Tuesday, December 3, 2024

Exclusive

Warehouse Corporation scam : ఫోర్జరీ కింగ్స్.. టెండర్ల మాటున కమీషన్ల దందా!

తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు

– వేర్ హౌజింగ్ గోదాముల టెండర్స్‌లో అవకతవకలు
– కావాల్సిన వారికే అనుకూలంగా నిబంధనలు
– మార్ఫింగ్ డ్యాకుమెంట్లతో మాయ
– అంతా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనుచరుల కోసమే
– అడ్డదారిలో వచ్చి ఆదాయాన్ని లూటీ చేస్తున్న ఎస్ఈ రాధాకృష్ణ మూర్తి
– కమీషన్స్ కోసం తెలిసిన వాళ్ల దగ్గరే మెటీరియల్ సేల్స్
– ఫోర్జరీ సంతకాలను కప్పిపుచ్చుకునేందుకు ఆరాటం
– టెండర్లను రద్దు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం
– ఆఖరికి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం అంటూ మోసం చేసిన బిడ్డర్ తిరుపతయ్య
– అర్హత ఉన్నా.. టెండర్ల నుంచి తప్పించారని హైకోర్టులో బాధిత సంస్థల పిటిషన్
– గోదాముల నిర్మాణ టెండర్లలో గోల్ మాల్‌పై ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి- 9848070809

Warehouse Corporation scam in telangana : ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం: బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ బినామీలకే టెండర్లు దక్కాలని ఎన్నో తప్పిదాలు చేశారు మంత్రులు, అధికారులు. చివరికి కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్లను మార్ఫింగ్ చేశారు. ఫోర్జరీ సర్టిఫికెట్స్ ఆన్ లైన్ టెండర్లలో పెట్టి ఇరుక్కున్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అడిగేవారే ఉండకపోవచ్చు. కానీ, ప్రభుత్వం మారడంతో తప్పిదాలు బట్టబయలు అవుతున్నాయి. బాధితులు ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు. కోర్టు గడపతొక్కి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి టెండర్లు రద్దు అంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఆనాడు అనుభవంతో బిడ్డింగ్‌లో పాల్గొనాలనుకునే వారిని అనర్హతగా ప్రకటించారు. చిన్న టెక్నికల్ వర్డ్ పెట్టి టెండర్లు అనర్హులకు వచ్చేలా చేశారు. డే లైట్ , సన్ లైట్ అంటూ పదాలను చేర్చి అర్హత ప్రకటించిన ఘనత వేర్ హౌజింగ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ బీ రాధాకృష్ణ మూర్తికే చెల్లుతుంది.

టెండర్లు దక్కాలని ఫోర్జరీ

2023లో వనపర్తి జిల్లాలో మోజర్ల గ్రామం, నారాయణ పేట్ జిల్లాలోని మర్కల్‌లో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ ఉంచేలా గోదాములను నిర్మించాలని టెండర్లను పిలిచింది తెలంగాణ వేర్ హౌజింగ్ కార్పొరేషన్. డే లైట్ సిస్టమ్స్‌తో ఉండాలని టెక్నికల్‌గా మెలికలు పెట్టారు. సన్ లైట్ తగిలేలా గోదాము ఉండాలని అర్థం. అందుకు గతంలో పనిచేసిన అనుభవమైనా ఉండాలి లేదా చేసిన వారితో అగ్రిమెంట్స్ చేసుకుని ఉండాలని కండిషన్ పెట్టారు. 6 వేల స్క్వేర్ మీటర్ల రూప్ వర్క్ చేసిన వారై ఉండాలని నిబంధనలు ఉన్నాయి. 15 వేల స్క్వేర్ మీటర్ల అనుభవం, ఎన్నో పనులు చేసిన కంపెనీలు ముందుకు వచ్చాయి. నిజానికి సన్ లైట్ అనే టెక్నాలజీ అందరూ చేశారు. కానీ, దాన్ని వేరే విధంగా చూపించి టెండర్లను పిలవడంతో ఆ సర్టిఫికెట్ లభించలేదు. దీంతో దాన్నే హైలైట్ చేసి మిగితా అనుభవం ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించారు. ఇక్కడే ఫేక్ సర్టిఫికెట్‌తో మంత్రి నిరంజన్ రెడ్డి అనుచరులు రంగంలోకి దిగారు. వారి కంపెనీలకే అర్హత ఉందంటూ ఊదరగొట్టారు. అప్పటి నిర్మల్ జిల్లా మంత్రికి చెందిన అనుచరునికి ఎల్-2 వచ్చేలా చేసి సిండికేట్‌గా టెండర్లలో ప్రభుత్వం ధర కంటే అధిక ధరకు వేశారు. గడవు ముగిసిన సర్టిఫికెట్‌తో ఉన్న స్కై షేడ్ అనే ఒకే కంపెనీకి ఈ అనుభవం ఉండటంతో ఆ కంపెనీతో మంత్రి అనుచరుల కంపెనీలు అక్టోబర్ 12, 2023న అగ్రిమెంట్లు చేసకున్నాయి. మామూలుగా ఇన్ హౌజ్ ఆర్ అండ్ డీ మినిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఆ సర్టిఫికెట్ కనీసం 6 నెలల కంటే ముందు ఉండాల్సి ఉంటుంది. కానీ, వీరికి మార్చి 31, 2023 వరకే గడువు ఉంది. అప్పటికప్పుడు మళ్లీ అప్లయి చేసుకోవాలంటే అనుమతులు రావని తెలుసు. దీంతో సర్టిఫికెట్‌ని మరో మూడేళ్ల వరకు పొడిగించినట్లు మార్చి31, 2026 వరకు అనుమతులు ఉన్నాయని అదే పేపర్‌ని ఫోర్జరీ చేసి అన్ లైన్ టెండర్స్‌లో పాల్గొన్నారు. అలాగే, బ్యాంకు సాల్వేనిసీ సర్టిఫికెట్స్ ఆన్ లైన్‌లో ఇచ్చినవి ఎక్సపయిరీ అయిపోతే మళ్లీ మాన్యువల్‌గా ఇచ్చారు. ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ కూడా గడవు ముగియడంతో మళ్లీ ఎస్ఈ చేతుల మీదుగా అందించారు. ఇలా వారు అనుకున్నవారికి ఇష్టం వచ్చినట్లు చేశారు.

