Mrunal Takur: సౌందర్య , స్నేహ తర్వాత ఫ్యామిలీ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. తన ముగ్ధమనోహర అందంతో యూత్ ను కట్టిపడేస్తోంది. దానికి తోడు లక్ కలిసొచ్చి వరుసగా హిట్ సినిమాలు చేస్తండటంతో ఈ అమ్మడు డిమాండ్ మామూలుగా లేదు.
కేవలం తన నటనతో అభిమానుల్ని సొంతం చేసుకుని వరుస అవకాశాలు అందుకుంటోంది. ‘సీతారామం’తో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా విజయ దేవరకొండ హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మృణాల్ ఇలా అన్నారు. రొమాంటిక్ సీన్స్‌లో నటించడం తనకు సౌకర్యవంతంగా ఉండదట.
ముద్దు సన్నివేశాలు ఉన్న కారణంగా కొన్ని సినిమాలు వదులుకున్న సందర్భాలూ ఉన్నాయంటోంది. అలాంటి వాటిలో నటించడం తన తల్లిదండ్రులకు అస్సలు నచ్చదట. అందుకే అలాంటి సన్నివేశాలకు ముందుగానే నో చెబుతానంటోంది. అటువంటి సన్నివేశాల్లో తనని చూస్తే వాళ్ల పేరెంట్స్ ఏమనుకుంటారో అని భయం వేసేదట. అదీ కథలో భాగమేనని మంచి పాత్ర అయినప్పుడు ఈ కారణంగా సినిమాలో వదులుకోలేనని పేరెంట్స్ కు వివరించి చెప్పి కొన్ని నిబంధనలతో ఆ సన్నివేశాన్ని అంగీకరిస్తానంటోంది. అయితే ఒక్కో సందర్భాలతో ముద్దు సీన్ కు ఒప్పుకోకపోవడం కారణంగా ఎన్నో మంచి అవకాశాలు చేజారిపోయాయంటోంది మృణాల్.
ఇటీవల ఆమె ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభం రోజులను గుర్తుతెచ్చుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే ఒక భారీ ప్రాజెక్ట్‌లో తనకు అవకాశం వచ్చిందని.. కొన్ని కారణాల వల్ల దాన్ని వదులుకున్నట్లు చెప్పారు. ఇంటిమేట్ సీన్స్ ఉన్న కారణంగానే ఆ భారీ ప్రాజెక్ట్‌ను మృణాల్ రిజక్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు