UP Woman Seeks Divorce After Husband Forgets To Bring Kurkure: ఇటీవలి కాలంలో విడాకులు చాలా సింపుల్ అయిపోయాయి. అంతేకాదు ఇవి ఎంతగా అపహాస్యం అవుతున్నాయో చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ అనే చెప్పాలి. ఎందుకంటే..కొద్దిపాటికే విడాకులు, లేదంటే చంపుకోవడాలు ఇలా దేశంలో చాలానే చోటుచేసుకున్నాయి. తన భర్త కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదన్న కారణంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ ఘటనా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది.
ఆమెకు ప్రతి రోజూ కుర్‌కురేను చిరుతిండిగా తినడం అలవాటు. భర్త రోజూ రూ. 5 కుర్‌కురే ప్యాకెట్ తీసుకొచ్చి ఆమెను సంతోషపెట్టేవాడు. ఒక రోజు ఉత్త చేతులతో ఇంటికొచ్చిన భర్తను చూసిన భార్య కోపంతో ఊగిపోయింది. ఆ వెంటనే పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ ఇప్పించాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి చిన్న కారణాలతో విడాకులు కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకి బాగా పెరుగుతున్నాయి.
Also Read: వావ్..! బంగారం, వెండి పానీపూరీలు, నెట్టింట వైరల్
పెళ్లయి 18 నెలలు అయినా భర్త తనతో గొడవపడడం లేదని, అతడి నుంచి తనకు విడాకులు ఇప్పించాలని యూపీ మహిళ అప్పట్లో కోర్టుకెక్కడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా ఇలాంటి ఘటనా మళ్లీ తెరమీదకు రావడంతో పెళ్లి కాని కుర్రాళ్లు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. అంతేకాదు పెళ్లా బాబోయ్ అంటూ పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఇలాంటి వాటిని చట్టాలు కూడా ప్రోత్సహించకుండా మహిళల తల్లిదండ్రులకు సదరు మహిళలకు గట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. భార్య బాధితులు, పెళ్లికానీ యువకులు. చూడాలి మరి ఇంక ముందు ముందు ఇంకెన్ని చిత్ర విచిత్ర వింతలు చూడాల్సి వస్తుందో….