Trump Says If I don’t Win The Presidency, There Will Be Bloodshed : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అమెరికా ఓటర్లకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒహియోలో జరిగిన బహిరంగ సభలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈసారి తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదంటూ బెదిరించాడు. అమెరికా చరిత్రలో ఈసారి ఎన్నికల తేదీ అత్యంత కీలకం కానుందని ట్రంప్ అన్నారు. డైటన్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్‌ని రిపబ్లికన్ పార్టీ ఊహించినట్టుగానే నామినీగా చేసింది. అమెరికా ఆటో పరిశ్రమ గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ రక్తపాతానికి సంబంధించి ఓ ప్రకటన చేశారు. మీరు నవంబర్ 5వ తేదీని గుర్తుపెట్టుకోండి. మీ అందరికి ఇది చాలా ముఖ్యమైన తేదీ కానుంది. అమెరికా హిస్టరీలోనే ఇప్పటివరకు జో బైడెన్ అత్యంత చెత్త అధ్యక్షుడని ఆయన అన్నారు.
మెక్సికోలో కార్లను తయారుచేసి అమెరికాలో విక్రయించాలని చైనీయులు కోరుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకవేళ నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే మాత్రం నేను దీనిని తీవ్రంగా ఖండిస్తాను. అస్సలు వారి ఆటలు సాగనివ్వను. నేను గెలవకపోతే దేశం మొత్తం రక్తపాతం అవుతుంది. 77 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఎనర్జీతో ప్రచారం చేస్తున్నాడు. అతను ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్ పదవీ కాలాన్ని భయానక ప్రదర్శనగా పిలుస్తున్నాడు. అతను బిడెన్ పరిపాలన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీవ్రంగా దాడి చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ డెమొక్రాట్లు ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.
Read More:కెనడా, పాక్ దేవాలయాల దాడులపై భారత్ రియాక్షన్
బిడెన్, ట్రంప్ మధ్య పదునైన మాటల యుద్ధం జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ దేశాన్ని అవమానించారని, దేశం గురించి చెడు చిత్రాన్ని ప్రదర్శించారని బిడెన్ అన్నారు. ఈసారి ఎన్నికలు అమెరికా ప్రజాస్వామ్య భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయని బిడెన్ అన్నారు. జనవరి 6 నాటి ఘటనను అందరూ గుర్తుచేసుకోండి అంటూ ఘతంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ… ట్రంప్ దేశానికి అత్యంత ప్రాణాంతకం కావొచ్చని తనదైన శైలిలో మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్ధతుగా ఇవ్వబోనని అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్‌పెన్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. చూడాలి మరి బైడెన్‌ని గెలిపిస్తారా,, లేక ట్రంప్‌కి మరోసారి ఛాన్స్ ఇస్తారా అనేది తెలియాలంటే అధ్యక్షుడి ఎలక్షన్స్ వరకు వేచి చూడకతప్పదు.