Tuesday, May 28, 2024

Exclusive

USA : యూఎస్‌ఏలో విషాదం, నీట మునిగి ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌ సీఈఓ మృతి

The CEO of Farmost Group Died Due To Drowning: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యూఎస్‌ఏకి చెందిన రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ మిట్చ్‌ మెక్‌కానెల్‌ బంధువు, ప్రముఖ షిప్పింగ్‌ కంపెనీ ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌ సీఈఓ ఏంజెలా చావో డ్రైవింగ్‌ మోడ్‌లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్‌ మోడ్‌కు మార్చడంతో అది దగ్గరలోని చెరువులోకి అమాంతం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్‌లోని ఆస్టిన్‌ సమీపంలో ఉన్న తన ప్రైవేట్‌ అతిథి గృహానికి వెళ్లారు. 900 ఎకరాల్లో ఈ ఎస్టేట్‌ విస్తరించి ఉంది. మిల్లర్‌ వాగు వారి ఎస్టేట్‌ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు.

Read More: దుబాయ్‌ని ముంచెత్తిన వర్షాలు, నదులను తలపిస్తున్న రోడ్లు

మధ్యలో త్రీ పాయింట్‌ మూలమలుపు వచ్చింది. దానిని దాటే క్రమంలో ఏంజెలా కొంత ఖంగారుకు గురై పొరపాటున కారును రివర్స్‌ మోడ్‌లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడి మునిగిపోయింది.ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్‌ చేశారు. వెంటనే గెస్ట్‌ హౌస్‌ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు.

చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా తన ప్రాణాలను కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ జిమ్‌ బ్రేయార్‌ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి. ఆమె మృతితో అమెరికాలోని పలు కంపెనీల వ్యాపారవేత్తలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Publisher : Swetcha Daily

Latest

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Don't miss

Hyderabad:బిల్డర్ మధు హత్యకు కారణం అదేనా?

Jeedimetla Bulder Madhu murder case back daughter love marriage...

Cyclone: వణికిస్తున్న తుపాను, భయపడుతున్న జనాలు

Remal Cyclone Effect On West Bengal And Bangladesh: బంగాళాఖాతంలో...

NTR:జనం మెచ్చిన ‘ప్రభంజనం’

Nandamuri Taraka Ramarao political fame with tollywood strong crazy...

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam...

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు...

Landslides: విరిగి పడిన కొండచరియలు.. 2 వేలు దాటిన మరణాలు

Papua New Guinea: ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూగినియాలో మహా విషాదం నెలకొంది. కొండ చరియలు విరిగిపడి వేల మంది మరణించారు. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి పెళపెళ మంటూ కొండచరియలు విరిగిపడ్డాయి....

Bangladesh MP: బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వర్‌ మిస్సింగ్‌ మిస్టరీ

Bangladesh MPs Friend Paid RS 5 Crore To Murder Him West Bengal CID: బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ ఉల్ అజీమ్ అనర్ తొలుత చికిత్స కోసం భారత్‌కి వచ్చి...

kyrgyzstan:శాంతించిన కిర్గిజ్ స్తాన్

విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిజ్ స్తాన్ లో దాడులు ఫలించిన భారత రాయబారం నిలిచిపోయిన ఆందోళనలు భారతీయ విద్యార్థుల కోసం ఢిల్లీకి విమాన ప్రయాణ ఏర్పాట్లు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్న కిర్గిజ్...