Wednesday, September 18, 2024

Exclusive

Utter Pradesh:యూపీ..బీజేపీకి బీపీ

  • యూపీలో నేడు 5వ దశ పోలింగ్
  • యూపీలో కమలానికి ఎదురుగాలి
  • యోగి సర్కార్ పై పెల్లుబుకుతున్న అసంతృప్తి
  • మద్దతు ధర ఇవ్వని కారణంగా చెరుకు రైతుల్లో వ్యతిరేకత
  • బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేయనున్న జాట్, నాన్ యాదవ్ వర్గాలు
  • మోదీకి ఓట్లేయొద్దంటున్న రాజ్ పుత్ సంఘాలు
  • 15 నియోజకవర్గాల పరిధిలో పల్లె ఓటర్ల వ్యతిరేకత
  • బీజేపీని భయపెడుతున్న రాజకీయ విశ్లేషకుల అంచనా

up voters voting against bjp may 20 5 phase parliament elections:
2004 పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. సోమవారం మే 20న ఐదో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఐదో దశలో యూలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్ లో 7 స్థానాలు, బిహార్లో 5, ఒడిశాలో 5,జార్ఖండ్ లో 3, జమ్ముకశ్మీర్, లడఖ్ లలో ఒక్కో స్థానానికి మొత్తం 49 పార్లమెంట్ స్థానాలకు పోటీ జరగనుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీచేస్తున్న రాయ్ బరేలి, లక్నో నుంచి రాజ్ నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ వంటి హేహాహీములు ఈ దశ పోలింగ్ లో పోటీలో ఉన్నారు. అయితే కేంద్రంలో అధికారం పొందేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కమలానికి ఎదురీత తప్పేలా లేదని విశ్లేషకులు అంటున్నారు .14 స్థానాలలో పోటీచేస్తున్న యూపీలో బీజేపీ కి ఎదురుగాలి స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. . రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై యువ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ధరల పెరుగుదలకు కేంద్రంలోని బీజేపీనే కారణమని చాలా మంది పేదలు నమ్ముతున్నారు! మరోవైపు రైతుల ఉద్యమం తదితర కారణాల వల్ల రాజ్‌పుత్‌లలోనూ కమలనాథుల పట్ల ఆగ్రహం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కమలనాథులకు నిరాశ తప్పకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

బీజేపీ మీద స్పష్టంగా అసంతృప్తి

యోగీ సర్కార్ వచ్చాక పశువధ శాలలను నిషేధించారు. ఉపయోగం లేని పశువులు, ఇతరత్రా వంటి వాటిని అమ్ముకోవడానికి కొందరు సామాన్యులకు ఇబ్బందికరంగా ఉంది. ఇక ప్రధాని కిసాన్ యోజన సాయం ఇస్తున్నా ఈ పశువుల పోషణకు అయ్యే ఖర్చు రెట్టింపుగా మారింది. దానితో వివిధ సామాజిక వర్గాల రైతులు బీజేపీని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అక్కడ చెరకు రైతులు సైతం బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చెరుకు మద్దతు ధర పెరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే అక్కడి సామాజిక వర్గాలు నాన్ యాదవ్, జాట్ వర్గాలు. వీరంతా యోగీ సర్కార్ కు వ్యతిరేకంగా ఓట్లేయనున్నారు. రాజ్ పుత్ మీటింగులు పెట్టి మరీ బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. జాట్లలో కూడా బీజేపీ మీద అధిక శాతం వ్యతిరేకత పెంచుతున్నారని అంటున్నారు. అలాగే అనేక ఉత్తరాది రాష్ట్రాలలో యువత నిరుద్యోగం విషయంలో బీజేపీ ప్రభుత్వం మీద మండి పోతున్నారు అని అంటున్నారు. రైతాంగ ఉద్యమాన్ని జాట్లు నడిపారు. ఆ ఉద్యమం ద్వారా వ్యతిరేకతను బీజేపీ మూటకట్టుకుంది అని అంటున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు లేకుండా చేస్తారు అని పెద్ద ఎత్తున చేస్తున్న విపక్షాల ప్రచారం నేపధ్యంలో అది తీవ్ర స్థాయి వ్యతిరేకతను పెంచుతోంది అని అంటున్నారు.

ఎన్డీఏ కూటమికి అగ్నిపరీక్ష

ఈ ఎన్నికలు బీజేపీ-ఆర్‌ఎల్డీ కూటమికి అగ్నిపరీక్ష అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భాగ్‌పట్‌, మథుర, అలీగఢ్‌ నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య ఎలాంటి పొత్తు ఉన్న లక్షణాలు కన్పించడం లేదని వారు పేర్కొంటున్నారు. అక్కడ అవి ఎడమొహం, పెడమొహం గానే ఉన్నాయని, ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల జరిగిన సమావేశాల్లో పార్టీ కార్యకర్తల మద్య విభేదాలు ప్రస్ఫుటంగా కన్పించాయని అంటున్నారు. యూపీలో బీజేపీ చారిత్రక ఓటమిని చవిచూడబోతున్నదని ప్రతిపక్షాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇప్పటిదాకా జరిగిన నాలుగు విడతల పోలింగ్ లో బీజేపీకి మెజారిటీ తగ్గిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఓటు వేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అదే సమయంలో బీజేపీ ఓటింగ్‌ శాతంలో తగ్గుదల కన్పించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.వచ్చే రెండు దశల ఎన్నికల్లో ఆ పార్టీ మరింత బలహీన పడుతుందని అంటున్నారు. . 15 పార్లమెంట్‌ స్థానాల్లోని గ్రామీణ ఓటర్లలో బీజేపీ పట్ల వ్యతిరేకత కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

యోగి పాలనపై వ్యతిరేకత

ఇక్క‌డ యోగి పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అనేక వైఫ‌ల్యాలు బీజేపీ పాల‌న చుట్టూ ముసురుకున్నాయ‌ని తాజాగా నిర్వ‌హించిన ఓ స‌ర్వే స్ప‌ష్టం చేసిన‌ట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. గ‌తంలో డ్ర‌గ్స్ పేరుతో .. చాలా మంది విచ‌క్ష‌ణా ర‌హితంగా ఎన్ కౌంట‌ర్లు చేసేందుకు యోగి అనుమ‌తించ‌డం పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. స‌రే.. ఎన్నిక‌ల‌కు ముందున్న రెండేళ్ల పాల‌నే కీల‌కం క‌నుక‌.. ఇప్పుడు ఈ రెండేళ్ల పాల‌న కూడా బీజేపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.కొవిడ్‌ నియంత్రణలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెల్లుబుకుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎస్పీ బ‌లం పుంజుకుంది. ఇక‌, క‌రోనా క‌ట్ట‌డి, పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎస్పీ, బీఎస్పీలు పుంజుకున్న ద‌రిమిలా వ‌చ్చే సోమవారం జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో బీజేపీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...