Upasana Konidela Praises Husband Global Star Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ భార్య కొణిదెల ఉపాసన తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను డిప్రెషన్ నుంచి బయటపడటానికి తన భర్త ఎంతో సహాయం చేసినట్లు తెలిపారు. డెలివరి తరువాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను రివీల్ చేసింది. తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణమన్నారు.
చాలా మందిలాగే డెలివరి తరువాత తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, ఆ టైంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్‌లా వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు. ఇక క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితంలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణం. కానీ.. అది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ప్రసవానంతర డిప్రెషన్‌ను తక్కువగా అంచనా వేయలేం. అవసరమనుకుంటే నిపుణులను సంప్రదించి దాని గురించి బయటపడాలి.
Also Read: చెమటలు పట్టిస్తున్న జాన్వీ
చాలా మందిలాగే నేనూ డెలివరి తరువాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు నా భర్త రామ్‌చరణ్ అండగా నిలిచాడు. నాతో పాటు మా పుట్టింటికి వచ్చాడు. కూతురు క్లీంకార విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. క్లీంకార ఎన్నో విషయాల్లో తన తండ్రిని తలపిస్తుందని ఉపాసన చెప్పుకొచ్చింది. పిల్లల పెంపకంలో తనకెప్పుడు సాయం చేసే భర్త ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది.