నిజమైన రామ భక్తులు ఆలోచన చేయాలి
రాముడు మనపై అనుగ్రహం చూపిస్తాడా!
ఆగ్రహం వ్యక్తం చేస్తాడా!
పూజిస్తే అనుగ్రహం, మోసం చేస్తే ఆగ్రహం అంతేగా!
మరి మనం పూజిస్తున్నామా! లేక ఆయన పేరు చెప్పి మోసం చేస్తున్నామా!
ఆయన జన్మస్థలంలో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మించి పూజించామా!
లేక రామ మందిర నిర్మాణం పేరుతో మోసం చేశామా!
రామ మందిరం పూర్తిగా నిర్మించకముందే హడావిడిగా ప్రారంభించామా!
లేక స్వార్థం కోసం నిర్మాణం పూర్తి కాకముందే బాలరాముడి విగ్రహం ప్రతిష్టించి ప్రారంభించామా!
రాముడి జన్మస్థలంలో నిర్మించిన రామ మందిరంలో సీతారాముల విగ్రహాలు ప్రతిష్టించి వారి కళ్యాణం జరిపామా!
లేక బాలరాముడి విగ్రహం ప్రతిష్టించామా!
సీతారాముల కళ్యాణం జరిపించి అక్షింతలు పంచామా!
లేక కళ్యాణం జరపకుండానే దేశమంతా అక్షింతలు పంచామా!
మరి ఇప్పుడు చెప్పండి రాముడిని మనం పూజించామా! మోసం చేశామా!
రాముడు మనపట్ల అనుగ్రహం చూపిస్తాడా! ఆగ్రహం వ్యక్తం చేస్తాడా! ఆలోచన చేయండి
నిజమైన హిందూలందరూ ఆలోచన చేయాలి
రామమందిరం సంపూర్ణ నిర్మాణం జరగకుండా హడావిడిగా ప్రారంభించడం మన హిందూ సాంప్రదాయమా?
అలా చేయడం మన హిందువుల ప్రతిష్టను దిగజార్చడం కాదా?
రామ మందిరం నిర్మించి సీతారాముల విగ్రహాలు ప్రతిష్టించి నిష్టాగరిష్టంగా కళ్యాణం చేయడం మన హిందువుల సాంప్రదాయం.అవునా! కాదా!
మరి రామ మందిర నిర్మాణం సందర్భంగా జరిగింది ఏమిటి?
బాలరాముడి విగ్రహ ప్రతిష్ట చేసి కళ్యాణం మరిచింది నిజమా కాదా!
ఇది మన హిందువుల ప్రతిష్టను సాంప్రదాయాలను దిగజార్చడం అందమా! లేక ప్రతిష్టను పెంచడం అందామా!
కళ్యాణం జరగకుండానే జరిగినట్లు అందరికి అక్షింతలు పంచడం మన హిందువుల సాంప్రదాయమా!
మన ప్రతిష్టను మనం దిగజార్చుకుంటామా!
ఒక రాజకీయ పార్టీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అటు రాముడిని మోసం చేస్తూ ఇటు హిందువుల సాంప్రదాయాలను తుంగలోతొక్కి మన ప్రతిష్టను దిగజారుస్తుంటే చూస్తు ఊరుకుందామా!
(ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఓ రామభక్తుడి ధర్మాగ్రహం)