Tuesday, December 3, 2024

Exclusive

Revanth Govt : ప్రజా పాలనకు వంద రోజులు

– వంద రోజులు.. వందల నిర్ణయాలు
– ఓవైపు ఉద్యోగాల కల్పన
– ఇంకోవైపు శాఖల ప్రక్షాళన
– నిరుద్యోగులకు నియమాక పత్రాలు
– నిరు పేదలకు సంక్షేమ సంతకాలు
– అర్థవంతంగా అసెంబ్లీ చర్చలు
– సచివాలయంలో సంచలన నిర్ణయాలు
– గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలు
– భాగ్యనగరానికి కొత్త సొబగులు
– డీఏతో సంబరాల్లో ఉద్యోగులు
– కేంద్రంతో సహకార ధోరణి
– జనం సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

100 Days Of Congress Govt In telangana : మనసుంటే మార్గం ఉంటుంది. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వస్తే అన్నివైపుల నుంచి సహకారం అందుతుంది. సమస్యలన్నీ సొల్యూషన్ వెతుక్కుంటూ వెళ్తాయి. అడ్డుపుల్లలన్నీ గాలికి కొట్టుకుపోతాయి. వంద రోజుల ప్రజా పాలనను చూశాక ఏ నోట విన్నా శభాష్ అనే మాటే రీసౌండ్ ఇస్తోందనేది హస్తం శ్రేణుల వాదన. ప్రజల కోసమే ప్రభుత్వం అనేలా ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని అంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వంద రోజుల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఏం జరిగింది? ప్రభుత్వం ఏం చేసింది? అనేది ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది ‘స్వేచ్ఛ’.

అమలైన గ్యారెంటీలు

* రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ట్రీట్‌మెంట్ – డిసెంబరు 9, 2023
* మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం – డిసెంబరు 9, 2023
* 200 యూనిట్ల (నెలకు) వరకు ఉచిత విద్యుత్ – ఫిబ్రవరి 27, 2024
* తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రూ.500కే వంట గ్యాస్ – ఫిబ్రవరి 27, 2024
* సొంతిల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు – మార్చి 11, 2024

గ్యారెంటీలకు కేటాయించిన నిధులు

* నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి గృహజ్యోతి స్కీమ్ కింద మాఫీ కోసం రూ. 2,418 కోట్లు (బడ్జెట్ కేటాయింపు).
* ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం రూ. 22,500 కోట్లు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3,500 చొప్పున మొత్తం నాలుగున్నర లక్షల ఇండ్లు
* ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి నెలకు సుమారు రూ. 250 కోట్లు అని ఆర్టీసీ అంచనా వేసింది. ఏటా దాదాపు రూ. 1,500 కోట్లు అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఫిబ్రవరిలో రూ. 374 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
* మహాలక్ష్మి స్కీమ్‌లోని రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ కోసం మార్చి నెల అడ్వాన్సుగా రూ. 80 కోట్లను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం విడుదల చేసింది. సంవత్సరానికి దాదాపు 40 లక్షల మందికి రూ. 3,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
* రైతు భరోసాకు ఒక సీజన్‌కు రూ. 9,650 కోట్ల చొప్పున రెండు సీజన్‌లకు కలిపి దాదాపు రూ. 19 వేల కోట్లుగా అంచనా. వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్‌గా ఒక్కో సీజన్‌కు సగటున కోటి టన్నులకు రూ. 5 వేల కోట్లు అవసరమని అంచనా.
* ఇంతకాలం ‘ఆసరా’ పేరుతో ఉన్న పింఛన్లను ‘చేయూత’ పేరుతో రూ. 4,000కు పెంచినందున ఏటా దాదాపు 18 వేల కోట్లు అవసరమని అంచనా.

