Tuesday, June 18, 2024

Exclusive

United Kingdom:బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి

UK parliament candidate of Labour party Telangana region person participate:

యునైటెడ్ కింగ్ డమ్ బ్రిటన్ లో ఎన్నికల సందడి మొదలయింది. అనూహ్యంగా ఈ సారి బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదరు నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ ఈ మేరకు తమ పార్లమెంటరీ అభ్యర్థిగా నాగరాజు పేరును తాజాగా ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ బైండరీ కమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడిన పార్లమెంట్ నియోజకవర్గం అది. శనిగరం గ్రామంలో మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన హనుమంతరావు- నిర్మలా దేవి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్‌ లండన్‌లో పాలనాశాస్త్రంలో ఆయన పీజీ చేశారు.మరోవైపు (ఏఐ) ఆర్టిఫిషియల్‌ ఇంటె లిజెన్స్‌ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన ఐ పాలసీ ల్యాబ్స్‌ అనే థింక్‌ట్యాంక్‌ను నెలకొల్పారు.ఇంటర్నేషనల్ స్పీకర్, రచయితగా మంచి ఆయన పేరు ఉంది.

అక్కడ లేబర్ పార్టీదే హవా

యూకేలోనే స్కూల్‌ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, రాజకీయ ప్రచారకుడిగా పదేళ్ళుగా ఇంటింటికీ ప్రచారంతో అక్కడి ప్రజల్లో పట్టు సాధించారు. బ్రిటన్ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నెల జరిగిన కౌన్సిలర్‌, రాష్ట్ర మేయర్‌ ఎన్నికలోనూ లేబర్‌ పార్టీ విజయం సాధించింది. దీంతో తెలంగాణ బిడ్డ ఉదరు నాగరాజు కూడా బ్రిటన్‌ పార్ల‌మెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా ఘన‌విజయం సాధిస్తారని లండన్‌ ప్రతినిధి వీఎంరెడ్డి మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో 68 శాతం లేబర్‌ పార్టీ గెలవబోతుందని ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలక్టో రల్‌ కాల్కులస్‌ అంచన వేసింది. దీంతో తెలుగు బిడ్డ గెలుపు ఖాయమని చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ ఏడాదిలోనే బ్రిటన్‌, అమెరికాలోనూ ఎన్నికలు జరగనున్నాయి. రష్యా -ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్‌, అమెరికా ఎన్నికలపై ప్రపంచ దేశాల దృష్టి పడింది.

Publisher : Swetcha Daily

Latest

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Don't miss

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Elon Musk:ఈవీఎంలను నమ్మలేమంటున్న ఎలాన్ మస్క్

Elon Musk Flags Risk Of Poll Rigging In EVM BJP Leader Responds: ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.. అయితే పోలింగ్ సమయంలో ఈవీఎం యంత్రాలు హ్యాకింగ్ కు...

International:ఇటలీ పరువు పాయె

Italy parliament members fighting eachother before speaker podium: ఇటలీ పార్లమెంట్ బాక్సింగ్ రింగ్ గా మారింది. అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సంయమనం కోల్పోయారు. బాధ్యత కలిగిన హోదాలలో...

J&K: పాక్‌కి పారిపోయిన ముష్కరులకు నోటీసులు జారీ

Terrorists Who Fled To Pakistan If They Dont Surrender Their Properties Will Be Confiscated: గతవారం రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో భారత ఆర్మీపై టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. దీంతో...