మడి పౌరస్మృతి’ నుంచి మినహాయించాలని కోరింది. 144 కోట్ల మంది జనాభా గలిగిన దేశంలో ఒక పెద్ద చట్టాన్ని తీసుకొచ్చే ముందు ఈ విషయాల మీద లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

ముంబై కేంద్రంగా పనిచేసే ‘ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్’ అనే సంస్థ చేసిన అధ్యయనంలో భారతదేశంలో బహుభార్యాత్వం మతాలకు అతీతంగా ఉందని, అయితే, నేటి కాలంలో మతాలకు అతీతంగా అందరూ ఒకే జీవిత భాగస్వామికి కట్టుబడి జీవించే ధోరణి ఉందని తేలింది. ఈ సంస్థ అధ్యయనంలో ముస్లిం స్త్రీలలో 1.9 శాతం మంది, హిందూ మహిళల్లో 1.3 శాతం మంది తమ భర్తకు రెండో భార్య ఉందని అంగీకరించారు. తెలంగాణలో ముస్లింల కంటే హిందువుల్లోనే బహు భార్యాత్వం ఎక్కువని ఈ సర్వేలో తేలగా, అస్సాంలో ముస్లింలే ఈ విషయంలో ముందున్నారు. మరోవైపు.. బహు భార్యాత్వాన్ని నిషేధించి తీరాలనీ, ఎటువంటి మినహాయింపులూ లేకుండా అన్ని మతాలవారికీ వర్తింపచేయాలని అంటే వచ్చే ప్రమాదం అధికమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బల్బీర్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని 21వ లా కమిషన్ అభిప్రాయపడింది. తన అధ్యయనంలో భాగంగా కమిషన్ పై సర్వేని కూడా పరిగణనలోకి తీసుకుంది. ‘ప్రాథమిక హక్కులకు, కుటుంబ చట్టాలకు మధ్య గల సంఘర్షణను తొలగించకుండా యూసీసీ అమలు సాధ్యం కాదని, అది వాంఛనీయమూ కాదు’ అని కమిషన్ స్పష్టం చేసింది. దీనికోసం పార్లమెంటులో ఎన్నో చట్టాలకు సవరణలు చేపట్టాల్సి ఉందనీ, అయితే.. ఈ సవరణకు ముందు కుటుంబ, మతపరమైన నియమాల్లోని అయోమయాలనూ నివృత్తి చేయాలని పేర్కొంది.

Read Also: ఆర్థిక గణాంకాల వెనుక అసలైన నిజాలు

మరి ఇన్ని సంక్లిష్టమైన విషయాలను సమాజంలో చర్చకు పెట్టకుండా, లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా యూసీసీ విషయంలో అధికారంలో ఉన్న నేతలు నోటికొచ్చింది మాట్లాడటం సమాజంలోని సున్నితమైన, సామరస్యపూరిత వాతావరణాన్ని భంగపరుస్తోంది. ఇప్పటికే యూసీసీ తమ వివాహ చట్టాల రద్దుకు దారి తీస్తుందని అఖిల భారత ముస్లిం పర్సనల్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రపంచపు అతిపెద్ద జనాభా గల దేశంలో స్పష్టమైన చట్టాలు అవసరమనే విషయాన్ని ఎవరూ నిరాకరించరు గానీ, దానిపై ఏకాభిప్రాయ సాధన ఎలా అనే విషయంలోనే చాలామందికి అనుమానాలు, భయాలున్నాయి. ముస్లింల బహుభార్యాత్వాన్ని ప్రధాన సమస్యగా ఎత్తిచూపి, ఈ చట్టంతో వారి జనాభాను తగ్గిస్తామని కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. కనుక యూసీసీ ముసాయిదా బిల్లు ముసాయిదా ప్రకటన, పార్లమెంటులో దానిపై చర్చించే క్రమంలో గానీ నేతలు సంయమనాన్ని పాటించాలి. నేతల శరీర భాష, హావభావాలు అహంకారపూరితంగా, దురుసుగా ఉండకుండా వినమ్రంగా, ఇది మన అందరి భవిష్యత్తుకు సంబంధించిన బిల్లు అనే ధోరణిలో ఉండాలి. కనీసం ఏడాది పాటు యూసీసీ మీద సభలు, సదస్సులు పెట్టి సమాజంలో చర్చ జరపటం, అందులో అన్ని వర్గాల వారు పాల్గొనేలా చూడటం అవసరం. అంతే తప్ప రహస్యంగా ముసాయిదా బిల్లు రెడీ చేసి, దేశాన్ని ఆశ్చర్యపరిచేలా పార్లమెంటులో పెట్టి సంఖ్యాబలంతో దానిని ఆమోదించి ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఆలోచనకు దూరంగా ఉండాలి.

భారత్‌లో 144 కోట్ల జనాభా ఉండగా, వారిలో 120 కోట్ల మంది హిందువులు కాగా మిగిలిన 24 కోట్లలో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు ఉన్నారు. హిందూ సమాజంలో తిరిగి అనేక కులాలు, జాతులు, ఉప విభాగాలున్నాయి. హిందూ సంస్కృతిలో వివిధ సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. కర్ణాటకలో వీరశైవాన్ని పాటించే లింగాయతులు తాము హిందువులం కాదని, తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరారు. అలాగే బ్రహ్మసమాజ విధానాలను ఆచరించేవారు కూడా ఇదే బాట పట్టారు. ఇలాగే ముస్లింలు, సిక్కులు, పార్శీలు, జైనులకు వారివారి వివాహ సంప్రదాయాలు, పద్ధతులున్నాయి. కనుక అందరి అభిప్రాయాలను స్వీకరిస్తూనే, మధ్యేమార్గంగా అందరినీ ఒక మాటమీదికి తీసుకురాగల ముసాయిదా బిల్లును ముందుగా కేంద్రం రూపొందించాలి. రైతు చట్టాలు, పౌరసత్వసవరణ చట్టం మీద దేశవ్యాప్తంగా జరిగిన హింస, విధ్వంసాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ బిల్లు విషయంలో ముందడుగు వేయాలి తప్ప దేశంలోని హిందువులకు తానే ఏకైక ప్రతినిధిని అనే ధోరణిని ప్రదర్శించకుండా సంయమనం పాటించాలి. అప్పుడే కేంద్రం తీసుకొచ్చే ఆ చట్టం పదికాలాల పాటు మనగలిగి, ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతుంది.

-నెక్కంటి ఆంత్రవేది (సామాజిక కార్యకర్త)

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Freebies: ఉచితాల రాజకీయం ఇంకెన్నాళ్లో?

Welfare Schemes: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు విపక్షాలు ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతూపోతూ ఖాళీ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఈ పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం....

Israel: ఈ భీకర యుద్ధం ఆగేదెప్పుడో…?

Israel Hamas War Palestine Conflict Gaza Air Strikes Bombings Land Operations: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య మొదలైన యుద్ధం బుధవారం నాటికి 222 రోజులకు చేరింది. ఈ ఏడున్నర...