ప్రజా పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2023, డిసెంబర్ 7న సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. పాలనా పగ్గాలు అందుకున్నది మొదలు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నారు. పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. డేరింగ్‌ డెసిషన్స్‌ తీసుకుంటూనే పార్టీ పరంగా తన స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు. ఓవైపు పార్టీలో బలం పెంచుకుంటూ ఇంకోవైపు పాలనలో నవశకం దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎంగా పాలన చేపట్టి వెంటనే ప్రగతి భవన్ కంచెలు తొలగించారు. ప్రజా భవన్‌గా మార్చారు. ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ముందుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలపై హామీ ఇచ్చిన రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం 441 మంది కార్మికుల వారసులకు నియామక పత్రాలను అందజేశారు. కొత్త ఇసుక పాలసీ తీసుకురావాలని.. అదీ కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని నిర్ణయించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు. స్పీకర్‌ పర్మిషన్‌తో మేడిగడ్డ పరిశీలనకు వెళ్లారు. కాంగ్రెస్‌, సీపీఐ, ఎంఐఎం సభ్యులు అంతా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లి బ్యారేజీ పగుళ్లను పరిశీలించారు. విజిలెన్స్‌ విచారణలో ఏం తేలిందో శాసనసభ్యులకు అక్కడే అధికారులతో వివరించేలా చేశారు సీఎం రేవంత్‌. ఇక, ఎల్బీ స్టేడియం ఉద్యోగాల పండుగకు కేంద్రంగా మారింది. వంద కాదు.. వెయ్యి కాదు ఏకంగా 25 వేలకు పైగా అభ్యర్థులకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో టీచర్ పోస్టులను మాత్రం ఫిల్ చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే దాదాపుగా 2వేల మందికి రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఒక్కో నియోజకవర్గంలో వంద కోట్లతో 20 ఎకరాల్లో ఇంటిగ్రెటేడ్‌ గురుకులాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కులగణనకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. నానక్‌రాంగూడలో అగ్నిమాపకశాఖ హెడ్‌ ఆఫీస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రాజకీయాలకు అతీతంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలను విన్న అందరూ ఏ ట్రూ లీడర్‌ అని కితాబిచ్చారు. ప్రభుత్వాల మార్క్‌ కనిపించకుండా పాలనలో కూడా రాజకీయం చేసే ఈ రోజుల్లో రేవంత్‌ రెడ్డి గత అభివృద్ధి నిర్ణయాలను కొనసాగిస్తామని అన్నారు. అంతేకాదు హైదరాబాద్‌ అభివృద్ధికి తన వద్దున్న మెగా ప్లాన్‌ను వివరించారు. చైనా తరహాలో 10 నుంచి 15 శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఫార్మాసిటీని ఒకేచోట కాకుండా ఫార్మా విలేజీలు ఏర్పాటుచేస్తామన్నారు. విజన్‌ 2050 దిశగా ముందుకు సాగుతామని సీఎం ప్రకటించారు. మూసీనది పరివాహక ప్రాంత అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, అధికారులకు సూచనలు చేస్తున్నారు. 55 కిలోమీటర్ల మేర మూసీ పరిహహక ప్రాంతాన్ని రాబోయే మూడేళ్లలో సమగ్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెడ్లలాగా ముందుకు తీసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

వాస్తవానికి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే ఏదైనా సాధ్యమే. అందుకే ఢిల్లీ పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి సఖ్యతగా ఉంటున్నారు. పార్టీలు వేరైనా పనిచేసేది ప్రజల కోసమే అన్న పద్దతిలో నడుచుకుంటున్నారు. ప్రధాని మోడీని ఎప్పుడు కలిసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే తపిస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నారు. అందులోభాగంగా ఫిబ్రవరిలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ అచీవ్మెంట్ సాధించింది. ఢిల్లీలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసింది సీఎం రేవంత్‌ బృందం. రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపేలా చేసింది సీఎం రేవంత్‌ రెడ్డి కలుపుకుపోయే గుణమే. కేంద్రం తాజా నిర్ణయంతో చౌటుప్పల్- ఆమన్‌గల్‌- షాద్‌ నగర్‌ సంగారెడ్డిని కలుపుతూ 182 కిలోమీటర్ల మేర నిర్మించనున్న దక్షిణ ట్రిపుల్‌ ఆర్‌ పనులు మరింత వేగవంతమయ్యాయి. విద్యుత్‌ శాఖపైనా సమీక్షలు జరిపిన సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొరత లేకున్నా సిబ్బందే కరెంట్‌ కట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా దుష్ర్పచారం చేస్తున్నారని అకారణంగా సరఫరా ఆపితే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రానివ్వొద్దని అధికారులను ఆదేశించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళనకు నిధుల సేకరణపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టారు. తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ ఇండియా చీఫ్‌ ప్రతినిధితో సీఎం చర్చలు జరిపారు. మెట్రో రెండో దశకు అయ్యే 18,900 కోట్ల వ్యయంలో సగానికిపైగా జైకా నుంచి సేకరించే అవకాశముంది.

