– టీజేఎస్, సీపీఐ, పీసీఎం నేతలతో సీఎం రేవంత్ భేటీ
– పొత్తు అంశంపై కీలక చర్చలు
TJS, CPI, CPM, Leaders Meeting with CM Revanth Reddy: సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, వీరయ్య, మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ సహా తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, ఏ ఎన్నిక అయినా, సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నాయన్నారు.
కూనంనేని మాట్లాడుతూ, పట్టభద్రులు ఆలోచించి ఓటు వెయ్యాలని కోరారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు తమ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
కోదండరాం మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచామని గుర్తు చేశారు. తర్వాతి ఎన్నికల్లోనూ ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్‌కు అండగా ఉండాలని కోరారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేయాలన్నారు.
సీపీఎం నేత వీరయ్య మాట్లాడుతూ, విద్యాధికులు లోతుగా ఆలోచించాలని కోరారు. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకుని ఓటు వేయాలని సూచించారు.