Warangal West MLA Naini Fire On KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడిన మాటలకు నవ్వొస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని మండిపడ్డారు. కబ్జాలకు, మోసాలకు బీఆర్ఎస్ నాయకులు కేరాఫ్ అడ్రస్‌గా మారారని అన్నారు. వరంగల్ జిల్లా మీద పడి బీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లా తిన్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులకు వరంగల్ జిల్లా గురించి మాట్లాడే అర్హత, ఎన్నికల్లో ఓటు అడిగే హక్కును కూడా కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడటానికి మీకు సిగ్గు ఉండాలని బీఆర్‌ఎస్ నాయకులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్‌తోనే వరంగల్ జిల్లా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వరంగల్ నగరం కేంద్రంలోని ఎంజీఎంలో జరిగిన ఘటనను పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు. కరెంటు పోవడం ప్రకృతి వలన జరిగిన ఘటన మాత్రమే. ఇది కావాలని ఎవరు చేయరని అన్నారు. ఇక ఇదే ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందన్నారు.మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎంజీఎం బాగుపడిందని ఎమ్మెల్యే నాయిని అన్నారు.గతంలో ఎంజీఎం సమస్యలపై కాంగ్రెస్ ధర్నా చేసినా మీరు పట్టించుకోలేదని గుర్తుచేశారు. అప్పుడు పట్టించుకోని మీరు ఎంజీఎం గురించి మాట్లాడటానికి సిగ్గుపడాలని బీఆర్‌ఎస్ నేతలకు చురకలు అంటించారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంజీఎంలో ఎలాంటి పరిణామాలు జరిగాయో అందరికి తెలియదా? అని ఫైర్ అయ్యారు.
Also Read:మోదీపై ఫైర్ అయిన కాంగ్రెస్ సీనియర్ లీడర్
బీఆర్‌ఎస్ హయాంలో ఎంజీఎం దవాఖానలో పేషంట్‌ను ఎలుకలు కొరికిన ఘటన, మిషనరీ పాడైన ఘటనలు గుర్తులేవా? అంటూ గరం అయ్యారు.10 ఏళ్ల వ్యత్యాసమును, ఆరు నెలల వ్యత్యాసమును గమనించాలని ప్రజలకు తెలిపారు. వరంగల్‌కు కేటీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు. ఘతంలో వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు వరదలకు నష్టపోయిన బాధితులకు పదివేలు ఇస్తానని చెప్పి ఇచ్చారా అని ఎమ్మెల్యే నాయిని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు వరంగల్‌పై లేని ప్రేమ ఉన్నట్టుండి ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుందని ఆయన అన్నారు. వరంగల్‌లో పర్యటించే హక్కును కూడా కోల్పోయారని బీఆర్‌ఎస్ నాయకులను హెచ్చరించారు.