ధరణితో సామాన్యులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలకు ముందునుంచి కూడా రేవంత్‌ రెడ్డి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పుకొచ్చారు. చెప్పినట్టే అధికారంలోకి రాగానే ధరణిపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు అన్ని వర్గాలతో ఇంటరాక్ట్‌ అయింది. చివరగా ఆ కమిటీ సభ్యులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయి పలు సూచనలు చేశారు. 2.45 లక్షలకుపైగా ఉన్న పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించారు. అప్రూవ్‌ చేసినా రిజెక్ట్‌ చేసినా రిపోర్టులు తప్పనిసరి అని తేల్చేశారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ప్రకారం చట్టసవరణ లేదా కొత్త చట్టం చేయడమో జరుగుతుంది. పోర్టల్‌ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర ఖజానాకు గండి పడకుండా చూడటమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి తన పాలనను సాగిస్తున్నారు. ప్రధాన ఆదాయ వనరు అయిన ఇసుక, ఎక్సైజ్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, గనులపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గనులశాఖలో ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారులను బదిలీ చేయాలని ఆదేశించారు. ఎక్సైజ్‌ విభాగంలో అక్రమాలు అరికట్టి పూర్తిస్థాయి పన్ను వసూళ్లకు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్‌ పైనా రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులపై క్లారిటీ ఇచ్చింది. ఆ లేఔట్‌లను క్రమబద్ధీకరణకు ఛాన్స్ ఇచ్చింది. ఇక సింగరేణి కార్మికలకు కోటి ప్రమాద బీమా పథకాన్ని తెలంగాణ సీఎం ప్రారంభించారు. ఈ మేరకు బ్యాంకర్లతో సింగరేణి సంస్థ ఒప్పందం చేసుకుంది. ప్రజా పాలనలో తొలి రెండు నెలలు ఆర్థికపరంగా ఆచితూచి వ్యవహరించారు రేవంత్. రాష్ట్ర ఖజానా గురించి డీటెయిల్డ్‌ రివ్యూలు చేసిన తర్వాత రాబడికి అనుగుణంగా సంక్షేమానికి ఖర్చులు పెంచేశారు. ముఖ్యంగా ఎన్నికల టైంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించారు. అందులోభాగంగానే 500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి స్కీంలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.

మరోవైపు, గత ప్రభుత్వ అవకతవకలపై దృష్టి పెట్టి విచారణలకు ఆదేశిస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై చర్యలకు ఉపక్రమించారు. అలాగే, ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్ల విషయంలో రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయని రేవంత్‌ రెడ్డి సీఎం కాకముందు నుంచే ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ఓఆర్ఆర్ టోల్‌ టెండర్లపై ఫోకస్‌ పెట్టారు. హెచ్‌ఎండీఏ పరిధిలో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికల్లో మెగా డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 11వేల 62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా విడుదల చేశారు. గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ కూడా ఇచ్చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌గా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. సిటీ శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు కేసీఆర్‌ పాలనలో బంద్‌ అయిన పంటల బీమాను మళ్లీ ప్రవేశపెడుతున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో తెలంగాణ మళ్లీ చేరుతుందన్నారు. సీఎంగా రేవంత్‌ చొరవతో ఉత్తర తెలంగాణకు రవాణాపరంగా పెద్ద ఊరట దక్కింది. హైదరాబాద్‌ కరీంనగర్‌ రాజీవ్‌ రహదారితో పాటు హైదరాబాద్‌ నాగపూర్‌ జాతీయ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్ర రక్షణశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో హైదరాబాద్‌ లోని డిఫెన్స్‌ భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి లైన్‌ క్లియరైంది. ఎలివేటేడ్‌ కారిడార్ల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా చేశారు సీఎం. ఇందిరమ్మ ఇళ్లకు నిర్ణయించారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇలా ఓవైపు సంక్షేమాన్ని అమలుపరుస్తూనే ఇంకోవైపు అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే, కేసీఆర్ సర్కార్ అవినీతిని బయటపెడుతున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...