సర్టిఫికెట్ బండారం బయటపెట్టిన కేంద్రం

సర్టిఫికెట్ మార్ఫింగ్ చేసి దొంగ దారిలో టెండర్లు దక్కించుకున్నాయి హేమచంద్, తిరుపతయ్య కంపెనీలు. ఎంతో అనుభవం ఉన్న కంపెనీలను కాదని చిన్న టెక్నికల్ వర్డ్ యాడ్ చేసి ఇష్టానుసారంగా ఫేక్ డ్యాకుమెంట్లు పెట్టినా టెండర్లు ఇచ్చారని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. కేంద్ర ప్రభుత్వం ఆ సర్టిఫికెట్లు తాము పొడిగించలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ బాగోతం అంతా బయటపడింది.

టెండర్లు రద్దు అంటూ డ్రామా

తప్పు చేసినా, చేయించినా ఎస్ఈ రాధాకృష్ణ మూర్తి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. టెండర్లలో ఫేక్ డ్యాక్యుమెంట్స్ పెడితే గతంలో ఈడీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని క్రిమనల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. దీంతో అప్రమత్తం అయిన రాధాకృష్ణ మూర్తి కనిపించిన వారికల్లా టెండర్లు రద్దు చేస్తామని ప్రకటిస్తున్నారు. అయితే, టెండర్లను రద్దు చేసే అవసరం ఇక్కడ లేదని అనర్హత కొల్పోయిన కంపెనీలు కోర్టులో వాదిస్తున్నాయి. కార్పొరేషన్ వద్ద భారీగా డబ్బులు ఉన్నాయి. అక్కడ గోదాముల అవసరం ఉంది. అన్నింటినీ పూర్తి చేసుకుని ఇప్పుడు రద్దు చేస్తే మరో 6 నెలలు సమయం వృథా అవుతుంది. ఎవరైతే అనర్హతగా ప్రకటించారో వారందరినీ పరిగణనలోకి తీసుకొని ఎవరు తక్కువగా టెండర్లు వేసి ప్రజల సొమ్మును కాపాడుతారో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఎస్ఈ రాధాకృష్ణ లీలలు

రాంగ్ రూట్‌లో వచ్చి తెలంగాణ వేర్ హౌజింగ్‌ని ఏలుతున్న రాధాకృష్ణ మూర్తి లీలలు అన్నీ ఇన్నీ కావు. తనకు తెలిసిన వారి వద్దనే కాంట్రాక్టర్స్ మెటీరియల్ తీసుకోవాలి. ఈయన వచ్చినప్పటి నుంచి రూ.500 కోట్ల టెండర్లు జరిగాయి. ఒకేసారి కమీషన్స్ కాకుండా పనిని బట్టి లాగేస్తారని కాంట్రాక్టర్స్ ఆరోపిస్తున్నారు. ఊరు పేరు లేని వారిని పరిచయం చేయించి మెటీరియల్ ఇస్తారని లక్షలాది డబ్బులు ముందే వారికి అడ్వాన్స్‌గా ఇప్పించేవారు. ఆ సొమ్ము రాదు, మెటీరియల్ ఉండదు. తీరా ఆ డబ్బు ముందే కమీషన్ రూపంలో గోవాలో ఉండే తన కొడుకు బిజినెస్‌కు చేరిపోతుందని విమర్శలు ఉన్నాయి. ఇలా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కనుసన్నల్లో ఎండీ జితేందర్ రెడ్డిని కాదని ఎన్నో దందాలు చేశారని తెలుస్తోంది. వీటన్నింటిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.

జర్నలిస్టులను మోసం చేసిన తిరుపతయ్య సాగర్

కొల్లాపూర్‌లో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకున్న తిరుపతయ్య బిడ్డర్, నిర్మాణం చేయకుండానే ఒక్కొక్క జర్నలిస్టు వద్ద 5 లక్షలు తీసుకొని పనులు చేయకుండా వదిలేశాడు. 20 మంది జర్నలిస్టుల సొమ్ము కోటి 80 లక్షలతో ఉడాయించాడు. దీంతో ఈనెల 13న వనపర్తి ఎస్పీ రక్షణమూర్తికి ఫిర్యాదు చేశారు జర్నలిస్టులు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...