Viswambara : మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర. టైటిల్ తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ మూవీ ఫాంటసీ జోనర్ లో రూపొందుతోంది. చిరంజీవికి ఫాంటసీ సినిమాలు కొత్తేమీ కాదు. యముడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమాలతో మెప్పించాడు. ఇక తొలి చిత్రం బింబిసారతోనే హిట్టు అందించిన వశిష్ట ఈ చిత్రాన్ని తన తొలి చిత్రాన్ని మించి ఉండేలా రూపొందిస్తున్నారు. పైగా రెండో చిత్రమే మెగా ఆఫర్ అందిపుచ్చుకోవడంతో ప్రతి సన్నివేశాన్ని ఆచితూచి పర్ఫెక్ట్ గా వచ్చేలా తీస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి బింబిసార విడుదల చేసేందుకు షూటింగ్ చిత్రీకరణ వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఇటీవల 26 రోజులపాటు జరిగిన షెడ్యూల్ లో హై వోల్టేజ్ ఇంటర్వెల్ సీన్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీన్ మొత్తం సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం.
17 డిఫరెంట్ సెట్స్
ఈ సినిమాలో చిరు.. డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ పోషిస్తున్న రెండో క్యారెక్టర్.. ప్రీ ఇంటర్వెల్ సీన్ లోనే రివీల్ కానుందట. భారీ యాక్షన్ సీన్స్ తో ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య ఆ పాత్రను మేకర్స్ పరిచయం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్ సీన్స్ అన్నింట్లో డూప్ లేకుండా చిరంజీవినే నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్.. ఈ సినిమా కోసం 17 విభిన్నమైన సెట్స్ ను రూపొందించారని టాక్ వినిపిస్తోంది. నేచురల్ గా కనిపించేలా ప్రతీ సెట్ ను జాగ్రత్త తీర్చిద్దిదారట. అందులోని తొమ్మిది సెట్లలో ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని సమాచారం. మిగతా సెట్స్ లో త్వరలోనే షూటింగ్ జరగనుంది. అలా సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ సెట్స్ లోనే జరగబోతున్నట్లు తెలుస్తోంది. 17లో చాలా సెట్స్.. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో రూపొందించారు. ఇటీవల ప్రీ ఇంటర్వెల్ సీన్ ను కూడా అక్కడే షూట్ చేశారట..
ప్రత్యేక ఆకర్షణగా హనుమంతుడి విగ్రహం
54 అడుగుల హనుమాన్ విగ్రహం ఎదురుగా ఫైట్ సీన్ షూట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఆంజనేయుడి విగ్రహం.. పలు అప్డేట్స్ ద్వారా మనం చూసిన విషయం తెలిసిందే. పవన్, నాగబాబుతో పాటు రీసెంట్ గా హీరో కార్తికేయ సెట్స్ కు వెళ్లినప్పుడు అక్కడే ఫొటోలు దిగారు. ఇక సినిమా విషయానికొస్తే.. చిరంజీవికి జోడీగా సీనియర్ బ్యూటీ త్రిష నటిస్తోంది. యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2025 జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.